Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Surya Gochar June 2022: మిధునంలోకి సూర్యుడి సంచారం..ఈ రాశులకు లాభం..!
2022లో జూన్ 15వ తేదీన సూర్యుడు మిధునంలోకి ప్రవేశించనున్నాడు. ఈ కాలంలో ఈ రాశుల వారికి లాభాలు రానున్నాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు జూన్ 15వ తేదీన, అంటే బుధవారం నాడు వృషభరాశి నుండి మిధున రాశిలోకి సంచారం చేయనున్నాడు.

ఇలా సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. ఇదే రాశిలో సుమారు నెలరోజుల పాటు సంచారం చేసి అనంతరం కర్కాటక రాశిలోకి రవాణా చేయనున్నాడు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. సూర్యుడు వృషభరాశి నుండి మిధున రాశిలోకి ప్రవేశించేటప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. అయితే ఈ ఏడాది కొన్ని రాశుల వారికి సూర్యుని సంచారం వల్ల కచ్చితంగా కొన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

వృషభ రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు నిష్క్రమించడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి నుండి సూర్యుడు రెండో స్థానం నుండి మిధునంలోకి ప్రవేశించే సమయంలో మీ కెరీర్ పరంగా, ఆర్థిక పరంగా శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు ఏదైనా వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు న్యాయపరమైన సంబంధిత విషయాల్లో సానుకూల ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీరు కోరుకున్న కలలన్నీ నిజమవుతాయి.

సింహ రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 11వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో సింహ రాశి వారికి మంచి ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీ ఆదాయం విపరీతంగా పెరగొచ్చు. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి.

కన్య రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 10వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు శుభ ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. మీరు కోరుకున్న ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ పరిస్థితుల్లో మీకు అనుకూలంగా ఉంటుంది.

మీన రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు నాలుగో స్థానం రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారు ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలొస్తాయి. ఈ సమయంలో మీ ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీరు కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన రాశుల ఫలితాలు ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications