For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Teacher's Day 2021:టీచర్స్ డే గురించి ఈ విశేషాలు తెలుసా...

|

మన దేశంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత గౌరవంగా భావించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క గురువు మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అందుకే గురువులను మనం 'ఆచార్య దేవోభవ' అంటూ విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను కీర్తిస్తాం. వాస్తవం చెప్పుకోవాలంటే.. మన తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులకే మన గురించి ఎక్కువ విషయాలు తెలుసు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనం ఎలా ఆలోచిస్తూ ఉంటాం.. మన తెలివితేటల గురించి వారికి బాగా తెలుసు.

కొన్నిసార్లు మనల్ని మంచి దారిలో నడిపించేందుకు కొంచెం కఠినంగా ఉంటారు. మనకు విద్య పట్ల తగ్గినట్టనిపించినా, మన మనసు పక్కదారి పట్టినట్టు గుర్తించినా పనిష్మెంట్లు ఇస్తుంటారు. అందుకే గురువును మించిన దైవం లేదని అంటూ ఉంటారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది అని అర్థం.

అంటే మనలో చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంప్రదాయం మనది. అందుకే గురువులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సతం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీచర్స్ డే నేపథ్యం ఏంటి.. ఎందుకని టీచర్స్ డే జరుపుకుంటారు.. ఉపాధ్యాయ దినోత్సవ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

ఉపాధ్యాయ దినోత్సవ నేపథ్యం..

ఉపాధ్యాయ దినోత్సవ నేపథ్యం..

భారత రత్న, భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. రాధాకృష్ణన్ 1888లో తిరుత్తనిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్ పుట్టినరోజును 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది.

గురువే తొలి దేవుడు..

గురువే తొలి దేవుడు..

దేవుడు, గురువు పక్కపక్కన ఉంటే.. నేను ముందుగా గురువుకే నమస్కారం చేస్తానని గొప్ప రచయిత, కవి కబీర్ దాస్ అన్నారు. ఎందుకంటే ఆయనకు భగవంతుడు గురించి తనకు చెప్పిన వ్యక్తి గురువే కాబట్టి అని వివరించారు. అందుకే సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది.

సర్వేపల్లి గురించి ప్రముఖుల మాటలు..

సర్వేపల్లి గురించి ప్రముఖుల మాటలు..

సర్వేపల్లి రాధాకృష్ణన్ తనకు క్రిష్ణుడిలా కనిపిస్తున్నారని అప్పట్లో జాతిపిత గాంధీజీ అన్నారు. తొలి ప్రధాన మంత్రి జవహార్ లాల్ నెహ్రూ కూడా సర్వేపల్లిని ఉద్దేశించి ఇలా ఉన్నారు. ‘మీరు నా ఉపాధ్యాయుడు.. యుగ పురుషుడు, జ్ణానమహర్షి' అని కొనియాడారు.

నోబెల్ బహుమతికి..

నోబెల్ బహుమతికి..

భారతదేశంలో ఆనాడు ఉన్న మత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకడమిక్ తాత్విక స్థాయిక తీసుకెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి అని ఎంఎన్ రాయ్ అన్నారు. అంతేకాదు ఆయన 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.

గురుశిష్యు సంబంధాలకు..

గురుశిష్యు సంబంధాలకు..

మహా భారత కాలం నుంచి శ్రీక్రిష్ణ పరమాత్మ అర్జునుడికి అసలైన గురువుగా ఉన్నారు. అప్పటినుండే మనం గురుశిష్య సంబంధానికి వారిని ప్రతీకలుగా భావిస్తున్నాం. సర్వేపల్లి తనకు క్రిష్ణుడితో సమానమని, నెహ్రూ టీచర్ సర్వేపల్లి అనే వ్యాఖ్యల నేపథ్యం నుంచే సర్వేపల్లి పుట్టినరోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన వచ్చిందేమో.

ప్రజ్ణాశాలి సర్వేపల్లి..

ప్రజ్ణాశాలి సర్వేపల్లి..

తరతరాలుగా, యుగయుగాలుగా సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, సరళంగా, స్పష్టంగా తెలియజేసిన ధీమంతుడు. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహా రచయిత రాధాక్రిష్ణన్. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయచరిత్రలో స్పష్టంగా వివరించారు. విద్యార్థులకు పాఠాలు చెప్పే గురువుల గురించి కూడా ప్రస్తావించారు.

English summary

Teacher's Day 2021 Date, History, Theme, Importance and Significance in Telugu

Here we are talking about Teacher's Day 2021, date, history, theme, importance and significance in Telugu. Read on
Story first published: Tuesday, August 31, 2021, 14:59 [IST]