Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
Sun Transit in Virgo On 17 September 2021:కన్యరాశిలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశులకు లాభం...
కన్యరాశిలోకి సూర్యుడి సంచారంతో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయట. ఆ రాశులేవో మీరే చూడండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో సూర్యుడికి ఎంతో విశిష్టత ఉంది. సూర్యుడిని నవగ్రహాలన్నింటికీ రాజుగా పరగణిస్తారు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడి అనుగ్రహం ఉంటుందో వారికి సమాజంలో గౌరవం, జీవితంలో ఉన్నత స్థానానికి మార్గం సులభమవుతుందని పండితులు చెబుతారు.

ఇంత గొప్ప విశిష్టత కలిగిన సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతిగా పిలుస్తారు. ఈ నేపథ్యంలో సూర్యుడు సెప్టెంబర్ 17వ తేదీన శుక్రవారం నాడు తన సొంత రాశి అయిన సింహ రాశి నుండి కన్యరాశిలోకి సంచారం చేయనున్నాడు.

ఈ సమయంలో ద్వాదశ రాశి చక్రాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. అయితే కొన్ని రాశుల వారికి సూర్యుడి రవాణా వల్ల శుభప్రదమైన ఫలితాలు రానున్నాయట. ఈ కాలంలో ఆర్థిక పరంగా అద్భుతమైన లాభాలు వస్తాయట. ఈ సందర్భంగా సూర్యుడి రవాణా ఏ రాశి వారికి సానుకూలంగా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
కన్య రాశిలోకి సూర్యుడి సంచారం వల్ల మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈ కాలంలో మంచిగా ఉంటుందో ఉద్యోగులకు కెరీర్ పరంగా అంతా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ కాలంలో ఊహించిన ఫలితాలొస్తాయి. మీరు ఏదైనా లోన్ దరఖాస్తు పెట్టుకుంటే శుభవార్త వినిపిస్తుంది. మీ వైవాహిక జీవితం కూడా మధురంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. సూర్యుడి అనుగ్రహం పొందడానికి మీరు ప్రతిరోజూ సూర్యుడికి నీటిని అర్పించాలి.

మిధున రాశి..
ఈ రాశి వారిక సూర్యుడి ప్రయాణం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీ కుటుంబ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ ఇంట్లోని సభ్యులందరితో సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఈ కాలంలో సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలో పాల్గొంటే, సమయం అనుకూలంగా ఉంటుంది. మీ విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా మీ పనితీరు మెరుగుపడుతుంది. ఈ కాలంలో మీరు ఏదైనా భూలావాదేవీలు చేస్తుంటే చాలా జగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈ కాలంలో అంతా మంచిగా ఉంటుంది.

సింహ రాశి..
సూర్యుడి సొంత రాశి అయిన ఈ రాశి నుండి సూర్యుడు నిష్క్రమించినప్పటికీ.. సింహ రాశి వారికి సానుకూల ఫలితాలొస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. అనుకోకుండా భారీ సంపద మీ ఖాతాలో వచ్చి పడుతుంది. మరోవైపు వ్యాపారులకు ఈ కాలంలో మంచి లాభాలు వస్తాయి. సమాజంలో మీ గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. విదేశాలకు సంబంధించిన వ్యాపారులకు కూడా ఈ కాలంలో అద్భుతంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు వివాదాలకు దూరంగా ఉండాలి. మీరు ఏదైనా పెట్టుబుడి పెట్టాలని ఆలోచిస్తుంటే.. ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు మరిన్ని ప్రయోజనాలు పొందాలంటే.. ప్రతిరోజూ సూర్యభగవానుడికి ఎర్రచందనం, పూలు కలిపిన నీటిని సమర్పించాలి.

తుల రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మీరు లావాదేవీలు చేయడానికి సరైన సమయం ఇది. మీరు పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే.. ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ కాలంలో కొత్త వాహనం లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేయొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో మంచి విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ఈ కాలంలో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల అనుకూలంగా ఉంటుండి. ఈ కాలంలో వ్యాపారులకు అద్భుతంగా ఉంటుంది. మీ వ్యాపారం విస్తరించే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగులకు ఊహించిన ఫలితాలొస్తాయి. మీకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. ఈ కాలంలో మీరు మంచి విజయం అందుకుంటారు. మీరు ఆదాయాన్ని పొందే కొత్త మార్గాల గురించి తెలుసుకుంటారు. వ్యాపారవేత్తలు ఈ కాలంలో కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో ఉద్యోగులు చాలా కష్టపడాలి. అయితే కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. వ్యాపారులు కూడా ఎంత కష్టపడితే.. అన్ని మంచి ఫలితాలు రావొచ్చు. ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా అంతా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీ ఖర్చులను మీరు నియంత్రణలో ఉంచుకోవాలి. మీరు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. మీ కుటుంబ సభ్యులలో మీకిష్టమైన వారితో ఆనందంగా గడుపుతారు. దీని వల్ల మీరు ఎంతో హ్యాపీగా ఫీలవుతారు. మీ ఆరోగ్యం కూడా మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సూర్యుడి అనుగ్రహం పొందడానికి ఆదివారం రోజున మీ కుడి చేతి ఉంగరపు వేలికి రూబీ రత్నాన్ని ధరించండి.



Click it and Unblock the Notifications