Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Surya Gochar 2022 :మిధునంలోకి సూర్యుని రవాణాతో ఏ రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!
2022లో జూన్ 15న సూర్యుడు మిధునంలోకి రవాణా చేసే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం, పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో సూర్యుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు జూన్ 15వ తేదీన, అంటే బుధవారం నాడు వృషభరాశి నుండి మిధున రాశిలోకి సంచారం చేయనున్నాడు.

ఇలా సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. ఇదే రాశిలో సుమారు నెలరోజుల పాటు సంచారం చేసి అనంతరం కర్కాటక రాశిలోకి రవాణా చేయనున్నాడు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. సూర్యుడు వృషభరాశి నుండి మిధున రాశిలోకి ప్రవేశించేటప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఏ రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి.. ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి నుండి మూడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో వ్యాపారులు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే అనుభవం ఉన్న వారి సహాయం తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో కొంత ఇబ్బందులు ఉండొచ్చు. మీరు ఈ కాలంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ సమయంలో ఎవరికీ అప్పులు ఇవ్వడం వంటి పనులు చేయకూడదు.

వృషభ రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు నిష్క్రమించడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి నుండి సూర్యుడు రెండో స్థానం నుండి మిధునంలోకి ప్రవేశించే సమయంలో మీ కెరీర్ పరంగా, ఆర్థిక పరంగా శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు ఏదైనా వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మరోవైపు డబ్బుకు సంబంధించిన విషయాల్లో సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొంత గందరగోళం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో గొడవలు రావొచ్చు. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆశించిన విధంగా ఉండకపోవచ్చు.

మిధున రాశి..
2022లో జూన్ 15వ తేదీ అంటే బుధవారం నాడు సూర్యుడు ఇదే రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు ఏ రంగంలో అయినా విజయం సాధిస్తారు. సరైన పనులను డబ్బు ఖర్చు చేస్తారు. మీలో ఒక రకమైన భయం కలుగుతుంది. ఈ కాలంలో మీరు అప్పులు ఇవ్వడం మానుకోవాలి. మరోవైపు ఈ సమయంలో మీ ప్రత్యర్థులు చాలా చురుగ్గా ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు న్యాయపరమైన సంబంధిత విషయాల్లో సానుకూల ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీరు కోరుకున్న కలలన్నీ నిజమవుతాయి. మరోవైపు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతుంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కూడా కొన్ని కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 11వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో సింహ రాశి వారికి మంచి ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీ ఆదాయం విపరీతంగా పెరగొచ్చు. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి.

కన్య రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 10వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు శుభ ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. మీరు కోరుకున్న ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ పరిస్థితుల్లో మీకు అనుకూలంగా ఉంటుంది.

తుల రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 9వ స్థానం నుండి రవాణా చేయానున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారు సూర్యుని సంచారం సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు కోరుకున్న ఫలితాలు రాకపోవచ్చు. ఆర్థిక పరంగా ఎక్కువ నష్టం రావొచ్చు. వ్యాపారులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 8వ స్థానం నుండి సంచారం చేయానున్నాడు. ఈ కాలంలో మీకు ఆర్థిక పరమైన విషయాల్లో ఊహించిన లాభాలు రావొచ్చు. పాత కాలం స్నేహితులను కలిసే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు కోరుకున్న బదిలీ జరగొచ్చు. అయితే వ్యక్తిగత జీవితంలో కొంత సంఘర్షణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా తగ్గొచ్చు.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 7వ స్థానం నుండి రవాణా చేయానున్నాడు. ఈ కాలంలో ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలు రావొచ్చు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు విజయం సాధించొచ్చు. శత్రువులపై కూడా సులభంగా ఆధిపత్యం చెలాయిస్తారు.

మకర రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 6వ స్థానం నుండి రవాణా చేయానున్నాడు. ఈ కాలంలో ఉద్యోగులకు కోరుకున్న ఫలితాలు రావొచ్చు. ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కోర్టుకు సంబంధించిన కేసుల నుండి సానుకూల వార్తలు వినిపిస్తాయి.

కుంభ రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 5వ స్థానం నుండి రవాణా చేయానున్నాడు. ఈ సమయంలో కుంభ రాశి వారికి సానుకూల ఫలితాలు రావొచ్చు. మీ కెరీర్ పరంగా అంతా మంచిగా ఉంటుంది. కొత్త ఉద్యోగాలు మరియు వ్యాపారాలకు ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల నుండి కూడా మద్దతు పొందుతారు.

మీన రాశి
ఈ రాశి నుండి సూర్యుడు నాలుగో స్థానం రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారు ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలొస్తాయి. ఈ సమయంలో మీ ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీరు కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. మరోవైపు ఈ కాలంలో మీరు విహారయాత్రకు వెళ్తున్నట్లయితే, ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారులు సైతం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన రాశుల ఫలితాలు ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications