Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Chanakya Niti: కొన్నిసార్లు గెలవాలంటే ఓడిపోవాలన్న ఆచార్య చాణక్యుడు
గెలవడానికి కొన్ని సార్లు ఓడిపోవాల్సి వస్తుందని చాణక్యుడి తన తత్వశాస్త్రంలో వెల్లడించాడు. ఇది కొంత సంక్లిష్టంగా అనిపిస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో యుద్ధంలో ఓడిపోవడం మరో యుద్ధంలో విజయం సాధించపెట్టగలదని చాణక్యుడు సూచిం
చాణక్యుడు గొప్ప తత్వవేత్త, రాజ సలహాదారు, గొప్ప జ్ఞాని, విశేష మార్గదర్శకుడు. ఆయన బోధనల ద్వారా చరిత్ర గతినే మార్చాడు. చంద్రగుప్తుడు రాజ్యాన్ని స్థాపించడంలో ఆచార్య చాణక్యుడు కీలక పాత్ర పోషించాడు. ఆయన అర్థశాస్త్రం, చాణక్య నీతి అనే గ్రంథాలు రచించాడు.

ఆచార్య చాణక్యుడు ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎంతో రాణించాడు. అలాగే అన్ని రంగాలలో ప్రావీణ్యం సంపాదించాడు. మానవ జీవితం సజావుగా, సాఫీగా సాగేందుకు ఎన్నో నీతి సూక్తులు చెప్పాడు. చాణక్యుడు విజయం గురించి చెబుతూ కొన్ని గెలవాలంటే ఓడిపోవాలని బోధించాడు. అసలు చాణక్యుడు అలా ఎందుకన్నాడు, దాని వెనక కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గెలవడానికి కొన్ని సార్లు ఓడిపోవాల్సి వస్తుందని చాణక్యుడి తన తత్వశాస్త్రంలో వెల్లడించాడు. ఇది కొంత సంక్లిష్టంగా అనిపిస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో యుద్ధంలో ఓడిపోవడం మరో యుద్ధంలో విజయం సాధించపెట్టగలదని చాణక్యుడు సూచించాడు.

దీర్ఘకాలిక లక్ష్యం కోసం చిన్న లక్ష్యాన్ని వదులుకోవచ్చు:
చాణక్యుడి ప్రకారం కొన్ని సార్లు పెద్ద లక్ష్యం లేదా దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించడానికి, చిన్న లక్ష్యాలను వెనక్కి తీసుకోవడం, వదులుకోవడం మంచిదే. కొన్ని విషయాలను ఎప్పుడు వదిలి పెట్టడమో తెలియడం కూడా గొప్ప తెలివేనని చాణక్యుడు చెప్పాడు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అనువుగా, అనుకూలతతో ఉండటం ద్వారా, అనవసరమైన నష్టాలను నివారించవచ్చు. భవిష్యత్తు లక్ష్యాల కోసం ఆ వనరులను సంరక్షించుకోవచ్చు. ఓడిపోయిన యుద్ధాన్ని ఎప్పుడు వదులుకోవాలో గుర్తించడం ద్వారా, మరింత ఆశాజనకమైన అవకాశాల వైపు దృష్టి అలాగే వనరులను మళ్లించవచ్చని చాణక్యుడు చెప్పాడు.

వ్యూహంలో భాగంగా ఓడిపోవడం సరైనదే:
ఒక ఓటమి మీ భవిష్యత్ లక్ష్యాన్ని, దీర్ఘకాలిక కోరికను నెరవేరుస్తుంది అంటే ఓడిపోవడం సరైనదేనని చాణక్యుడు చెప్పాడు. జీవితకాల లక్ష్యాన్ని చేరుకునే వ్యూహంలో భాగంగా మరో లక్ష్యాన్ని విడిచిపెట్టడం లేదా ఓడిపోవడం వ్యూహంలో భాగమైతే అది కచ్చితంగా సరైన నిర్ణయమే అంటాడు చాణక్యుడు. కొన్నిసార్లు నచ్చకపోయినా కొన్ని పనులు చేయాల్సి రావొచ్చు. అలాంటి వాటిలో మీకు గెలుపు కంటే ఓటమే ఎక్కువ ఆత్మ సంతృప్తిని ఇవ్వొచ్చు. అలాంటి పరిస్థితిలో ఓడిపోవడం తప్పే కాదు.

వ్యాపారంలో సరైన నిర్ణయమే:
వ్యాపారంలో నష్టాలు వస్తుంటే ఆ బిజినెస్ ను విజయవంతంగా ముందుకు సాగించేందుకు చిన్న చిన్న ప్రాజెక్టులను, ప్రభావం చూపించని వ్యక్తులను, వ్యవస్థలను మూసివేయడం, తీసివేయడం సరైన నిర్ణయమే. ఉన్న వనరులతో వ్యాపారాన్ని పునఃనిర్మించుకోవడం మంచిదే.
చాణక్య నీతి ప్రకారం గెలవడానికి ఓడిపోవడం సరైన ఆలోచన. ఎప్పుడు వెనక్కి వెళ్లాలో, ఎప్పుడు దేనిని వదులుకోవాలి గుర్తించడం ద్వారా, వనరులను కాపాడుకోవచ్చు. మరింత ఆశాజనకమైన అవకాశాల వైపు దృష్టిని మళ్లించవచ్చు. ఈ ఆలోచన ప్రతికూలంగా అనిపించినా దీని ఫలితం మాత్రం ఉత్తమంగా ఉంటుందని చాణక్యుడు చెప్పాడు.



Click it and Unblock the Notifications