For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Surya Gochar 2022: వృషభంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం..!

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో సూర్యునికి ప్రత్యేక స్థానం ఉంది. ఎవరి జాతకంలో అయితే సూర్యుని స్థానం మంచిగా ఉంటుందో వారికి సమాజంలో కీర్తి మరియు గౌరవం వంటివి లభిస్తాయి.

అదే విధంగా సూర్యుని రవాణా సమయంలో కూడా వ్యక్తుల యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో మే 15వ తేదీన అంటే ఆదివారం నాడు సూర్యుడు వృషభ రాశిలోకి సంచారం చేయనున్నాడు.

ఇదే రాశిలో జూన్ 15వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏయే రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి.. ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి.. ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ 5 రాశుల వారికి సెంటిమెంట్ చాలా ఎక్కువ.. చిన్న విషయానికే ఏడ్చేస్తారట...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారికి సూర్యుని రవాణా వల్ల వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులొస్తాయి. మీకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండకపోవచ్చు. మీరు ఈ కాలంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగులతో సమన్వయం కుదరకపోవచ్చు.

పరిహారం : రాగి పాత్రలో నీటిని నింపి చిటికెడు కుంకుమ, పంచదార వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్య మంత్రాన్ని జపిస్తూ ఈ నీటిని ఉదయించే సూర్యునికి సమర్పించాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

సూర్యుని రవాణా సమయంలో ఈ రాశి వారి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి శుభ ఫలితాలొస్తాయి. వ్యాపారులు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడొచ్చు. మీరు అన్ని సవాళ్లను చక్కగా ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు ఉంటాయి.

పరిహారం : ఉదయాన్నే నిద్ర లేచి రాగి పాత్రలో నీరు తాగాలి. రోజూ సూర్యదేవ మంత్రాన్ని, గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి సూర్యుని సంచారం వల్ల ప్రతికూల ఫలితాలు ఏర్పడొచ్చు. అయితే మీరు ఈ కాలంలో కొత్త ప్రదేశాలను సందర్శించొచ్చు. ఈ సమయంలో ఒక అలర్జీ ఉండొచ్చు. మీరు మంచి ఆర్థిక స్థితిని కొనసాగించేందుకు సరైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఉద్యోగులకు ఈ సమయంలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది.

పరిహారం : రాత్రిపూట రాగి పాత్రలో నీళ్లను నింపి తల వద్ద ఉంచండి. ఉదయాన్నే ఆ నీటిని ఇంటి బయట వేయాలి.

ఈ 5 రాశులు డబ్బును అయస్కాంతంలా లాగించే అదృష్టం ఉన్నవారు... మీ రాశి ఇక్కడ ఉందా?

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

సూర్యుని రవాణా కాలంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు రావొచ్చు. ఈ కాలంలో మీరు కుటుంబం మరియు స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వారితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాలు బాగానే ఉంటాయి. పని విషయంలో ఈరోజు మీరు సహోద్యోగుల మద్దతు పొందుతారు. బాస్ నుండి ఈ కాలంలో ప్రశంసలు లభిస్తాయి.

పరిహారం : మీరు ప్రతిరోజూ ఆదిత్య స్తోత్రాన్ని పఠించాలి. సూర్యోదయం సమయంలో సూర్యుడిని పూజించాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో స్థిరంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉండొచ్చు. మీ తల్లికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. మీరు కొత్త ఉద్యోగావకాశాలను అన్వేషించడానికి ప్లాన్ చేయొచ్చు. వ్యాపారవేత్తలు ఈ సమయం మీతో మంచి పరిచయాన్ని కలిగి ఉంటారు.

పరిహారం : మీరు పని చేసే చేతికి బ్రాస్ లైట్ లేదా ఉంగరపు వేలికి ఉంగరాన్ని ధరించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ కాలంలో ఈ రాశి వారికి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు మతపరమైన ప్రదేశాలను కూడా సందర్శించొచ్చు. మీ కుటుంబసభ్యులతో గొడవలు రావొచ్చు. మరోవైపు విదేశాల్లో చదువుకోవాలని కలలు కనే విద్యార్థులు మంచి ప్రయోజనం పొందొచ్చు.

పరిహారం :ఆదివారం రోజున ఆవులకు బెల్లం మరియు గోధుమ రొట్టెలను తినిపించాలి. గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు క్రమం తప్పకుండా జపిస్తే మేలు జరుగుతుంది.

ఈ 5 రాశుల వారిని పెళ్లి చేసుకోవడం మంచిదే... ఎందుకో తెలుసా?ఇందులో మీ రాశి ఉందా?

తుల రాశి..

తుల రాశి..

సూర్యుని రవాణా సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కొంత భారం ఉంటుంది. ఇది మీకు ఒత్తిడితో కూడిన సమయం అవుతుంది. మీరు స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ఈ కాలంలో మీరు రహస్యాలను పంచుకుంటారు. మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. పరిశోధనలు చేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యం బాగుండదు. శారీరక పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు.

పరిహారం : మీరు నారాయణుడిని పూజించాలి. ప్రతిరోజూ 108 సార్లు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్నిజపించాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి సూర్యుని రవాణా సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు అవివాహితులకు ఈ కాలంలో మంచి సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారులు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈ సమయంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. అయితే ఆర్థిక పరంగా ఈ కాలంలో అద్భుతంగా ఉంటుంది.

పరిహారం : మీ చేతి మణికట్టుపై ఎరుపు రంగులోని పవిత్ర దారాన్ని ఆరుసార్లు చుట్టి కట్టుకోండి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు సూర్యుని రవాణా కాలంలో వ్యక్తిగత ఫిట్నెస్ పై ఆసక్తి చూపాలి. మీరు మీ ప్రత్యర్థులపై అధిపత్యం చెలాయిస్తాయి. మీ ఆరోగ్యం ఈ కాలంలో బాగానే ఉంటుంది. ఉద్యోగులు ఈ సమయంలో ప్రమోషన్ కూడా పొందొచ్చు.

పరిహారం : ప్రతిరోజూ స్నానపు నీటిలో చిటికెడు కుంకుమ లేదా ఎర్రచందనం పొడిని కలుపుకుని స్నానం చేయండి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి సూర్యుని రవాణా సమయంలో ఆర్థిక పరిస్థితిలో అస్థిరంగా ఉండొచ్చు. ఈ కాలంలో మీరు పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఈ సమయంలో మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. మీ అభిరుచులను కొనసాగించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. గర్భిణులు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బాస్ తో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉండదు.

పరిహారం : ప్రతిరోజూ ఉదయించే సూర్యుడికి నీటిని సమర్పించాలి. మీ తండ్రికి గౌరవం ఇవ్వాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు సూర్యుని సంచారం సమయంలో కుటుంబ సభ్యుల సహకారంతో మంచి జీవిత భాగస్వామిని పొందుతారు. విదేశాల్లో చదువుల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రాణించే అవకాశం ఉంది. మీరు కొత్త భాషను కూడా నేర్చుకోవచ్చు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబ వ్యాపారం చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : ఆదివారం రోజున గుడిలో బెల్లం దానం చేయాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా సరదాగా ఉండొచ్చు. మీ సోదరులు మరియు సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే వారు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. వ్యాపారులకు ఈ కాలంలో కష్టంగా ఉంటుంది. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ కాలం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ సూర్య భగవానుడిని ప్రార్థించాలి.

2022లో సూర్యుడు మే నెలలో ఏ రాశిలోకి ఎప్పుడు ప్రవేశించనున్నాడు?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో సూర్యునికి ప్రత్యేక స్థానం ఉంది. ఎవరి జాతకంలో అయితే సూర్యుని స్థానం మంచిగా ఉంటుందో వారికి సమాజంలో కీర్తి మరియు గౌరవం వంటివి లభిస్తాయి. అదే విధంగా సూర్యుని రవాణా సమయంలో కూడా వ్యక్తుల యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో మే 15వ తేదీన అంటే ఆదివారం నాడు సూర్యుడు వృషభ రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో జూన్ 15వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు.

English summary

Sun Transit in Taurus on 15 May 2022 Effects and Remedies on 12 Zodiac Signs in Telugu

Surya Gochar May 2022 In Vrishabha Rashi; Sun Transit in Taurus Effects on Zodiac Signs in Telugu : The Sun Transit in Taurus will take place on 15 May 2022. Learn about remedies to perform in Telugu.
Story first published: Friday, May 13, 2022, 15:28 [IST]
Desktop Bottom Promotion