Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Sun Transit in Pisces:మీనంలోకి సూర్యుడి సంచారం.. ఈ 6 రాశుల వారికి లక్కీ... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
మీన రాశిలోకి సూర్యుడి ప్రవేశించే సమయంలో ఈ 6 రాశుల వారికి అనుకూలంగా ఉంటుందట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడి గ్రహాలకు అధిపతిగా భావిస్తారు. సూర్యుడు ప్రతి మాసం ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు. ఇలా మారే సందర్భాన్ని మకర సంక్రాంతి అంటారు.

ఈ నేపథ్యంలోనే మార్చి 14వ తేదీన సూర్యుడు కుంభ రాశి నుండి మకర రాశిలోకి ఆగమనం చేయబోతున్నాడు. ఇదే రాశిలో సుమారు ఒక నెల రోజుల పాటు నివాసం ఉండనున్నాడు.

ఇదే రాశిలోకి గురుడు కూడా ప్రవేశించడంతో మరికొన్ని మార్పులు జరుగుతాయి. ఈ కాలంలో వేడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.

సూర్యుడు మీన రాశిలోకి ఆగమనం చేసిన సమయంలో మాత్రం ఈ ఆరు రాశుల వారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం...

వృషభ రాశి..
సూర్యుడు కుంభ రాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలొస్తాయి. ఈ కాలంలో ఉద్యోగులకు మరియు వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు అభించే అవకాశం ఉంది. పెండింగులో ఉన్న మీ పనులన్నీ తిరిగి గాడిలో పడతాయి. మీరు మీ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. మీరు గవర్నమెంటు నుండి కొన్ని మంచి ప్రయోజనాలను పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి.

మిధున రాశి..
సూర్యుడు కుంభ రాశి నుండి మీనరాశిలోకి ఆగమనం చేసే సమయంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీ కెరీర్ కు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో ప్రభుత్వ కార్యాలయంలో పని చేసేవారికి సానుకూల ఫలితాలొస్తాయి. మీ తోబుట్టువుల నుండి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే.. మీకు నిపుణుల సలహా లభిస్తుంది. దీని వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి..
సూర్యుడు కుంభ రాశి నుండి మీనరాశిలోకి రవాణా చేసే సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. మీరు చాలా ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఆదాయాన్ని పెంచుకోవడంలో ఎక్కువ శ్రద్ధ పెడతారు. మీకు ఎదురయ్యే ఆటంకాలన్నీ ముగిసిపోతాయి. క్రమంగా మీ నిధులు కూడా పెరుగుతాయి. మీరు భౌతిక ఆనందాల కోసం ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీరు అలంకరణల కోసం ఖర్చు చేస్తారు. మీకు ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూస్తారు. మీరు దానాలు, పుణ్యకార్యాలు చేస్తారు.

తుల రాశి..
సూర్యుడు కుంభ రాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశివారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు దీర్ఘకాలిక రోగాల నుండి విముక్తి లభించొచ్చు. మీరు కోర్టు కేసులలో కూడా విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది. మీరు కెరీర్ పరంగా గ్రోత్ సంపాదిస్తారు. మీకు ఆర్థిక పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు పెట్టుబడి పెట్టడానికి మంచి సలహాలను పొందుతారు. మీ మొండి బకాయిలను కూడా తిరిగి వసూలు చేసుకుంటారు. దీని వల్ల మీకు ప్రయోజనాలు చేకూరతాయి. ప్రభుత్వ పథకాల వల్ల మీరు అర్హత సాధిస్తారు. పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తవ్వొచ్చు.

మకర రాశి..
సూర్యుడు కుంభ రాశి నుండి మీనరాశిలోకి ఆగమనం చేసే సమయంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ రావొచ్చు. అదే విధంగా మీ వేతనం కూడా పెరిగే అవకాశం ఉంది. మీ కెరీర్లో గ్రోత్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ కాలంలో శత్రువులకు కూడా సహాయం చేస్తారు. ఈ సమయంలో చేసే జర్నీ వల్ల మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు. మీ వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు సోదర, సోదరీమణులు మీ సమస్యలకు పరిష్కారం చూపే అవకాశం ఉంది. మీరు ఆదాయాన్ని పెంచడానికి కొత్త పని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే.. ఈ సమయం అందుకు అనుకూలంగా ఉంటుంది.

మీన రాశి..
సూర్యుడు కుంభ రాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అంతా సానుకూలంగా ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని పెంచుకుంటారు. మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు. సూర్యుడు సంచారం చేసే ఈ సమయంలో మీరు కొన్ని కొత్త విషయాలను కూడా నేర్చుకుంటారు. మీ ప్రేమ జీవితంలో మంచిగా ఉంటుంది. మీ భాగస్వామితో గడిపేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది. మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.



Click it and Unblock the Notifications