Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అక్కడ ఓ మగ పురుగును కూడా రానివ్వరట... ఎందుకంటే అది ఆడవారి అడ్డా...!
స్పానిష్ లోని ఆ హోటల్ లో పురుషులకు ఎందుకు అనుమతి లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ విశ్వంలో ఎలాంటి హోటల్ అయినా మగవారికి.. ఆడవారికి అందరికీ సమాన అవకాశాలే కల్పిస్తాయి. అది ప్రైవేట్ హోటల్ అయినా.. పబ్లిక్ హోటల్ అయినా సరే ఎలాంటి వివక్ష చూపరు.

తమకు కావాల్సినంత బిల్లు కడితే చాలు ఎవ్వరికైనా హోటల్ లో ఉండేందుకు అత్యంత వేగంగా అనుమతి ఇస్తారు.

అయితే కొన్ని దేశాల్లో హోటళ్లు చాలా వెరైటీగా ఉంటాయి. అక్కడి నిబంధనలు మరింత విభిన్నంగా ఉంటాయి. కానీ ఓ దేశంలోని హోటల్ లో కండిషన్లు తెలిస్తే మీరు కచ్చితంగా షాకవుతారు.

ఎందుకంటే ఆ హోటల్ లో ఒక్క మగ పురుగును కూడా రానివ్వరట. పొరపాటున మగవారు ప్రవేశిస్తే అంతే సంగతులట...

ఆ హోటల్ లో కేవలం ఆడవారికే మాత్రమే అనుమతి ఉందట. అందులోనూ 14 సంవత్సరాల వయసున్న వారికి మాత్రమే ఆ హోటల్ లో ప్రవేశించడానికి అనుమతి ఇస్తారంట. అయితే అక్కడ ఎందుకని అలాంటి నిబంధనలు పెట్టారు... ఇంతకీ అది ఎక్కడుంది అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం...

బాలెయారిక్ దీవిలో..
స్పెయిన్ దేశంలోని బాలెయారిక్ దీవిలో ఉండే అందమైన హోటల్ లో కేవలం అమ్మాయిలకే మాత్రం అనుమతి ఉంటుందట. అది కూడా ఎవరికైతే 14 సంవత్సరాల వయసు దాటి ఉంటుందో వారిని మాత్రమే అనుమతిస్తారట..

ఒంటరిగా గడిపే మహిళలకు..
ఎవరైతే మహిళలు మగవారికి కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటారో.. ఎవరైతే ప్రశాంతంగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారో అలాంటి వారికి తమ హోటల్ సరైనదని సోమ్ డోనా హోటల్ హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.

పురుషులకు అనుమతి లేదు..
ఈ హోటల్ లో ఒక్క మగ పురుగు ఉండేందుకు అవకాశం లేదు. అంతేకాదండోయ్.. ఆ హోటల్ ఉండే పరిసరాల్లోకి మగవారు ఎట్టిపరిస్థితుల్లో అడుగు అనేదే పెట్టకూడదట. కనీసం ఆ మహిళ కుటుంబీకులు లేదా భర్తలు, స్నేహితులైనా కూడా లోపలికి అనుమతించరట.

మహిళల భద్రత..
ఈ హోటల్ కేవలం మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తుందట. మరో విషయమేమిటంటే.. ఇక్కడి సిబ్బందిని కూడా మహిళలతోనే నియమించాలని భావించాలంట. కానీ, ప్రభుత్వ నిబంధనలు ఇందుకోసం అడ్డొచ్చాయట.

కొందరి పురుషులకు..
అయితే పని విషయంలో స్త్రీ, పురుషులిద్దరి మధ్య వివిక్ష ఉండకూడదనే నిబంధనతో కేవలం కొందరు పురుషులకు హోటల్ లో పని చేసే అవకాశం ఇచ్చారట. అది కూడా అనేక షరత్తులతోనే. వీరి వల్ల మహిళలకు ఏ చిన్న ఇబ్బంది రాకుండా వారికి అనేక కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారట.



Click it and Unblock the Notifications