Latest Updates
-
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
కుంభంలోకి సూర్యుడి సంచారం.. ఈ 4 రాశులకు అత్యంత అనుకూలం...!
2022లో ఫిబ్రవరి 13వ తేదీన సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశుల వారికి శుభ ఫలితాలొస్తాయట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం సూర్యుడు. ఎందుకంటే ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న ఏకైక గ్రహం సూర్యుడు.

అలాంటి సూర్యుడు 2022 సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తేదీన అంటే ఆదివారం నాడు మకరరాశి నుండి కుంభ రాశిలోకి ఆగమనం చేయనున్నాడు. సూర్యుడు ఇదే రాశిలో సుమారు నెలరోజుల పాటు నివాసం ఉండనున్నాడు. సూర్యుడు ఇలా ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మకర సంక్రాంతి అంటారు.

మరోవైపు ఈ రాశిలో శని సంచారం కూడా ప్రారంభమైన వెంటనే కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఏయే రాశులకు ప్రత్యేక ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి సూర్యుని సంచారం వల్ల శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. మీ వేతనం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. మీరు చేసే పనులన్నీ ఎలాంటి ఆటంకాల్లేకుండా పూర్తవుతాయి. మీరు దేంట్లో అయినా పెట్టుబడి పెడితే విజయం సాధిస్తారు. అదే సమయంలో మీరు కొన్ని పాత రుణాలను కూడా వదిలించుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి..
ఈ రాశి వారికి సూర్యుని రవాణా కారణంగా మంచి సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు చేసే పనిలో పురోగతి కనిపిస్తుంది. ఈ కాలంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోగలరు. ఒకటి కంటే ఎక్కువ మాధ్యమాల ద్వారా ఆదాయాన్ని అందుకోవచ్చు. ఈ కాలంలో మీ వ్యాపారులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారు కూడా ఈ కాలంలో మంచి ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి ప్రయాణం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు నిరుద్యోగిగా ఉండి కొత్త ఉద్యోగం కోసం ఆశగా ఎదురుచూస్తుంటే.. ఈ సమయంలో మీ శోధన ముగిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరోవైపు ఉద్యోగులు చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే, మీ కోరిక నెరవేరినట్టే. ఈ కాలంలో మీరు కొత్త పనులను కూడా ప్రారంభించగలరు. మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందొచ్చు.

మకర రాశి..
ఈ రాశి వారికి సూర్యుని రవాణా చాలా శుభ ప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు లాభాలు పొందేందుకు అనేక అవకాశాలు వస్తాయి. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలు చాలా ఆహ్లాదకరంగా సాగుతాయి. మీరు చేసే ప్రతి పనిలో మీ జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో బాస్ నుండి ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరును అందరూ బాగా మెచ్చుకుంటారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు 2022 సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తేదీన అంటే ఆదివారం నాడు మకరరాశి నుండి కుంభ రాశిలోకి ఆగమనం చేయనున్నాడు. సూర్యుడు ఇదే రాశిలో సుమారు నెలరోజుల పాటు నివాసం ఉండనున్నాడు. సూర్యుడు ఇలా ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మకర సంక్రాంతి అంటారు. మరోవైపు ఈ రాశిలో శని సంచారం కూడా ప్రారంభమైన వెంటనే కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలు రానున్నాయి.
సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశించిన వెంటనే ద్వాదశ రాశులలోని నాలుగు రాశుల వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలు రానున్నాయి. ఆ రాశుల వివరాలు ఇలా ఉన్నాయి. అందులో 1.మేష రాశి 2.ధనస్సు రాశి 3.మకర రాశి 4.వృషభరాశి



Click it and Unblock the Notifications