Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
Sun Halo: ఆకాశంలో అద్భుతం.. సూర్యుని చుట్టూ ఏం కనిపించిదో తెలుసా...
ఆకాశంలో అద్భుతం.. సూర్యుని చుట్టూ ఏం కనిపించిదో మీరే చూడండి.
సాధారణంగా సూర్యుడు మనకు ఎర్రని రంగులో కనిపిస్తాడు. ఉదయించే సూర్యుని నుండి వచ్చే వెలుగు మనకు ఎంతో మంచిది. అలాగే సూర్యుడు అస్తమించేటప్పుడు మరింత అందంగా ఉంటాడు. ఇదంతా సర్వసాధారణమే.

కానీ ఈరోజు ఆకాశంలో అద్భుతం జరిగింది. ఈరోజు సూర్యుడు చాలా ప్రత్యేకంగా కనిపించాడు. సూర్యుని చుట్టూ వలయకారంలో రంగురంగులు కనిపించాయి. అంతే కాదు సూర్యుని చుట్టూ రెయిన్ బో కలర్లు దర్శనమిచ్చాయి.

ఈ దృశ్యాలన్నీ మన దేశంలోని కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో కనిపించాయి. ఈ అందమైన ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. అయితే సూర్యుని చుట్టూ ఇలా రంగులు ఎందుకు కనిపించాయి. దీన్ని సన్ హాలో లేదా రెయిన్ బో రింగ్ అని లేదా రింగ్ ఆఫ్ సన్ అని ఎందుకు పిలుస్తారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఇంద్రధనస్సు ఆకారంలో ఎందుకు..
సాధారణంగా వర్షాకాలంలో వాతావరణంలో జరిగే మార్పు వల్ల, మనకు ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపిస్తుంది. సూర్యుని కిరణాలు నీటి బిందువులలోకి వచ్చిన తర్వాత ఇది ఏర్పడుతుంది. అదే విధంగా మంచు స్పటికాలు భూమి నుండి సుమారు 5 నుండి 6 కిలోమీటర్ల దూరంలో, వర్షాకాలంలో అయితే ఎక్కువసార్లు షట్కోణం(ఆరువైపు) ఆకారంలో ఏర్పడతాయి.

సూర్యుని చుట్టూ
సూర్యకిరణాలు క్రిస్టల్ పై పడిన తర్వాత, 22 డిగ్రీల తేడా ఉంటుంది. అప్పుడు మనం భూమి నుండి సూర్యుడిని చూసినప్పుడు, సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సు మాదిరిగా అచ్చం రింగ్ లా కనిపిస్తుంది. కొన్ని సమయాల్లో ఇది 46 డిగ్రీల వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది. ఇది మరో రకమైన ఇంద్రధనస్సులా కనిపిస్తుంది.

ప్రకాశవంతగా సూర్యుడు..
సూర్యుడు ఈరోజు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడాని ఖగోళ సంఘనటలు చెబుతున్నారు. అయితే దీని గురించి అనేక కథలు అందుబాటులో ఉన్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడు గ్రహాలకు అధిపతి. ఈరోజున సూర్యుని చుట్టూ అన్ని గ్రహాలు చేరడం వల్ల, సూర్యుడు మరింత ప్రకాశవంతంగా వ్రుత్తాకారంలో కనిపిస్తాడు. ఈ సమయంలో సూర్యునితో పాటు తమ సామర్థ్యం గురించి కూడా చర్చ జరుగుతుంది.

ఇదే మొదటిసారి కాదు..
సన్ హాలో ప్రభావం ఆకాశంలో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి ఆకారంలో సూర్యుడిని ఎన్నోసార్లు చూశారు. ఈ ఏడాది మాత్రం ఇప్పుడే తొలిసారిగా ఈ ఆకారంలో సూర్యుడు దర్శనమిచ్చాడు. అది కూడా కర్నాటక రాష్ట్రం బెంగళూరులో కనిపించాడు. దీంతో సోషల్ మీడియలో రింగ్ ఆఫ్ సన్, రెయిన్ బో సన్ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇలాంటి ఖగోళ సంఘటనను చూసే అవకాశం మనకు లభించిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి అరుదైన చిత్రాలను చూడటానికి మనకు ఈసారి అవకాశం లభించింది.



Click it and Unblock the Notifications