For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తులరాశిలోకి సూర్యుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!

2021లో అక్టోబర్ 17న తులరాశిలోకి సూర్యుడి సంచారంతో రాశిచక్రాలపై పడే ప్రభావం, పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో సూర్యుడిని అధిపతిగా పరిగణిస్తారు. సూర్యుడు ప్రతి నెలా ఓ రాశి నుండి మరో రాశిలోకి మారుతూ ఉంటాడు. 2021 సంవత్సరంలో అక్టోబర్ 17వ తేదీ నుండి మధ్యాహ్నం 1:00 గంట సమయంలో సూర్యుడు కన్య రాశి నుండి తులరాశిలోకి ప్రవేశించనున్నాడు.

Sun Transit in Libra On 17 October 2021 Effects on Zodiac Signs in Telugu

ఇదే రాశిలో సూర్యుడు 16వ తేదీ నవంబర్ 2021 వరకు ఉంటాడు. అనంతరం వృశ్చిక రాశిలోకి సంచారం చేయనున్నాడు. తులరాశిలో సూర్యుని సంచారం వల్ల కొన్ని రాశుల వారికి బలహీనంగా ఉంటుంది. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Sun Transit in Libra On 17 October 2021 Effects on Zodiac Signs in Telugu

ఈ సందర్భంగా ద్వాదశ రాశిచక్రాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడనుంది.. ఏ రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి.. ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వారం మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి...ఈ వారం మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఏడో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీలో అహం పెరగొచ్చు. దీని వల్ల కుటుంబం, స్నేహితులు, సహోద్యోగుల మధ్య విభేదాలు రావొచ్చు. ఈ సమయంలో మీకు ఎన్ని సమస్యలు ఎదురైనా ఓపికగా వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా ఈ వారం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఆరో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు మిశ్రమ ఫలితాలను పొందొచ్చు. మరోవైపు మీరు శత్రువుల జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరినీ అంత సులభంగా నమ్మకండి. విద్యార్థులు కూడా ఈ కాలంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో మానసిక ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులు సమస్యల వల్ల కోర్టు వరకు వెళ్లొచ్చు. మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఐదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ రవాణా వల్ల ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ప్రేమ సంబంధాల్లో సానుకూల ఫలితాలు రావొచ్చు. ఈ రాశి విద్యార్థులకు ఈ కాలంలో మంచి ఫలితాలొస్తాయి. అయితే మీకు కొన్ని సందర్భాల్లో విశ్వాసం తగ్గిపోవచ్చు. విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు విజయవంతం కావొచ్చు.

వాస్తు ప్రకారం.. తాబేలు బొమ్మను ఇంట్లో అక్కడ పెడితే.. శుభ ఫలితాలొస్తాయంట...!వాస్తు ప్రకారం.. తాబేలు బొమ్మను ఇంట్లో అక్కడ పెడితే.. శుభ ఫలితాలొస్తాయంట...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు నాలుగో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే మీ కుటుంబ జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే మీ ఉద్యోగం ప్రమాదంలో పడొచ్చు. ఈ కాలంలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు సకాలంలో వైద్యుడిని సంప్రదించాలి.

సింహ రాశి..

సింహ రాశి..

సూర్యుడు తులరాశిలోకి రవాణా చేయడం వల్ల ఈ రాశి వారికి ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది. అయితే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా రంగంలో విజయం సాధించేందుకు కష్టపడాల్సి రావొచ్చు. మీరు ఓపికగా ఉండాలి. మీ మాటలు మరియు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది.

కన్య రాశి..

కన్య రాశి..

తులరాశిలోకి సూర్యుడి సంచారం వల్ల ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన సమస్యలు ఎదురుకావొచ్చు. మీరు రుణాలు తీసుకునే పరిస్థితి ఏర్పడొచ్చు. మీరు డబ్బు ఆదా చేయడంలో కష్టంగా ఉంటుంది. మీ మాటలోని మాధుర్యాన్ని కాపాడుకోండి. ఈ కాలంలో జర్నీ మొత్తం సాఫీగా సాగుతుంది.

మకరరాశితో ఈ రాశుల వారు ఆనందంగా గడిపేస్తారట... మీ రాశి ఉందేమో చూసెయ్యండి...మకరరాశితో ఈ రాశుల వారు ఆనందంగా గడిపేస్తారట... మీ రాశి ఉందేమో చూసెయ్యండి...

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశిలోకి సూర్యుని సంచారం వల్ల తులరాశి వారిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని మంచి ఫలితాలను కూడా పొందొచ్చు. రవాణా సమయంలో మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో మనసు సంతోషంగా ఉంటుంది. మరోవైపు మీరు శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రతిష్ట పెరుగుతుంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు పన్నెండో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో ఉద్యోగులకు సానుకూల ఫలితాలొస్తాయి. మీరు విదేశీ కంపెనీలతో సంబంధం ఉంటే అనేక ప్రయోజనాలు పొందొచ్చు. వ్యాపారులు లాభాల కోసం కొన్ని రిస్కులు తీసుకోవచ్చు. మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీకు ట్రాన్స్ ఫర్ లేదా ప్రమోషన్ అవకాశాలు ఉండొచ్చు. మీరు వాదనలు మానుకోవాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు పదకొండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఆర్థిక పరంగా ఈ కాలంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. అయితే మీరు రిలేషన్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో వివాదాలు ఉండొచ్చు. విద్యార్థులు ఈరోజు విద్యారంగంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. సూర్యుని రవాణా కారణంగా మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోవచ్చు. ఉద్యోగులు బాస్ తో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. మీ అహంకారం కారణంగా మీకు నష్టం రావొచ్చు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు పదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఉద్యోగులు, వ్యాపారులు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేయాలి. మీరు భవిష్యత్తును ద్రుష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శుభ ఫలితాల కోసం గాయత్రి మంత్రాన్ని జపించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు తొమ్మిదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు సోమరితనం వదిలిపెట్టాలి. మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. మీరు అతిగా ఆలోచించడం వల్ల కొన్ని సమస్యలు రావొచ్చు. సూర్యుడి రవాణా వల్ల మీ విశ్వాసం కూడా తగ్గిస్తుంది. ఆర్థిక పరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో సమస్యలు ఎక్కువ కావొచ్చు. ఆరోగ్య పరంగా ఈ వారం శ్రద్ధ వహించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఎనిమిదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీరు మానసిక ఒత్తిడిని అనుభవించొచ్చు. మీరు అప్పుల సమస్యను కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ ప్రత్యర్థులు మరియు తెలియని శత్రువులు పనులను అడ్డుకోవచ్చు. కాబట్టి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండకండి. రుణాలు తీసుకునే పరిస్థితిని తగ్గించుకోవాలి. మీరు పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. మీరు సంపాదించిన దాని కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయొద్దు. మీరు ఆదా చేయడం గురించి ఆలోచించండి. మీరు ఈ కాలంలో ఎక్కువగా ప్రయాణించాల్సి ఉంటుంది.

English summary

Sun Transit in Libra On 17 October 2021 Effects on Zodiac Signs in Telugu

Surya Rashi Parivartan October 2021: Sun Transit in Libra Effects on Zodiac Signs in telugu: The Sun Transit in Libra will take place on 17th October 2021. Learn about remedies to perform in telugu.
Desktop Bottom Promotion