Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Surya Gochar June 2022:మిధునంలోకి సూర్యుడి రవాణా.. ఈ రాశులకు నష్టం...!
2022లో జూన్ 15వ తేదీన సూర్యుడు మిధునంలోకి ప్రవేశించనున్నాడు. ఈ కాలంలో ఈ రాశుల వారికి నష్టాలు రానున్నాయి. మీ రాశి ఉందేమో చూడండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు జూన్ 15వ తేదీన, అంటే బుధవారం నాడు వృషభరాశి నుండి మిధున రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇలా సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు.

ఇదే రాశిలో సుమారు నెలరోజుల పాటు సంచారం చేసి అనంతరం కర్కాటక రాశిలోకి రవాణా చేయనున్నాడు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. సూర్యుడు వృషభరాశి నుండి మిధున రాశిలోకి ప్రవేశించేటప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. అయితే ఈ ఏడాది కొన్ని రాశుల వారికి సూర్యుని సంచారం వల్ల ఈ రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
ఈ రాశి నుండి రెండో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో వ్యాపారులు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే అనుభవం ఉన్న వారి సహాయం తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో కొంత ఇబ్బందులు ఉండొచ్చు. మీరు ఈ కాలంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ సమయంలో ఎవరికీ అప్పులు ఇవ్వడం వంటి పనులు చేయకూడదు.

వృషభ రాశి..
సూర్యుడు ఈ రాశి నుండి నిష్క్రమించడం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు రావొచ్చు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొంత గందరగోళం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో గొడవలు రావొచ్చు. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆశించిన విధంగా ఉండకపోవచ్చు.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 12వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో కర్కాటక రాశికి చెందిన కొందరు వ్యక్తులు వ్యక్తిగత జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతుంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కూడా కొన్ని కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.


తుల రాశి..
ఈ రాశి వారు సూర్యుని సంచారం సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు కోరుకున్న ఫలితాలు రాకపోవచ్చు. ఆర్థిక పరంగా ఎక్కువ నష్టం రావొచ్చు. వ్యాపారులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

మీన రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు నాలుగో స్థానం రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు రావొచ్చు. మీరు విహారయాత్రకు వెళ్తున్నట్లయితే, ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారులు సైతం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన రాశుల ఫలితాలు ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications