For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sun Transit in Aquarius : సూర్యుడు కుంభంలోకి ఆగమనం వల్ల ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు...!

సూర్యుడు కుంభరాశిలోకి ఆగమనం చేసిన సమయంలో ఏ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలలో అతి ముఖ్యమైన సూర్యుడు ఫిబ్రవరి 12వ తేదీన అంటే గురువారం నాడు రాత్రి 9:03 గంటలకు మకరరాశి నుండి కుంభ రాశిలోకి ఆగమనం చేయనున్నాడు.

Sun Transit in Aquarius on 12 February 2021 Effects on Zodiac Signs in Telugu

సూర్యుడు ఇదే రాశిలో సుమారు నెలరోజుల పాటు నివాసం ఉండనున్నాడు. సూర్యుడు ఇలా ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మకర సంక్రాంతి అంటారు.

Sun Transit in Aquarius on 12 February 2021 Effects on Zodiac Signs in Telugu

ఇలా సూర్యుడు మకరం నుండి కుంభరాశిలోకి ప్రవేశించే సమయంలో కచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది.

Sun Transit in Aquarius on 12 February 2021 Effects on Zodiac Signs in Telugu

ఈ సందర్భంగా ఏయే రాశులకు అనుకూలంగా ఉంటుంది.. ఏయే రాశులకు ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి నివారణలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

59 ఏళ్ల తర్వాత అరుదైన ఘటన.. ఇండియాతో సహా ఈ దేశాల్లో పెనుమార్పులు...!59 ఏళ్ల తర్వాత అరుదైన ఘటన.. ఇండియాతో సహా ఈ దేశాల్లో పెనుమార్పులు...!

మేష రాశి..

మేష రాశి..

సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి నుండి పదకొండో స్థానం నుండి ప్రయాణించనున్నాడు. ఈ సందర్భంగా మేష రాశికి శుభఫలితాలొస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా చాలా అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ అధికారుల సహాయంతో మీ పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. మీ కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోతాయి.

పరిహారం : ఆదివారం రోజున ఉదయం మీ కుడిచేతి ఉంగరపు వేలికి బంగారం లేదా రాగితో రూపొందించిన రూబీ రత్నం ధరించండి.

వృషభరాశి..

వృషభరాశి..

ఈ రాశి నుండి సూర్యుడు పదో స్థానం గుండా రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి కళ మరియు పని సామర్థ్యం పెరుగుతాయి. మీరు మీ లక్ష్యాలను పూర్తి చేయడంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. అలాగే మీ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీ రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం సూర్య మంత్రాన్ని జపించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు తొమ్మిదో స్థానం మీదుగా కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా మిధున రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీ తోబుట్టువుల సహకారం లభిస్తుంది. అయితే మీరు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడి నుండి మంచి రాబడి వస్తుంది. అయితే మీరు ఈ కాలంలో ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికత వైపు ఎక్కువ ఆసక్తి చూపుతారు.

పరిహారం : ఆదివారం రోజున బెల్లం దానం చేయాలి.

మీ రాశిచక్ర చిహ్నాన్ని బట్టి మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో మీకు తెలుసా?మీ రాశిచక్ర చిహ్నాన్ని బట్టి మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో మీకు తెలుసా?

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఎనిమిదో స్థానం గుండా కుంభరాశిలోకి ఆగమనం చేయనున్నాడు. ఈ సందర్భంగా ఈ రాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీరు ఒక రకమైన పూర్వీకుల ఆస్తి నుండి ఆకస్మిక ప్రయోజనాలను పొదే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో మీ తండ్రి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ సమయంలో మంచిగానే ఉంటుంది.

పరిహారం : ఐదు ముఖాలు గల రుద్రాక్షను రాత్రి వేళలో రాగి పాత్రలో నీళ్లు వేసి ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీరు తాగాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఏడో స్థానం నుండి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా సింహ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మీరు మీ పనులపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీరు కొత్త బాధ్యతలను నిర్వహిస్తారు. మీరు కొత్త వ్యక్తులను కూడా కలుస్తారు. అంతేకాదు వారి నుండి ఎక్కువ కాలం మద్దతు పొందుతారు. ఈ సందర్భంగా మీకు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు కూడా తోబుట్టువుల నుండి మద్దతు పొందుతారు.

పరిహారం : ఏదైనా పనిని ప్రారంభించే ముందు మీ తండ్రి ఆశీర్వాదం తీసుకోవాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఆరో స్థానం గుండా కుంభ రాశిలోకి ఆగమనం చేయనున్నాడు. ఈ సందర్భంగా కన్య రాశి వారికి శుభఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ నైపుణ్యాలను, సామర్థ్యాన్ని పెంచుకుంటారు. దీని వల్ల మీ పనులన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. పని ప్రదేశంలో మీకు సహకారం లభిస్తుంది. ఈ కాలంలో మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయట పడతారు.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం తూర్పు దిశలో సూర్యుడికి నమస్కారం చేస్తే, మంచి ఫలితాలొస్తాయి.

Zodiac signs: 12 రాశుల వారు ఒత్తిడిని ఎలా అధిగమిస్తారో తెలుసా...Zodiac signs: 12 రాశుల వారు ఒత్తిడిని ఎలా అధిగమిస్తారో తెలుసా...

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఐదో స్థానం ద్వారా కుంభరాశిలోకి కదలనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా బలపడతారు. ఉద్యోగులకు కార్యాలయంలో ఆకస్మికంగా భారీ మార్పులు రావచ్చు. ముఖ్యంగా బదిలీల వంటివి మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. వివాహితులకు ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారం చేయాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు నాలుగో స్థానం ద్వారా కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మీకు ప్రతికూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు పెరుగుతాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య వివాదం పెరగొచ్చు. అయితే ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారులకు ఈ కాలం మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం తూర్పు దిశలో తిరిగి ‘శ్రీ సూర్య అష్టకం' పఠించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు మూడో స్థానం నుండి కుంభరాశిలోకి ఆగమనం చేయనున్నాడు. ఈ సమయంలో ధనస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు కోర్టు కేసుల వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుది. వ్యాపారులు కొత్త ఒప్పందాల నుండి లాభాలను పొందుతారు. మీ ప్రాంతంలో మీ ఉనికిని చాటుకుంటారు. నిరుద్యోగ యువతకు శుభఫలితాలు పొందే అవకాశం ఉంది.

పరిహారం : ఆదివారం రోజున మీరు బంగారం లేదా రాగితో కూడి లాకెట్లను ధరించాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు రెండో స్థానం గుండా కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మకర రాశి నుండి సూర్యుడు వెళ్లిపోతున్న కారణంగా మీరు ప్రత్యేకమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు డబ్బును ఆదా చేసే పనులపై శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో డబ్బును మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. సూర్యుని రవాణా కారణంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం ‘ఆదిత్య స్తోత్రం' పఠించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

సూర్యుడు మకర రాశి నుండి నిష్క్రమించి కుంభరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలను పొందుతారు. పేదవారికి సహాయం చేయడం వల్ల మీకు శుభఫలితాలొస్తాయి. ప్రేమ విషయంలో కొంచెం కొత్తగా ఉంటుంది. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది.

పరిహారం : ఆదివారం రోజున రాగిని దానం చేయాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు పన్నెండో స్థానం నుండి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అలాగే మీరు శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే భారీ నష్టం వాటిలొచ్చు. మీరు పొదుపుపై కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీరు కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మీరు మీ భవిష్యత్తు గురించి ఎక్కువ శ్రద్ధ వహించాలి.

పరిహారం : ప్రతిరోజూ 108 సార్లు గాయత్రి మంత్రాన్ని జపించాలి.

English summary

Sun Transit in Aquarius on 12 February 2021 Effects on Zodiac Signs in Telugu

Sun Transit in Aquarius Effects on Zodiac Signs in Telugu.The Sun Transit in Aquarius will take place on 12 February 2021. Learn about remedies to perform in Telugu.
Desktop Bottom Promotion