For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sudha Murthy Birthday:సుధామూర్తి స్ఫూర్తివంతమైన సందేశాలివే...

సుధామూర్తి బర్త్ డే సందర్భంగా ఆమె చెప్పిన కొన్ని కీలక విషయాల గురించి ఇప్పుుడ తెలుసుకుందాం.

|

ఇన్ఫోసిస్ సుధామూర్తి పరిచయం అక్కర్లేని పేరు. ట్రిలియన్ల కొద్ది సంపద ఉన్నప్పటికీ తను చాలా సింపుల్ గా ఉంటారు. ఈమె కర్నాటక రాష్ట్రం హవేరిలోని శిగ్గావ్ లో జన్మించారు. తన చిన్నప్పుడు పేరు సుధా కులకర్ణి. ఈమె 1950, ఆగస్టు 19వ తేదీన జన్మించారు. తను ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చారు. టెక్నాలజీలో కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత తను టాటా ఇంజనీరింగ్ మరియు లోకోమోటివ్ కంపెనీ(TELCO)లో ఉద్యోగం చేశారు. భారతదేశంలోనే అతి పెద్ద వాహన తయారీ సంస్థ టెల్కోకు ఎంపికైన తొలి మహిళా ఇంజనీర్ సుధామూర్తినే.

Sudha Murthy Birthday: Inspiring Quotes By Philanthropist Sudha Murthy in Telugu

మహారాష్ట్రలోని పూణేలోని టెల్కోలో పని చేస్తున్నప్పుడు, ఆర్.నారాయణమూర్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అంతే ఎలాంటి ఆటంకాలు లేకుండా వారి వివాహం పూర్తయ్యింది. వీరి ప్రేమకు గుర్తుగా అక్షత మరియు రోహన్ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు.

Sudha Murthy Birthday: Inspiring Quotes By Philanthropist Sudha Murthy in Telugu

వీరిద్దరూ కలిసి 1996 సంవత్సరంలో ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వరద బాధితులకు ఫౌండేషన్ ద్వారా సహాయం అందించారు. భారీ వర్షాల కారణంగా సర్వం కోల్పోయిన వేలాది మందికి సుమారు 10 కోట్ల రూపాయలు సహాయం చేస్తామని ప్రకటించారు. ఈ సందర్బంగా సుధామూర్తి కొన్ని సూక్తులను చెప్పారు. వాటిని కళ్లతో చూసినా.. చెవులతో విన్నా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేస్తాయి. ఇంతకీ ఆమె చెప్పిన మాటలేంటో మీరే చూడండి..

Sudha Murthy Birthday: Inspiring Quotes By Philanthropist Sudha Murthy in Telugu

'మీరు అందరినీ మెప్పించడానికి ప్రయత్నిస్తే..
మీరు ఎవ్వరినీ మెప్పించలేరు..
ఇతరుల ఆనందం కోసం మీరు జీవించడం అసాధ్యం'

'నా జీవితంలో అనుభవంతో చెబుతున్నా..
గెలుపు, అవార్డులు, డిగ్రీలు లేదా డబ్బు కంటే మంచి సంబంధాలు..
కరుణ మరియు మనశ్శాంతి కలిగి ఉండటం చాలా ముఖ్యం..'

'మన పిల్లలకు జీవితంలో రెండింటినే ఇవ్వగలం..
అవేంటంటే 1)బలమైన మూలాలు
2) శక్తివంతమైన రెక్కలు..
అప్పుడు వారెక్కడికైనా స్వేచ్ఛగా ఎగురుతూ జీవిస్తారు..
అదే సరైన స్వేచ్ఛను పొందడం..'

'సాధారణంగా, సున్నితమైన వ్యక్తులు
వాస్తవ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి
ఎక్కువ సమయం అవసరం..'

'నిజాయితీ అనేది ఏదైనా నిర్దిష్ట తరగతికి గుర్తు కాదని,
అది విద్యకు లేదా సంపదకు సంబంధించినది కాదని.. అనుభవం నాకు నేర్పింది..
ఇది ఏ యూనివర్సిటీలోనూ నేర్పించరు. చాలా మందిలో ఇది సహజంగానే మనసులోనే పుడుతుంది..'

'డబ్బు అనేది అరుదుగా మనుషులను ఏకం చేస్తుంది..
అదే డబ్బు ఎక్కువగా ప్రజలను విడగొడుతుంది..'

'ఒంటరితనం, ఏకాంతం మధ్య తేడా ఉంది..
ఒంటరితనం విసుగును తెప్పిస్తుంది..
ఏకాంతంలో అయితే మీరు మీ పనులను, మీ ఆలోచనలను పరిశీలించొచ్చు..'

'డబ్బు అనేది కాలానుగుణంగా నెమ్మదిగా రావాలి..
అప్పుడు మాత్రమే దాన్ని గౌరవిస్తారు..
ఇది ఆడవారు, మగవారు ఇద్దరికీ వర్తిస్తుంది..'

English summary

Sudha Murthy Birthday: Inspiring Quotes By Philanthropist Sudha Murthy in Telugu

Here we are talkin about the sudha murthy birthday:Inspiring quotes by philanthropist sudha murthy in Telugu. Have a look
Desktop Bottom Promotion