For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూర్యుడు కర్కాటకంలోకి సంచారం... ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే...

2021లో జులై 16న సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో అధిపతిగా పరిగణించే సూర్యుడు తన స్థానాన్ని మారబోతున్నాడు. జులై 16వ తేదీన, అంటే శుక్రవారం నాడు మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి ఆగమనం చెందనున్నాడు.

Sun Transit in Cancer On 16 July 2021 Effects on Zodiac Signs in Telugu

ఇలా సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. జులై 16వ తేదీ సాయంత్రం 4:41 గంటల సమయంలో మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు.
Sun Transit in Cancer On 16 July 2021 Effects on Zodiac Signs in Telugu

సుమారు నెలరోజుల పాటు అంటే ఆగస్టు 17వ తేదీన ఇదే రాశిలో సంచారం చేయనున్నాడు. అనంతరం తన సొంత రాశి అయినా సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు.

Sun Transit in Cancer On 16 July 2021 Effects on Zodiac Signs in Telugu

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. సూర్యుడు మిధున రాశి నుండి కర్కాటకరాశిలోకి ప్రవేశించేటప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. అయితే కొన్ని రాశుల వారికి సూర్యుడి వల్ల అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఏయే రాశిపై ఎలాంటి ప్రభావం పడనుందో ఇప్పుడు తెలుసుకుందాం...

Sun Transit in Cancer:కర్కాటకంలో సూర్యుడి రవాణా.. ఈ రాశులకు ప్రత్యేక ఫలితాలు.. మీ రాశి ఉందేమో చూడండి...Sun Transit in Cancer:కర్కాటకంలో సూర్యుడి రవాణా.. ఈ రాశులకు ప్రత్యేక ఫలితాలు.. మీ రాశి ఉందేమో చూడండి...

మేష రాశి..

మేష రాశి..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశి నుండి సూర్యుడు రెండో స్థానం గుండా రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో గందరగోళం ఉంటుంది. మీ ఇంట్లో గొడవలు పెరగొచ్చు. దీంతో పాటు మీ పనిలో అడ్డంకులు రావొచ్చు. ఆరోగ్య పరంగా ఈ సమయంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

వృషభ రాశి..

వృషభ రాశి..

సూర్యుడు ఈ రాశి నుండి మూడో స్థానం గుండా సంచరించనున్నాడు. ఈ సమయంలో వృషభరాశి వారి శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలంగా ఉంటుంది. మీ సహోద్యోగులు మీకు అద్భుతంగా సహకరిస్తారు. విద్యార్థులకు కూడా ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. మీరు చదువుతో పాటు ఆటల్లోనూ అద్భుతంగా రాణిస్తారు. ప్రతిరోజూ ఆవుకు బెల్లం తినిపించడం వల్ల మీకు మరిన్ని ప్రత్యేక ఫలితాలొస్తాయి. అయితే ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు నాలుగో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సమయం ఆదాయం పెరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగులకు ఈ సమయంలో కొన్ని మార్పులు వస్తాయి. మీ స్వభావంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో కొంత విభేదాలు ఉండొచ్చు. మరోవైపు విద్యార్థులకు మంచి ఫలితాలు రావొచ్చు.

<strong>జులైలో ఈ రాశులకు శృంగార పరంగా అద్భుతంగా ఉంటుదట.. మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!</strong></p><p>జులైలో ఈ రాశులకు శృంగార పరంగా అద్భుతంగా ఉంటుదట.. మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఐదో స్థానం నుండి కర్కాటకంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి సూర్యుని ఆశీస్సులు లభించొచ్చు. వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మానసికంగా చాలా ఒత్తిడిని అనుభవిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంటుంది. మీరు ఆదాయం పెంచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఆరో పాదం గుండా కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది. మీరు పేదలకు సహాయం చేయడానికి అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు సానుకూలంగా ఉంటుంది. అయితే మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వ్యాపారులు ఈ కాలంలో మంచి ఫలితాలు పొందొచ్చు. ఉద్యోగులు ఈ సమయంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ సందర్భంలో కన్య రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ కాలంలో మీరు కుటుంబ సభ్యుల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూలంగా ఉంటుంది. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు పై అధికారులతో సత్సంబంధాలను పెంచుకోవాలి. సమాజంలో కూడా మీ గౌరవం పెరుగుతుంది. దీంతో పాటు మీరు ఓ రకమైన ఆందోళనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

<strong>July 2021 Planets Transit:జులైలో నాలుగు గ్రహాల పరివర్తనం.. రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...</strong></p><p>July 2021 Planets Transit:జులైలో నాలుగు గ్రహాల పరివర్తనం.. రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...

తుల రాశి..

తుల రాశి..

ఈ సమయంలో మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది. అంతేకాకుండా మీరు చేపట్టే ప్రతి ప్రయత్నాల్లో మీరు విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీరు పని చేసే రంగంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ గురించి కొన్ని శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

సూర్యుడి రవాణా వల్ల ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు రావొచ్చు. మీరు తక్కువ ప్రయత్నంలో ఎక్కువ ఫలితాలు పొందొచ్చు. ఉద్యోగులకు కూడా ఈ సమయంలో ప్రమోషన్ వంటివి రావొచ్చు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. విద్యార్థులకు విద్య విషయంలో అడ్డంకులు తొలగిపోవచ్చు. ఈ సమయంలో మీరు మతపరమైన పనులలో ఎక్కువ శ్రద్ధ చూపొచ్చు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు సూర్యుడి సంచారం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీరు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. స్టాక్ మార్కెట్ కు సంబంధించి పని చేసే వ్యక్తులు మంచి ఆర్థిక లాభాలను పొందగలరు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కావాల్సిన బదిలీ పొందొచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు పెరుగుతాయి. మీ స్వభావంలో కోపం మరియు చారకు అధికంగా ఉంటుంది.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు సూర్యుడి రవాణా వల్ల ప్రతికూల ఫలితాలను పొందుతారు. వ్యాపారులు ఈ సమయంలో నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో చెడు ఫలితాలు రావొచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో కొన్ని వివాహ ప్రతిపాదనలు పొందొచ్చు. మీరు ఇప్పటికే వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో అపార్థాలు పెరుగుతాయి. ఈ కాలంలో మీరు కోపం మరియు అహంకారాన్ని నివారించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల చెడు ప్రభావం పడొచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించొచ్చు. పని విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వ్యాపార నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. ఈ మొత్తంలో నిరుద్యోగులకు ఉపాధి కూడా లభించే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి సూర్యుడి సంచారం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి. ఈ సమయం అన్ని రంగాల వారికి చాలా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగో విద్యార్థులకు, పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి కచ్చితంగా విజయం లభిస్తుంది. అయితే ప్రేమికులకు ఈ సమయం కొంత నిరాశగా ఉంటుంది. మీరు ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు. అంతేకాదు మీరు మీ భాగస్వామితో గొడవపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు వివాదాలకు చాలా దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీరు కొన్ని డబ్బుకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కొంటారు.

English summary

Sun Transit in Cancer On 16 July 2021 Effects on Zodiac Signs in Telugu

Here we are talking about the sun transit in cancer on 16 july 2021 effects on zodiac signs in Telugu. Read on
Desktop Bottom Promotion