For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Surya and Chandra Grahan 2022: కొత్త ఏడాదిలో సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడొచ్చాయి?

2022లో సూర్య మరియు చంద్ర గ్రహణ తేదీలు, సమయం, ఇండియాలో కనిపిస్తుందా లేదా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఖగోళ శాస్త్రం ప్రకారం, జ్యోతిష్యశాస్త్రం ప్రతి సంవత్సరం సూర్య గ్రహణం మరియు చంద్ర గ్రహణం సాధారణంగా ఏర్పడుతుంటాయి. ఈ గ్రహణాలకు సంబంధించి అనేక మత విశ్వాసాలు ఉన్నాయి.

Surya and Chandra Grahan :Check Solar and Lunar Eclipses 2022 Dates, Timings and Visibility in India

భూమికి, చంద్రునికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అదే సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం అనేది ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. హిందూ మతంలో గ్రహణాలను శుభ సమయంగా పరిగణించరు. గ్రహణ సమయాల్లో సూతక్ కాలంలో ఎలాంటి శుభకార్యాలను జరపరు.

Surya and Chandra Grahan :Check Solar and Lunar Eclipses 2022 Dates, Timings and Visibility in India

వాటిపై నిషేధాన్ని విధించారు. ఈ సమయంలో అనేక జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో ఎన్ని సూర్య గ్రహణాలు.. ఎన్ని చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి.. అవి ఏ తేదీల్లో రానున్నాయి.. ఏ సమయంలో గ్రహణం వస్తుంది.. ఇవి మన దేశంలో కనిపించనున్నాయా లేదా అనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Business Horoscope 2022: కొత్త ఏడాదిలో ఈ రాశుల వ్యాపారులకు శుభ ఫలితాలు రానున్నాయట..!Business Horoscope 2022: కొత్త ఏడాదిలో ఈ రాశుల వ్యాపారులకు శుభ ఫలితాలు రానున్నాయట..!

2022లో తొలి సూర్య గ్రహణం..

2022లో తొలి సూర్య గ్రహణం..

2022 సంవత్సరంలో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 30వ తేదీన ఏర్పడనుంది. ఇది ప్రపంచంలోని అనేక దేశాలతో పాటు భారతదేశంలో కూడా కనిపిస్తుంది. అయితే మన దేశంలో కేవలం పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే ఉంటుంది. కాబట్టి దీన్ని సూతక్ కాలంగా పరిగణించరు. 2022 ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ 30 వ తేదీన అంటే శనివారం మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ముగుస్తుంది.

రెండో సూర్య గ్రహణం..

రెండో సూర్య గ్రహణం..

మన దేశంలో 2022 సంవత్సరంలో రెండో సూర్య గ్రహణం అక్టోబర్ 25వ తేదీన ఏర్పడనుంది. ఈ గ్రహణాన్ని భారతదేశంతో పాటు అనేక ఇతర దేశాల్లొ చూడొచ్చు. అయితే భారతదేశంలో ఈ గ్రహణం యొక్క పాక్షిక ప్రభావం కారణంగా, ఈ సమయంలో సూతక్ కాలం అనేది ఉండదు. ఈ గ్రహణం అక్టోబర్ 25వ తేదీన అంటే మంగళవారం నాడు సాయంత్రం 4:29 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది కొద్ది నిమిషాల్లోనే సాయంత్రం 5:42 గంటలకే ముగుస్తుంది.

January 2022 Festival Calendar:జనవరిలో సంక్రాంతితో పాటు వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలివే...January 2022 Festival Calendar:జనవరిలో సంక్రాంతితో పాటు వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలివే...

2022లో తొలి చంద్ర గ్రహణం..

2022లో తొలి చంద్ర గ్రహణం..

ఆంగ్ల నూతన సంవత్సరం 2022లో తొలి చంద్ర గ్రహణం మే 16వ తేదీన ఏర్పడనుంది. ఈ గ్రహణాన్ని భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ఇతర దేశాల్లో దీన్ని చూడొచ్చు. ఈ గ్రహణం ప్రభావం మన దేశంపై ఎక్కువగానే ఉంటుంది. ఈ కాలంలోనే సూతక్ కాలం కూడా ఉంటుంది. ఇది సంపూర్ణ చంద్ర గ్రహణం అవుతుంది. ఈ గ్రహణం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, ఐదో నెల అయిన మే నెలలో 16వ తేదీన బుధవారం ఉదయం 7:02 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12:20 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం సమయంలో చాలా మంది అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

రెండో చంద్ర గ్రహణం..

రెండో చంద్ర గ్రహణం..

2022 సంవత్సరంలో నవంబర్ ఎనిమిదో తేదీన రెండో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం ప్రపంచంలోని అనేక దేశాలతో పాటు భారతదేశంలో కూడా కనిపిస్తుంది. దీన్ని మన దేశంలో స్పష్టంగా చూడొచ్చు. దీని ప్రభావం భారతదేశంపై ఎక్కువగానే ఉండొచ్చు. ఈ కాలంలో సూతక్ కాలం కూడా చెల్లుబాటు అవుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం నవంబర్ ఎనిమిదో తేదీన అంటే మంగళవారం మధ్యాహ్నం 1:32 గంటలకు ప్రారంభమై రాత్రి 7:27 గంటలకు ముగుస్తుంది.

FAQ's
  • 2022లో ఎన్ని సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి?

    2022 సంవత్సరంలో మొత్తం రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. అయితే సూర్య గ్రహణాలు మన దేశంలో పాక్షికంగా కనిపించనున్నాయి. కానీ చంద్ర గ్రహణాలు మాత్రం సంపూర్ణంగా ఉంటాయి. ఈ సమయంలో సూతక్ కాలం ఉంటుంది. ఈ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

  • 2022లో సూర్య గ్రహణాల తేదీ, సమయం ఎప్పుడు?

    2022 సంవత్సరంలో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 30వ తేదీన ఏర్పడనుంది. ఇది ప్రపంచంలోని అనేక దేశాలతో పాటు భారతదేశంలో కూడా కనిపిస్తుంది. అయితే మన దేశంలో కేవలం పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే ఉంటుంది. కాబట్టి దీన్ని సూతక్ కాలంగా పరిగణించరు. 2022 ఏడాదిలో రెండో సూర్య గ్రహణం అక్టోబర్ 25వ తేదీన ఏర్పడనుంది. ఇది కూడా పాక్షిక గ్రహణమే.

  • 2022లో చంద్ర గ్రహణాల తేదీ, సమయం ఎప్పుడు?

    ఆంగ్ల నూతన సంవత్సరం 2022లో తొలి చంద్ర గ్రహణం మే 16వ తేదీన ఏర్పడనుంది. ఈ గ్రహణాన్ని భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ఇతర దేశాల్లో దీన్ని చూడొచ్చు. ఈ గ్రహణం ప్రభావం మన దేశంపై ఎక్కువగానే ఉంటుంది. ఈ కాలంలోనే సూతక్ కాలం కూడా ఉంటుంది. ఇది సంపూర్ణ చంద్ర గ్రహణం అవుతుంది. 2022 సంవత్సరంలో నవంబర్ ఎనిమిదో తేదీన రెండో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం ప్రపంచంలోని అనేక దేశాలతో పాటు భారతదేశంలో కూడా కనిపిస్తుంది. దీన్ని మన దేశంలో స్పష్టంగా చూడొచ్చు.

English summary

Surya and Chandra Grahan :Check Solar and Lunar Eclipses 2022 Dates, Timings and Visibility in India

Surya and Chandra Grahan 2022 Dates: There will be a total of 4 lunar and solar eclipses in 2022. Check 2022 Surya and Chandra Grahan Dates, Timings, Visibility in India and other details in Telugu
Desktop Bottom Promotion