For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తాజ్ మహాల్ అందాలను చూసి పరవశించిపోయిన అగ్రరాజ్య అధినేత ట్రంప్...

తాజ్ మహాల్ కు అగ్రరాజ్య అధ్యక్షులు వస్తున్న సందర్భంగా అక్కడ ఉన్న షాజహాన్, ముంతాజ్ సమాధులను ‘మడ్ ప్యాక్‘ విధానంలో శుభ్రపరిచారు.

|

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహాల్ ను వీక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ తొలిసారిగా వచ్చారు. గుజరాత్ లోని మొతేరా స్టేడియంలో 'నమస్తే ట్రంప్' అనే మెగా ఈవెంట్ లో అమెరికా అధ్యక్షుడు ప్రసంగించిన తర్వాత డొనాల్డ్, మెలానియా ట్రంప్ ఆగ్రాలోని తాజ్ మహాల్ పర్యటనకు వెళ్లారు.

Taj Mahal a timeless testament to rich and diverse beauty of Indian Culture : US President

అక్కడ ఈ అగ్రరాజ్య దంపతులు తాజ్ మహాల్ కట్టడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తాజ్ మహాల్ అందాలను చూసి పరవశించిపోయారు. ప్రేమకు చిహ్నమైన ఈ మహాల్ ను చూసి వీరిద్దరూ మంత్రముగ్ధులైపోయారు. ఈ అందాలను మరచిపోలేక పోతున్నామని, మరోసారి ఈ తాజ్ మహాల్ అందాలను చూసేందుకు తప్పకుండా వస్తామని చెప్పారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఈ స్టోరీలో చూడండి...

1) ఐ లవ్ ఇండియా..

1) ఐ లవ్ ఇండియా..

‘‘నేను భారతీయులందరికీ ఒకటే చెప్పదలచుకున్నాను. గత వైభవం గురించి గర్వపడమని చెబుతున్నాను. భవిష్యత్తు కోసం ఏకం అవ్వండి. మన దేశాలు స్వేచ్ఛ మరియు దాని విలువలకు కలిసి రానివ్వండి. దేవుడు అమెరికాను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇండియాను కూడా ఆశీర్వదిస్తాడు. మేము భారతదేశాన్ని చాాలా ప్రేమిస్తున్నాం‘‘ అన్నారు.

2) ‘క్రియేటివ్ హబ్‘..

2) ‘క్రియేటివ్ హబ్‘..

అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ బాలీవుడ్ ను ఉద్దేశించి ఇలా అన్నారు. భారతదేశాన్ని ‘క్రియేటివ్ హబ్‘ అని పిలుస్తారని, బాలీవుడ్ నుండి 2 వేలకు పైగా సినిమాలను సృష్టించే క్రియేటివ్ హబ్ అని కూడా అన్నారు. భారతదేశంలో ఎన్నో భాషలు, ఎన్నో మతాలు ఉన్నప్పటికీ భారతీయ దేశంగా ఏకత్వంలో ఉండటం చాలా గొప్ప విషయమని అన్నారు.

3) దాని గురించి ప్రత్యేకంగా..

3) దాని గురించి ప్రత్యేకంగా..

తాజ్ మహాల్ కు అగ్రరాజ్య అధ్యక్షులు వస్తున్న సందర్భంగా అక్కడ ఉన్న షాజహాన్, ముంతాజ్ సమాధులను ‘మడ్ ప్యాక్‘ విధానంలో శుభ్రపరిచారు. ఈ విధానం ట్రంప్ దంపతులు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారని అక్కడి గైడ్ నితిన్ చెప్పాడు.

4) ఉద్వేగానికి లోనయ్యారట..

4) ఉద్వేగానికి లోనయ్యారట..

తాజ్ మహాల్ కు సంబంధించి షాజహాన్, ముంతాజ్ మహాల్ కు సంబంధించిన ప్రేమ కథను విన్న వీరిద్దరూ చాలా ఉద్వేగానికి లోనయ్యారని కూడా అక్కడి గైడ్ నితిన్ మీడియాకు తెలిపాడు.

5) దాదాపు గంటసేపు..

5) దాదాపు గంటసేపు..

అహ్మదాబాద్ లో ‘నమస్తే ట్రంప్‘ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆగ్రాకు బయలుదేరిన ట్రంప్ దంపతులు ఆ పరిసరాల్లోనే దాదాపు గంటసేపు గడిపారు. సాయంకాలం సంధ్య వేళ.. చల్లని వాతావరణంలో తాజ్ అందాలను చూస్తూ ప్రక్రుతితో మమేకమైపోయారు.

6) తొలిసారిగా శాఖాహారం..

6) తొలిసారిగా శాఖాహారం..

భారత పర్యటనకు వచ్చిన ట్రంప్ దంపతులకు భారత ప్రభుత్వం శాఖాహార వంటకాలను మాత్రమే తయారు చేయించింది. అయితే ట్రంప్ కు మాంసాహారం అంటే చాలా ఇష్టమట.

7) గుజరాత్ ఫేవరేట్...

7) గుజరాత్ ఫేవరేట్...

గుజరాత్ లో ప్రసిద్ధ వంటకమైన ఖమన్ తో సహా వెజ్ బర్గర్లు, మల్టీ గ్రెయిన్ రొట్టెలు, బ్రొకోలీ, మొక్కజొన్న సమోసాలు, కొబ్బరి బొండాలతో పాటు వివిధ రకాల ఆహార పానీయాలను అందుబాటులో ఉంచారట.

8) భారత్ కు ప్రత్యేక స్థానం..

8) భారత్ కు ప్రత్యేక స్థానం..

భారతదేశం యొక్క ‘‘గొప్ప ఆతిథ్యం‘‘ తాను బాగా గుర్తుంచుకుంటానని, ‘‘భారతదేశానికి మా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుందని‘‘ అగ్రరాజ్య అధినేత ట్రంప్ వివరించాడు.

9) నమ్మకమైన స్నేహితుడు..

9) నమ్మకమైన స్నేహితుడు..

అంతకుముందు మొతేరా స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశించి ఇలా అన్నాడు.. ‘‘మోడీ భారతదేశం కోసం అవిరామంగా పని చేస్తాడు.. అయితే ఆయన కొంత కఠినంగా కూడా ఉంటాడు అని అన్నాడు. అమెరికా ఎల్లప్పుడూ భారతీయ ప్రజలకు నమ్మకమైన స్నేహితుడిగా ఉంటుంది‘‘ అని ట్రంప్ అన్నారు.

English summary

Taj Mahal a timeless testament to rich and diverse beauty of Indian Culture : US President

Here we talking about taj mahal a timeless testament to rich and diverse beauty of indian culture : US President. Read on
Desktop Bottom Promotion