Just In
- 3 hrs ago ఏప్రిల్ 24న మేష రాశిలో శుక్ర గురు గ్రహ సంయోగం, 3 అదృష్ట రాశులు శుక్రదశతో ఐశ్వర్యం పొందుతారు
- 6 hrs ago ఈ రోజు రాశి ఫలాలు: దశమి గురువారం బాబా అనుగ్రహంతో ఈ రాశుల వారికి లాభదాయకం..ఆదాయం పెరుగుతుంది
- 12 hrs ago 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- 13 hrs ago ఈ 3 రాశుల వారు ఏప్రిల్ 23 నుండి అప్రమత్తంగా ఉండాలి, అంగారకుడి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు
Sun Transit in Taurus on 14 May 2021:సూర్యుడు వృషభంలోకి సంచారం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు మే 14వ తేదీన, అంటే శుక్రవారం నాడు మేషరాశి నుండి వృషభరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇలా సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు.
మే 14వ తేదీ ఉదయం 11:15 గంటల సమయంలో మేష రాశి నుండి నిష్క్రమించి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. సుమారు నెలరోజుల పాటు సంచారం అంటే జూన్ 15వ తేదీ ఉదయం 5:49 గంటల వరకు ఇక్కడే ఉండనున్నాడు.
అనంతరం మిధున రాశిలోకి రవాణా చేయనున్నాడు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. సూర్యుడు మేషరాశి నుండి వృషభరాశిలోకి ప్రవేశించేటప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏయే రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది.. ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Akshaya Tritiya 2021: అక్షయ తృతీయ రోజున ఏ రాశి వారు ఏమి దానం చేయాలంటే...!
మేష రాశి..
మేష రాశి నుండి సూర్యుడు నిష్క్రమించినప్పటికీ.. ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన ప్రయోజనాలు దక్కుతాయి. అయితే మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహితులకు ఈ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్లతో కొన్ని విభేదాలు రావొచ్చు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
వృషభ రాశి..
సూర్యుడు మేష రాశి నుండి వృషభరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీ ప్రేమ వ్యవహారం గురించి ఓ శుభవార్త వింటారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీంతో మీ ఆదాయం పెరుగుతుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు లేదా షాపింగ్ చేయొచ్చు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
మిధున రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా పెద్దగా ప్రయోజనాలు ఉండవు. మీ కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు సంబంధాలను మెరుగుపరచుకోడానికి తెలివిగా వ్యవహరించాలి. మరోవైపు మీ ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
కర్కాటక రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల సానుకూల ఫలితాలు రావొచ్చు. అయితే మీ దీర్ఘకాలిక కోరికలు నెరవేరే అవకాశం ఉంది. వ్యాపారులు సరైన పెట్టుబడితో మంచి రాబడిని పొందుతారు. ఆర్థిక పరంగా ఈ కాలం అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో పని చేసే వారు పెద్ద ప్రయోజనం పొందొచ్చు. మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు ఈ సమయంలో పురోగతి లభిస్తుంది. వ్యాపారులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాల వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. మీరు కొత్త కారు కొనేందుకు ప్రణాళిక రూపొందించుకుంటారు. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
కన్య రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి సంచారం వల్ల అనుకూల ఫలితాలు రావొచ్చు. ఈ కాలంలో వ్యాపారులు మంచి ప్రయోజనం పొందొచ్చు. ఈ సమయం మీరు ఆధ్యాత్మిక రంగంపై కూడా ఆసక్తి చూపుతారు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు.
మే నెలలో వృషభంలో 3 గ్రహాల సంయోగం.. ఈ రాశులపై అత్యంత ప్రభావం...!
తుల రాశి..
ఈ రాశి వారు సూర్యుడి సంచారం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కోల్పోవచ్చు. మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఎలాంటి ఫలితం కనిపించదు. అయితే పని విషయంలో ఈరోజు సానుకూలంగా ఉంటుంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీ వైవాహిక జీవితంలో శాంతి మరియు సామరస్యం ఏర్పడుతుంది. ఉద్యోగులు ఈరోజు తమ పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. మరోవైపు ఒంటరిగా ఉండే వారికి వివాహ ప్రతిపాదనలు రావొచ్చు.
ధనస్సు రాశి..
సూర్యుడు వృషభరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. ఈ కాలంలో మీరు అనేక అప్పులను తిరిగి చెల్లిస్తారు. వివాహితులు ఈ సమయం కొన్ని శుభవార్తలు వింటారు. మీ వ్యాపారం కూడా పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పని గురించి ప్రశంసలు అందుతాయి. ఉద్యోగం మార్చడానికి ఇది చాలా ఉత్తమ సమయం.
మకర రాశి..
సూర్యుడు మేషరాశి నుండి వృషభరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్యను పొందాలనుకుంటే.. వారి కోరిక నెరవేరకపోవచ్చు. ఉద్యోగులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
కుంభ రాశి..
సూర్యుడి సంచారం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉండొచ్చు. మీరు ఈ సమయంలో ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఈ సమయంలో నష్టపోవచ్చు. మీరు ఏదైనా ఆస్తి సంబంధిత సమస్యను ఎదుర్కొంటుంటే.. దాని ఫలితం రాకపోవచ్చు. కాబట్టి మీరు చాలా ఓపికగా ఉండాలి. ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
మీన రాశి..
సూర్యుడి రవాణా కారణంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు తల్లిదండ్రుల సహకారంతో పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ సమయంలో విపరీతమైన లాభాలు రావొచ్చు. వివాహం కోసం ప్రయత్నించే వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. మీరు బంగారం మరియు వెండి గురించి షాపింగ్ చేయొచ్చు. మీ ప్రేమ జీవితంలో గొప్పగా ఉంటుంది.