సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తే.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు...! మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!

సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో చూడండి.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ప్రతి సంవత్సరం.. ప్రతి నెల ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఇలా చేసే సంచారాన్ని సంక్రాంతి అని అంటారు.

Sun Transit in Sagittarius on 15 December 2020 Effects on Zodiac Signs in Telugu

ఈ నేపథ్యంలోనే సూర్యుడు 2020 డిసెంబర్ 15వ తేదీన అంటే మంగళవారం నాడు రాత్రి వేళ 9:19 గంటలకు వృశ్చికరాశి నుండి ధనస్సు రాశిలోకి ఆగమనం చేయనున్నాడు. దీనినే ధను సంక్రాంతి అని కూడా పిలుస్తారు.

Sun Transit in Sagittarius on 15 December 2020 Effects on Zodiac Signs in Telugu

దీని తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో సూర్యుడి రవాణా వల్ల చాలా మంది జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సూర్యుడి సంచారంతో ద్వాదశ రాశులపై ఇతర ప్రభావాలు కూడా పడతాయి.

Sun Transit in Sagittarius on 15 December 2020 Effects on Zodiac Signs in Telugu

ఈ సందర్భంగా ఏయే రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి.. ఎవరెవరు ఏయే పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు వస్తాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

సూర్యుడు ధనస్సులోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి నుండి తొమ్మిదో స్థానం గుండా రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీరు కెరీర్ లో గణనీయమైన పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు విద్య విషయంలో మంచి ఫలితాలొస్తాయి.

పరిహారం : ప్రతిరోజూ శ్రీ ఆదిత్య స్తోత్రాన్ని పారాయణం చేసి, సూర్యభగవానుడిని ఆరాధించాలి.

వృషభరాశి..

వృషభరాశి..

ధనస్సురాశిలోకి సూర్యుడు అడుగుపెట్టే సమయంలో ఈ రాశి నుండి ఎనిమిదో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో వృషభరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. మీకు మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఆధ్యాత్మిక కోణంలో మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి అనుభవాలను పొందుతారు.

పరిహారం : ప్రతి ఆదివారం ఒక ఆలయం లేదా గోశాలకు వెళ్లి గోధుమలు, బెల్లం, రాగి, ఎరుపు రంగు దుస్తులను దానం చేయాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఏడో స్థానం గుండా సంచరించనున్నాడు. ఈ సమయంలో మిధున రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. వ్యాపారులు చాలా లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. అయితే దీని కోసం మీరు చాలా కష్టపడాలి. ఈ రవాణ మీ వైవాహిక జీవితానికి అనుకూలంగా లేదు. మీకు మీ జీవిత భాగస్వామి మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయి. మీకు ఆరోగ్య పరంగా ఒక ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ప్రతి ఆదివారం రోజూ కనీసం 108 సార్లు గాయత్రి మంత్రాన్ని జపించాలి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఆరో స్థానం నుండి కదలనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు మంచి ఫలితాలను పొందడం ప్రారంభిస్తారు. మరోవైపు మిమ్మల్ని కిందకు లాగేందుకు మీ ప్రత్యర్థులు నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎవరితోనూ వాదించడానికి ప్రయత్నించకండి. ఆరోగ్య పరంగా అంతా బాగానే ఉంటుంది.

పరిహారం : ఆదివారం రోజున సూర్య బీజ్ మంత్రాన్నిజపించాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఐదో స్థానం గుండా సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. అయితే సూర్యుని కదలిక వల్ల మీకు ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సమాజంలో మీరు ప్రభావవంతమైన వ్యక్తులను కనెక్ట్ అవుతారు. ఈ పరిచయాలు మీకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. మరోవైపు విద్యార్థులకు చదువు విషయంలో అడ్డంకులు ఎదురుకావచ్చు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : శనివారం రాత్రి నీటితో రాగి పాత్రను నింపి మీ తల దగ్గర ఉంచండి. తర్వాతి రోజు మేల్కొన్నపుడు ఆ నీటి తాగితే మంచి ఫలితాలొస్తాయి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు నాలుగో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీకు ప్రతికూలంగా ఉంటుంది. ఈ కారణంగా మీ కుటుంబ జీవితంలో ఉద్రిక్తత ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబంలో ఒకరికి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ వహించలేరు.

పరిహారం : ప్రతిరోజూ శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. ఆ స్వామి పసుపు కొమ్మలను అర్పించాలి.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు మూడో స్థానం గుండా ప్రయాణిస్తాడు. ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవితంలో విజయవంతం కావడానికి కూడా సహాయపడుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. మీరు సహోద్యోగుల పూర్తి మద్దతు పొందుతారు. ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది.

పరిహారం : సూర్యోదయానికి ముందు నిద్ర లేచి ఎరుపు రంగు పూలు ఉన్న మొక్కలు మరియు చెట్లకు నీరు వేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు రెండో స్థానం గుండా ప్రవేశిస్తాడు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆదాయ పరంగా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీ కుటుంబ వాతారవరణం మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. వారి మాటలు మిమ్మల్ని బాధపెట్టొచ్చు. కాబట్టి ఓపిక, సహనంతో వ్యవహరించాలి. మరోవైపు విద్యార్థులు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు.

పరిహారం : ఆదివారం ఉదయం మీ చేతి మణికట్టు మీద ఆరుసార్లు కలువను కట్టుకోండి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

గ్రహాలకు అధిపతిగా ఉన్న సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించే సమయంలో మీకు పురోగతి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. మరోవైపు మీ వివాహ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీ భాగస్వామి యొక్క ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. ఇంకోవైపు వ్యాపారులకు ఈ సమయంలో చాలా అద్భుతమైన ఫలితాలను సూచిస్తుంది.

పరిహారం : ఆదివారం రోజున గోధుమలు, ధాన్యాలను లేదా ఎరుపు రంగు పదార్థాలను ఆవుకు అందించండి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు పన్నెండో స్థానం గుండా ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో మకర రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ ఆదాయంలో క్షీణత రావచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేస్తుంది. ఏదేమైనా ఒక మంచి విషయం ఏంటంటే.. ప్రతికూల పరిస్థితుల్లో మీరు ముందుకు సాగడానికి ధైర్యంగా అడుగులేస్తారు. మరోవైపు మీరు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అయితే మీ ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఇలాంటి సమయంలో మీ ఆర్థిక పరిస్థితులను నియంత్రించాలి.

పరిహారం : ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. మీ తండ్రిని మనస్ఫూర్తిగా గౌరవించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు పదకొండో స్థానం గుండా కదలనున్నాడు. ఈ సమయంలో కుంభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులకు ఎక్కువ పురోగతి లభిస్తుంది. మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలకు దారితీస్తుంది. ఇలాంటి సందర్భంలో మీరు సామాజికంగా మరియు ఆర్థికంగా ఎదుగుతారు. మరోవైపు మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. మీ ప్రియమైన వారితో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : ఆదివారం నాడు రాగి పాత్రలో శుభ్రమైన నీటిని నింపి అందులో ఎర్ర గంధపు పొడి కలపాలి. ఆ నీటిని సూర్యుడిని సమర్పించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు పదో స్థానం గుండా ప్రయాణించనున్నాడు. ఈ సమయంలో మీన రాశి వారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ జీవితంలో పురోగతి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీకు పనిభారం మరియు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇది మిమ్మల్ని మరింత శక్తివంతం చేస్తుంది. సూర్యుని యొక్క ఈ రవాణా మీ వ్యక్తిగత జీవితానికి అనుకూలమైనదిగా రుజువు చేస్తుంది. మీరు కుటుంబ మద్దతు పొందుతారు. సమాజంలో మీ స్థానం బలంగా ఉంటుంది. ఉద్యోగులు సీనియర్ అధికారులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. అయితే ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది.

పరిహారం : ఆదివారం రోజున మీరు స్నానం చేసే నీటిలో ఎర్ర గంధపు చెక్క పొడిని లేదా దానితో నీటిని కలపండి. అప్పుడు ఆ నీటితో స్నానం చేస్తే మంచి ఫలితాలొస్తాయి.

Desktop Bottom Promotion