Latest Updates
-
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా..
Surya Gochar February 2023: కుంభంలోకి సూర్యుడి సంచారం, ఈ రాశుల వారికి ఎంతో శ్రేయస్కరం
సూర్య-శని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి ప్రయోజనం చేకూర్చనుంది. మరికొన్ని రాశుల వారు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం సూర్యుడు. ఎందుకంటే సూర్యుడు ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేయగలడు. అలాగే అతంత్య సామర్థ్యం కలిగిన గ్రహం. సూర్యుడి సంచారం ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. 2023 సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తేదీన సూర్యుడు మకరరాశి వీడి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. కుంభరాశిలోనే నెల రోజులకు పైగా ఉంటాడు. మార్చి 15వ తేదీ వరకు సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు. అప్పటికే కుంభరాశిలో ఉండే శనితో సూర్యుడు కలవనున్నాడు.

సూర్య-శని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి ప్రయోజనం చేకూర్చనుంది. మరికొన్ని రాశుల వారు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:
సూర్యుడు 5వ గృహాధిపతిగా ఉంటాడు. కుంభ రాశిలోని 11వ ఇంట్లో సంచరించనున్నాడు. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. స్నేహితుల మద్దతు ఉంటుంది. వ్యాపారపరంగా లాభాలు వస్తాయి. ఆర్థికంగా మంచి పొజిషన్ కు వెళ్తారు. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అయితే కుటుంబ విషయాల్లో మాత్రం జాగ్రత్త అవసరం. కొన్ని వివాదాలు వచ్చే అవకాశం ఉంది. సామరస్యపూర్వకంగా ఉంటూ ఓపికగా వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త మానసిక ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది.

వృషభ రాశి:
వృషభ రాశి వారి 4వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు 10వ ఇంట్లోకి రాబోతున్నాడు. కుంభరాశిలో సూర్యుడు, శని కలయిక మూలత్రికోణ రాశిలో చాలా సౌకర్యంగా ఉంటుంది. సూర్యుడు ఇక్కడ సుఖంగా ఉండలేడు కానీ దిశా బలం లేదా దిగ్బలాన్ని పొందుతాడు. కుంభరాశిలో సూర్య సంచారం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి, ఏదైనా ఎన్జీవోలో పని చేస్తున్న వారికి కలిసి రానుంది. కళాత్మక రంగంలో ఉన్నవారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వివాహ బంధంలో చిన్న చిన్న కలహాలు జరగవచ్చు. చదువులో కూడా కొంత ప్రతికూలత ఉండొచ్చు.

తులారాశి:
11వ గృహాధిపతి 5వ ఇంటికి వెళ్తాడు. తులారాశి వారు స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. కుంభరాశిలో సూర్య సంచార సమయంలో విలాసాలు పెరగవచ్చు. ఆర్థికంగా లాభపడతారు. విద్యార్థులు చదువుల్లో విజయం సాధిస్తారు. కొంత కష్టపడితే గెలుపు సులభంగానే సొంతం అవుతుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నా సమయమే వాటిని పరిష్కరిస్తుంది.

వృశ్చిక రాశి:
10వ గృహాధిపతి, 4వ ఇంటికి వృశ్చిక రాశిలోకి వెళ్లడం వల్ల స్థానికులు వృత్తిపరమైన విజయాన్ని పొందుతారు. కొత్త కెరీర్ అవకాశాలు వస్తాయి. జీవితంలో అన్ని విలాసాలు, సౌకర్యాలు అనుభవించడానికి ఇది వృశ్చిక రాశి వారికి మంచి సమయం. ఈ కాలంలో పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. కుంభరాశిలో సూర్య సంచారం వృశ్చిక రాశి వారికి మంచి సమయం ఇది.

కుంభరాశి:
సూర్యుడు 1వ ఇంటికి 7వ గృహాధిపతిగా మారుతున్నందున స్వీయ మెరుగుదలకు ప్రాథమిక దృష్టి ఉండవచ్చు. సమాజంలో బలమైన ఇమేజ్ ను నిర్మించుకోవాలని అనుకోవచ్చు. కుంభరాశిలో సూర్యుని సంచార సమయంలో కుంభరాశి వారి కోరికలు నెరవేరుతాయి. కృషికి, నిజాయితీకి ప్రతిఫలం లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినా అవి తీరిపోతాయి.



Click it and Unblock the Notifications
