Latest Updates
-
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే!
కుంభంలోకి సూర్యుడి రవాణా సమయంలో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి...!
2022లో ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం సూర్యుడు. ఎందుకంటే ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న ఏకైక గ్రహం సూర్యుడు. అందుకే సూర్యుడిని అన్ని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడిని శక్తి మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు.

అలాంటి సూర్యుడు 2022 సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తేదీన అంటే ఆదివారం నాడు తెల్లవారుజామున 3:12 గంటలకు మకరరాశి నుండి కుంభ రాశిలోకి ఆగమనం చేయనున్నాడు. సూర్యుడు ఇదే రాశిలో సుమారు నెలరోజుల పాటు నివాసం ఉండనున్నాడు.

ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావమే పడనుంది. ముఖ్యంగా కొన్ని రాశాల వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా ఏయే రాశులపై ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 11వ స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. మీ వేతనం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. మీరు చేసే పనులన్నీ ఎలాంటి ఆటంకాల్లేకుండా పూర్తవుతాయి. మీరు దేంట్లో అయినా పెట్టుబడి పెడితే విజయం సాధిస్తారు. అదే సమయంలో మీరు కొన్ని పాత రుణాలను కూడా వదిలించుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 10వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కారణంగా మీరు చేసే అన్ని పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో మంచి గౌరవాన్ని పొందుతారు.ఈ కాలంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోగలరు. ఒకటి కంటే ఎక్కువ మాధ్యమాల ద్వారా ఆదాయాన్ని అందుకోవచ్చు. ఈ కాలంలో మీ వ్యాపారులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారు కూడా ఈ కాలంలో మంచి ఫలితాలను పొందుతారు.

మిధున రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 9వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు రావొచ్చు. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు జీతాల పెరుగుదల గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీకు కొత్త ప్రాజెక్టులు నిర్వహించే బాధ్యత కూడా రావొచ్చు.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 8వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి కొన్ని ఒడిదుడుకులు ఎదురువతాయి. ముఖ్యంగా మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీకు మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో మీ ఉత్తమ పనితీరుపై ఫోకస్ పెట్టడం మంచిది.

సింహ రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 7వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో సింహ రాశి వారికి ప్రతికూల సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారులు ఈ సమయంలో ఆశించిన ఫలితాలను పొందలేరు. మీ కెరీర్ విషయంలో కూడా గందరగోళంగా ఉండొచ్చు. ఇలాంటి సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి.

కన్య రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 6వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీ శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు. మరోవైపు ఉద్యోగులు కొన్ని శుభవార్తలను వింటారు. ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా కొన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

తుల రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 5వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు రావొచ్చు. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు మంచి కెరీర్ అవకాశాలను పొందొచ్చు. మీరు సానుకూల శక్తిని పొందుతారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 4వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీరు వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు పని మరియు ఇంటి పనుల మధ్య బ్యాలెన్స్ మెయింటెన్ చేసేందుకు కొంత కష్టంగా ఉండొచ్చు. ఈ సమయంలో మీకు మానసికంగా బలహీనంగా ఉండొచ్చు.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 3వ పాదం గుండా సంచారం చేయనున్నాడు. ఈ రాశి వారికి సూర్యుడి ప్రయాణం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు నిరుద్యోగిగా ఉండి కొత్త ఉద్యోగం కోసం ఆశగా ఎదురుచూస్తుంటే.. ఈ సమయంలో మీ శోధన ముగిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరోవైపు ఉద్యోగులు చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే, మీ కోరిక నెరవేరినట్టే. ఈ కాలంలో మీరు కొత్త పనులను కూడా ప్రారంభించగలరు. మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందొచ్చు.

మకర రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 2వ స్థానం గుండా రవాణా చేయనున్నాడు
ఈ రాశి వారికి సూర్యుని రవాణా చాలా శుభ ప్రదంగా ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా మీరు ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీకు ఇంటి సభ్యులతో ఏదో ఒక విషయంలో వాగ్వాదం ఉండొచ్చు.

కుంభ రాశి..
ఇదే రాశిలోకి సూర్యుడు ప్రవేశించనున్నాడు. ఈ కాలంలో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. దాని వల్ల నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

మీన రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ రాశి వారికి ఈ సమయం మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. మీ బడ్జెట్ దిగజారడం వల్ల భవిష్యత్తులో మీకు సమస్యలు రావొచ్చు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు 2022 సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తేదీన అంటే ఆదివారం నాడు తెల్లవారుజామున 3:12 గంటలకు మకరరాశి నుండి కుంభ రాశిలోకి ఆగమనం చేయనున్నాడు. సూర్యుడు ఇదే రాశిలో సుమారు నెలరోజుల పాటు నివాసం ఉండనున్నాడు. సూర్యుడు ఇలా ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మకర సంక్రాంతి అంటారు. మరోవైపు ఈ రాశిలో శని సంచారం కూడా ప్రారంభమైన వెంటనే కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలు రానున్నాయి.



Click it and Unblock the Notifications