For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Surya Rashi Parivartan 2021:ధనస్సులోకి సూర్యుని సంచారం..12 రాశులపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...

2021 డిసెంబరులో ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో సూర్యుడికి ప్రత్యేక స్థానం. సూర్యుడు లేనిదే ఈ లోకానికే వెలుగు అనేదే ఉండదు. అందుకే సూర్యుడిని రాజుగా పరిగణిస్తారు. అందుకే సూర్యుని స్థానాన్ని బట్టి, ప్రజల జీవితాలను ప్రభావితం అవుతూ ఉంటుంది.

Surya Rashi Parivartan 2021 Sun Transit in Sagittarius On 16 December 2021 Effects on Zodiac Signs in Telugu

ఈ నేపథ్యంలో సూర్యుడు 2021 సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీన గురువారం నాడు తెల్లవారుజామున 3:28 గంటలకు ధనస్సు రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో జనవరి 14వ తేదీ 2022 మధ్యాహ్నం 2:29 గంటల వరకు సంచారం చేయనున్నాడు.

Surya Rashi Parivartan 2021 Sun Transit in Sagittarius On 16 December 2021 Effects on Zodiac Signs in Telugu

ఈ సమయంలో ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఏయే రాశుల వారికి సూర్యుని రవాణా వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి.. ఏ రాశుల వారి ప్రతికూల ఫలితాలు ఉంటాయి.. ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Leo Horoscope 2022: సింహరాశి వారికి 2022లో ఎలా ఉండబోతుంది..!!Leo Horoscope 2022: సింహరాశి వారికి 2022లో ఎలా ఉండబోతుంది..!!

మేష రాశి..

మేష రాశి..

సూర్యుడి రవాణా కారణంగా ఈ రాశి వారికి సమాజంలో మరియు ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. మీరు చాలా సొమ్మును ఆదా చేస్తారు. మీరు ఈ కాలంలో తీర్థయాత్రలను ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా మతపరమైన పనిలో నిమగ్నమై ఉంటారు. మీ పిల్లలు మీతో కొన్ని శుభవార్తలను పంచుకుంటారు. వ్యాపారులు కొత్త వెంచర్లు మరియు ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టొచ్చు. మీ వ్యక్తిగత సంబంధాలు మంచిగా ఉంటాయి. మీరు మీ కుటుంబం మరియు స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.

పరిహారం : మీరు ప్రతిరోజూ ఆవుకు బెల్లం మరియు గోధుమ రొట్టెలు తినిపిస్తే శుభ ఫలితాలొస్తాయి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు సూర్యుని సంచారం సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు కెరీర్ పరంగా బాగా రాణిస్తారు. కొత్త పరిచయాలను సైతం ఎంచుకుంటారు. ఉద్యోగులు కార్యాలయంలో, మీరు మీ స్థానాన్ని పెంచుకోవడంపై ద్రుష్టి పెడతారు. అదే సమయంలో మీరు మీ క్రుషికి కూడా గుర్తింపు పెడతారు. ఆరోగ్య పరంగా ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు కొన్ని ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యకలాపాల వైపు మొగ్గు చూపొచ్చు. మీ జీవనశైలిలో యోగా-ధ్యానం చేర్చండి. ఇది మీకు ఒత్తిడి నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.

పరిహారం : ఆదివారం రోజున ఏదైనా ఆలయంలో ఎర్రని వస్త్రం లేదా దానిమ్మ పండును దానం చేయాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు సూర్యుని రవాణా సమయంలో కోపాన్ని నియంత్రించుకోవాలి. మీరు చాలా శక్తితో నిండి ఉంటారు. మీ ఫన్నీ స్టైల్ ఇతరులను ఆకట్టుకుంటుంది. మీ జీవిత భాగస్వామితో గొప్ప బంధాన్ని ఏర్పరచుకుంటారు. పని విషయంలో మంచిగా ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్లాన్ చేసుకుంటారు. అయితే మీ నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఈ సమయంలో ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారిని బాధపెట్టొచ్చు. మరోవైపు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు.

పరిహారం : ప్రతిరోజూ రాగి పాత్రలో సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.

Cancer Horoscope 2022: కర్కాటక రాశికి ప్రేమ, ఉద్యోగం, కుటుంబం, డబ్బు మరియు వ్యాపార భవిష్యత్తు ఎలా ఉంటుంది?Cancer Horoscope 2022: కర్కాటక రాశికి ప్రేమ, ఉద్యోగం, కుటుంబం, డబ్బు మరియు వ్యాపార భవిష్యత్తు ఎలా ఉంటుంది?

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు సూర్యుని సంచారం సమయంలో శత్రువులను ఓడిస్తారు. అంతేకాదు ప్రత్యర్థులపైనా ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మరోవైపు ఈ కాలంలో ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీకు సన్నిహితంగా ఉన్న వారి పిల్లలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, మీరు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. బెట్టింగ్ వంటి కార్యకలాపాల్లో పాల్గొనకండి. లేదంటే మీరు డబ్బును నష్టపోవచ్చు.

పరిహారం : ప్రతిరోజూ 108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి సూర్యుని రవాణా కారణంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో విద్యార్థులకు శుభఫలితాలు రానున్నాయి. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా విజయం సాధిస్తారు. ఈ సమయంలో వారు తమ ఆశయాలపై పని చేస్తారు. ఉద్యోగులు కూడా ఈ కాలంలో విజయం సాధిస్తారు.

పరిహారం : ప్రతిరోజూ సూర్యభగవానుడిని పూజించండి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి సూర్యుని సంచారం కారణంగా మానసిక స్థితి అనూహ్యంగా మారుతుంది. ఈ కాలంలో మీరు చికాకు పడతారు. ఒక్కోసారి మెంటల్ టెన్షన్ ఎక్కువవుతుంది. మిమ్మల్ని శాంతపరచుకోవడానికి ధ్యానం చేయాలి. మీరు కొన్నిసార్లు భావోద్వేగానికి లోనవుతారు. మీ కుటుంబంలో కొన్ని తగాదాలు మరియు ఇబ్బందులను కూడా చూడొచ్చు. మీ కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం ఉంటుంది. ఈ సమయంలో మీరు మతపరమైన యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సమయంలో మీరు మీ వాహనాల కోసం చాలా డబ్బు ఖర్చు చేయొచ్చు. మీకు ఊపిరితిత్తుల సమస్య ఉంటే, ధూమపానం మానేయాలి.

పరిహారం : ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా అల్లం కలిపిన ఆహారం తీసుకోవాలి.

మీ రాశి ప్రకారం మీ తెలివితేటలు ఎంత బలంగా ఉందో తెలుసా.. ఈ 4 రాశుల వారికి చాలా ప్రత్యేకం!మీ రాశి ప్రకారం మీ తెలివితేటలు ఎంత బలంగా ఉందో తెలుసా.. ఈ 4 రాశుల వారికి చాలా ప్రత్యేకం!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారికి సూర్యుని రవాణా కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ తో ఇతరులను ఆకట్టుకుంటారు. మీరు కొత్త ప్రభావవంతమైన స్నేహితులను పొందుతారు. మీ అభిప్రాయాన్ని ఇతరుల ముందు చాలా సూటిగా చెప్పగలుగుతారు. ఈ సమయంలో మీ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే స్నేహితులు తోడవుతారు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ పై శ్రద్ధ వహించాలి. మీరు మీ తోబుట్టువులతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉంటారు.

పరిహారం : ఆదివారం రోజు ఏదైనా ఆలయంలో గోధుమలను దానం చేయాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి సూర్యుని రవాణా సమయంలో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో కమ్యూనికేషన్ నైపుణ్యాలతో అందర్నీ ఆకట్టుకుంటారు. మరోవైపు ప్రభుత్వ విధానాల వల్ల ప్రయోజనం పొందుతారు. అదే సమయంలో పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు కూడా ఆశించబడతాయి. ఆర్థిక సంబంధిత సమస్యల కారణంగా మీరు మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మీరు మీ దినచర్యలో ధ్యానాన్ని చేర్చుకోవాలి. ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

పరిహారం : ఆదివారం రోజున పేదలకు బెల్లం దానం చేయాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల, ధనస్సు రాశి వారు శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. మీ చమత్కారమైన మాటలతో ప్రజలను ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. మీరు ప్రమోషన్ వంటి శుభవార్తలు వినొచ్చు. వ్యాపారులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త వెంచర్లలో పెట్టుబడి పెడతారు. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు ఆసక్తి చూపుతారు.

పరిహారం : ప్రతిరోజూ 108 సార్లు ‘ఓం సూర్యాయ నమః' మంత్రాన్ని జపించాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు సూర్యుని రవాణా సమయంలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరోవైపు మీ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు మీ ఖర్చులపై శ్రద్ధ వహించాలి. మీరు లాటరీ టికెట్లపై మీ డబ్బు ఖర్చు చేయడానికి ఇది సరైన సమయం కాదు. ఇంకోవైపు మీకు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

పరిహారం : మీరు బయటికి వెళ్లేటప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు సూర్యుని రవాణా సమయంలో శుభ ఫలితాలను పొందుతారు. ఈ కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా వేతనంలో పెరుగుదల ఉండొచ్చు కార్యాలయంలో మీకు సహోద్యోగుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. వివాహితులకు ఈ కాలంలో మంచిగా ఉంటుంది. మరోవైపు మీ బిజీ షెడ్యూల్ కారణంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు.

పరిహారం : ప్రతిరోజూ మీరు ఆదిత్య పారాయణం చేయాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు సూర్యుని సంచారం సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. అయితే ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని విమర్శలను ఎదుర్కోవచ్చు. ఈ కాలంలో మీరు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. మరోవైపు మీ కుటుంబం మరియు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇదే సరైన సమయం. మీరు అప్పుడప్పుడు కోపం తెచ్చుకోవచ్చు. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : సూర్య దేవుని అనుగ్రహం పొందేందుకు ప్రతి ఆదివారం ఉపవాసం ఉండొచ్చు.

FAQ's
  • సూర్యుడు ధనస్సు రాశిలోకి ఎప్పుడు సంచారం చేయనున్నాడు?

    సూర్యుడు 2021 సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీన గురువారం నాడు తెల్లవారుజామున 3:28 గంటలకు ధనస్సు రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో జనవరి 14వ తేదీ 2022 మధ్యాహ్నం 2:29 గంటల వరకు సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుంది..

English summary

Surya Rashi Parivartan 2021 Sun Transit in Sagittarius On 16 December 2021 Effects on Zodiac Signs in Telugu

Surya Rashi Parivartan December 2021 in Dhanu Rashi; Sun Transit in Sagittarius Effects on Zodiac Signs in Telugu: The Sun Transit in Sagittarius will take place on 16 December 2021. Learn about remedies to perform in Telugu
Desktop Bottom Promotion