Latest Updates
-
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్పీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.!
Surya Gochar 2022 :మేషంలోకి సూర్యుని సంచారం..ఈ రాశులకు తీవ్ర నష్టం...!
2022లో ఏప్రిల్ 14వ తేదీన మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య భగవానుడు లేకుంటే ఈ లోకమంతా చీకటిమయమే. ఈ జగత్ అంతటికీ కాంతిని ప్రసాదించే గొప్ప శక్తి ఒక్క సూర్యుడికి మాత్రమే ఉంది. అందుకే సూర్యుడిని వేయి కిరణాలు ప్రసాదించే భానుడిగా కొలుస్తారు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో సూర్యునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యుడిని రాజుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో సూర్యుడు తన స్థానాన్ని మారనున్నాడు. సూర్యుడు ఇలా తన దిశను మార్చుకోవడాన్ని సంక్రాంతి అంటారు.

ఏప్రిల్ నెలలో మీన రాశి నుండి నిష్క్రమించి మేష రాశిలోకి సంచారం చేయనున్నాడు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన గురువారం ఉదయం 8:39 గంటలకు సూర్యుడు ప్రవేశించనున్నాడు. ఇలా సూర్యుని సంచారం వల్ల ప్రతి ఒక్కరి జీవితంపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ద్వాదశ రాశులలో ఏయే రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి సూర్యుని సంచారం వల్ల ప్రతికూల ఫలితాలు ఏర్పడొచ్చు. ఈ కాలంలో మీకు అనవసర శ్రమ, కోపం పెరుగుతాయి. మీరు చేసే ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. మీరు ఎక్కువ ఖర్చులు చేయడం మానుకోవాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి.

వృషభ రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 12వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీకు కొన్ని సమస్యలు ఏర్పడొచ్చు. ముఖ్యంగా ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు ఎదురుకావొచ్చు. నిద్రలేమి వంటి సమస్యలతో అనేక ఆటంకాలు ఏర్పడొచ్చు. ఆర్థిక పరంగా నష్టం వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే వారు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 11వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు మంచి ఫలితాలను పొందొచ్చు. మీకు రావాల్సిన డబ్బు సకాలంలో దొరుకుతుంది. మీరు శత్రువులను కూడా ఓడిస్తారు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీరు కొత్త పనుల పట్ల ఆసక్తి చూపొచ్చు.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 10వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీకు శుభ ప్రదమైన ఫలితాలు రావొచ్చు. ఈ సమయంలో మీ ముఖ్యమైన పనుల్లో విజయం సాధించొచ్చు. మీ బంధువులు మీకు ఎక్కువ గౌరవం ఇస్తారు. ఉద్యోగులకు, వ్యాపారులకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

సింహ రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 9వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీకు మిశ్రమ ఫలితాలు రావొచ్చు. మీరు ఈ సమయంలో కష్టపడి పని చేయాలి. ఆర్థిక పరమైన విషయాల్లో అనేక అడ్డంకులు రావొచ్చు. మీ ముఖ్యమైన పనుల్లో పూర్తి చేయడంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి.

కన్య రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 8వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు రావొచ్చు. ఈ సమయంలో మీకు పని భారం పెరుగుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో కూడా నష్టం రావొచ్చు. మీ ఖర్చులను కూడా అదుపులో ఉంచుకోవాలి. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు రావొచ్చు.

తుల రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 7వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో తుల రాశి వారికి ప్రతికూల ఫలితాలు రావొచ్చు. వ్యాపారులకు ఈ సమయంలో నష్టాలు రావొచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో సమస్యలు పెరగొచ్చు. దీంతో మీరు మానసిక క్షోభను అనుభవిస్తారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 6వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీకు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు ఈ సమయంలో ఆరోగ్య పరంగా ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తారు. అకస్మాత్తుగా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. కొన్ని శుభవార్తలను కూడా వింటారు. మీ ధైర్యం, శక్తితో శత్రువులను ఓడిస్తారు. సమాజంలో కూడా మీకు గౌరవం పెరుగుతుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 5వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మీకు ఆకస్మికంగా ధన నష్టం రావొచ్చు. మీ రిలేషన్ షిప్ లో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. మీ ప్రియమైన వారి నుండి మీరు విడిపోయే అవకాశం ఉంది. మీ పనులు కూడా నెమ్మదిగా సాగుతాయి.

మకర రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 4వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలొస్తాయి. మీకు చాలా విషయాల్లో అనవసర భయం ఉంటుంది. అనారోగ్యం కారణంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ఆనందం తగ్గుతుంది. మీ ఇంటికి సంబంధించి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కుంభ రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 3వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీకు శుభ ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీరు శత్రువులను సైతం ఓడిస్తారు. మీ పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తారు. మీరు కొన్ని శుభవార్తలను కూడా వింటారు.

మీన రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 2వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మీరు చేసిన పనులతో ఆర్థిక పరంగా నష్టం ఎదురుకావొచ్చు. అనవసరమైన పట్టుదల వల్లే ఇదంతా జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కాలంలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేయొచ్చు. మరోవైపు మీకు ఏదైనా అవమానం జరుగుతుందనే భయం కూడా ఉంటుంది.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్లో దొరికినది మరియు ఊహాలపై ఆధారపడింది. మీరు వీటిని పరిగణనలోకి తీసుకునే ముందు వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుని సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోగలరు. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి సంబంధం లేదని గుర్తించగలరు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో సూర్యునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యుడిని రాజుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో సూర్యుడు తన స్థానాన్ని మారనున్నాడు. సూర్యుడు ఇలా తన దిశను మార్చుకోవడాన్ని సంక్రాంతి అంటారు. ఏప్రిల్ నెలలో మీన రాశి నుండి నిష్క్రమించి మేష రాశిలోకి సంచారం చేయనున్నాడు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన గురువారం ఉదయం 8:39 గంటలకు సూర్యుడు ప్రవేశించనున్నాడు. ఇలా సూర్యుని సంచారం వల్ల ప్రతి ఒక్కరి జీవితంపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది.



Click it and Unblock the Notifications