Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
Sun Transit in Gemini on 15 June 2021: మిధునంలోకి సూర్యుడి సంచారంతో.. ఈ 5 రాశులకు అద్భుత ప్రయోజనాలు...!
2021లో సూర్యుడు మిధునంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశుల వ్యాపారులకు అద్భుత ప్రయోజనాలు
హిందూ క్యాలెండర్ ప్రకారం, జ్యేష్ఠ అమావాస్య రోజున సూర్య గ్రహణం పూర్తయిన తర్వాత సూర్యుడు తన స్థానాన్ని మారబోతున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు జూన్ 15వ తేదీన, అంటే మంగళవారం నాడు వృషభరాశి నుండి మిధున రాశిలోకి సంచారం చేయనున్నాడు.

ఇలా సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. జూన్ 15వ తేదీ ఉదయం 5:49 గంటల సమయంలో వృషభరాశి నుండి మిధున రాశిలోకి ప్రవేశించనున్నాడు. సుమారు నెలరోజుల పాటు సంచారం అంటే జులై 16వ తేదీ సాయంత్రం 4:41 వరకు ఇక్కడే సంచారం చేయనున్నాడు. అనంతరం కర్కాటక రాశిలోకి రవాణా చేయనున్నాడు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. సూర్యుడు వృషభ రాశి నుండి మిధున రాశిలోకి ప్రవేశించేటప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది.

అయితే కొన్ని రాశుల వారికి సూర్యుడి వల్ల అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. అందులోనూ వ్యాపారులకు మరింత సానుకూల ఫలితాలు రానున్నాయి. అందులో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి.

వృషభ రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు నిష్క్రమించి, మిధున రాశిలోకి ప్రవేశించడం వల్ల వృషభరాశి వారి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగులకు ప్రమోషన్ వంటి శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీరు ఊహించిన లాభాలొస్తాయి. ఆస్తికి సంబంధించిన వంటి వాటిలో మీరు పెట్టుబడి పెట్టడం మీకు చాలా మంచిగా ఉంటుంది. అయితే ఈ కాలంలో మీరు అనవసరమైన చర్చల్లో పాల్గొనకుండా ఉండాలి.

మిధున రాశి..
వృషభ రాశి నుండి ఈ రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మిధున రాశి వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సమయంలో ఉద్యోగులకు పురోగతి లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంతి. మీ కుటుంబంలో మీకు ఇచ్చిన బాధ్యతలను కూడా విజయవంతంగా నెరవేర్చగలుగుతారు. మీ యజమాని కూడా మీ పనితీరు పట్ల చాలా సంతోషంగా ఉంటారు.

సింహ రాశి..
సూర్యుడు మిధున రాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారిలో రచన, మర్కెటింగ్, అమ్మకాలతో సంబంధం ఉండే వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. మీరు ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను వెతుక్కుంటారు. మీ కుటుంబ జీవితంలో అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మీ ఆరోగ్య సమస్యలు కొన్ని పెరగొచ్చు. మీరు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

కన్య రాశి..
మిధున రాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు రావొచ్చు. దీంతో పాటు మీకు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. మీరు రూపొందించిన ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఏదైనా పెద్ద ఒప్పందం ఉంటే, దాని వల్ల మీకు భవిష్యత్తులో మంచి ప్రయోజనం వస్తుంది. దీని వల్ల మీరు ఊహించిన లాభాలను పొందుతారు.

కుంభ రాశి..
సూర్యుడు వృషభరాశి నుండి మిధున రాశిలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులకు మరియు వ్యాపారులకు రెండింటిలో పురోగతి లభించే అవకాశం ఉంది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. మరోవైపు మీరు పిల్లల విద్య గురించి కొంత ఆందోళన చెందుతారు. ఇంకోవైపు మీరు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుభవం ఉన్న వారి సలహా తీసుకుని పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి లాభాలొస్తాయి.



Click it and Unblock the Notifications