Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
మీ రాశులను బట్టి మీ స్నేహితులకు ఎలాంటి బహుమతులు ఇవ్వాలో తెలుసా..
ఈ రాశి వారు క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ ప్రియమైన వారికి కలర్ ఫుల్ కండువాలు లేదా టోపీలు ఇవ్వవచ్చు. కొత్త టెక్ గాడ్జెట్ లేదా క్రీడలకు సంబంధించిన వస్తువును కూడా బహుమతిగా ఇవ్వవచ్చు.
క్రిస్మస్ పండుగ అంటేనే అలంకరణలు, రుచికరమైన వంటకాలు, అందమైన కొత్త దుస్తులే కాదు. కానుకలు, బహుమతులు సైతం ఇచ్చి పుచ్చుకునే పండుగ. అందుకే ఈ పండుగ పట్ల అందరికీ భిన్నమైన ఉత్సాహం ఉంటుంది. ఈ పండుగతో పాటు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు అందరూ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తారు.

నిరుపేదలు, నిరాశ్రయులకు అండగా, ఆసరాగా మానవాళి నిలవాలన్న సందేశాన్ని యేసుక్రీస్తు రూపంలో తెచ్చిన మహా పర్వదినమే క్రిస్మస్. మన కోసం మనం ఎంత ఖర్చు చేస్తున్నామని కాక, పేదల కోసం కొంత అయినా చేస్తున్నామా లేదా అన్నది తప్పక ఆలోచించుకుకోవాలి. అయితే ఈ పండుగ క్రైస్తవులే కాకుండా ఇతర మతాల వారు కూడా అనుసరిస్తారు. ఈ పండుగ సందర్భంగా ప్రజలు కుటుంబం మరియు స్నేహితులకు బహుమతులు కూడా ఇస్తారు. మీరు కూడా మీ దగ్గరున్న వారికి క్రిస్మస్ గిఫ్టులు ఇవ్వాలని ఆలోచిస్తుంటే కింద ఉన్న జాబితాను చూడండి... మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల రాశిచక్రం ప్రకారం మీ ప్రియమైన వారికి ఏ గిఫ్ట్ సరిపోతుందో తెలుసుకోండి...

మేష రాశి..
ఈ రాశి వారు క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ ప్రియమైన వారికి కలర్ ఫుల్ కండువాలు లేదా టోపీలు ఇవ్వవచ్చు. కొత్త టెక్ గాడ్జెట్ లేదా క్రీడలకు సంబంధించిన వస్తువును కూడా బహుమతిగా ఇవ్వవచ్చు.

వృషభ రాశి..
ఈ రాశి వారు సింపుల్ అండ్ బ్యూటీఫుల్ థింగ్సును ఇష్టపడతారు. అలాగే వాటిలో ఓదార్పు కూడా పొందుతారు. ఈ క్రిస్మస్ పండుగకు మీరు మీ ప్రియమైన వారికి లేదా స్నేహితులకు చాక్లెట్ బాక్స్ లేదా చక్కని వైన్ ఇవ్వొచ్చు. దీంతో పాటు మంచి దుప్పటి కూడా గిఫ్టుగా ఇవ్వవచ్చు.

మిధున రాశి..
ఈ రాశి వారు ఎక్కువగా పుస్తకాలు మరియు సినిమాలను ఇష్టపడతారు. అందుకే మీరు మీ ప్రియమైన వారికి గిఫ్టులను కొనేందుకు మీరు తీవ్ర ప్రయత్నాలేమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు మంచి పుస్తకం లేదా డిజిటల్ ప్లాట్ ఫామ్ కు సభ్యత్వాన్ని పొందవచ్చు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు వంటలకు సంబంధించిన పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు. అలాగే ఇంటి అలంకరణ వస్తువులను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు.

సింహ రాశి..
ఈ రాశి వారి దగ్గర బడ్జెట్ మంచిగా ఉంటే మీరు మీ ప్రియమైన వారికి బంగారు ఆభరణాలను ఇవ్వవచ్చు. అలాగే స్టైలిష్ దుస్తులను కూడా బహుమతులుగా ఇవ్వచ్చు.

కన్య రాశి..
ఈ రాశి వారు తమ స్నేహితులకు లేదా ప్రియమైన వారికి క్యాండిల్ లైట్లు లేదా కక్వేర్ సెట్లను బహుమతిగా ఇవ్వవచ్చు. ఎందుకంటే వీటిని అందరూ ఇష్టపడతారు. మీకు కావాలంటే వారికి ఫొటో ఫ్రేమ్ లను కూడా ఇవ్వవచ్చు.

తులా రాశి...
ఈ రాశి వారు తమ ప్రియమైన వారికి లేదా స్నేహితులకు ఏదైనా ప్రత్యేకంగా ఉండే తినే వస్తువును ఇవ్వవచ్చు. అలాగే మీరు మంచి రెస్టారెంటులో అందరూ కలిసి విందుకోసం కూడా వెళ్లవచ్చు.

వృశ్చికరాశి..
ఈ రాశి వారు కూడా తమ ప్రియమైన వారికి లేదా స్నేహితులకు కండువా లేదా మంచి స్వెటర్ వంటివి బహుమతిగా ఇవ్వవచ్చు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి జర్నీ అంటే చాలా ఇష్టం. అలాంటి పరిస్థితిలో మీరు ప్రయాణించేటప్పుడు ఉపయోగించాల్సిన వస్తువులను వారికి ఇవ్వవచ్చు. మీ బడ్జెట్ ఎక్కువగా ఉంటే ట్రావెల్ వోచర్లను కూడా గిఫ్టుగా ఇవ్వవచ్చు.

మకర రాశి..
ఈ రాశి వారు స్నేహితుల మరియు ప్రియమైన వారి విలువను బాగా అర్థం చేసుకుంటుారు. అందుకే వీరు ఏ వస్తువును అయినా బహుమతిగా ఇవ్వవచ్చు.

కుంభ రాశి..
ఈ రాశి వారు సాంకేతిక విషయాలను బాగా ఇష్టపడతారు. కాబట్టి మీ స్నేహితులు మరియు ప్రియమైన వారికి మీరు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను బహుమతులుగా ఇవ్వవచ్చు.

మీన రాశి..
ఈ రాశి చక్రం వారు రొమాంటిక్ గా మరియు చాలా సున్నితంగా ఉంటారు. వీరు ప్రేమను ఇతరుల నుండి ఆశించారు. వీరు బాత్ ఆయిల్, పర్ఫ్యూమ్ మొదలైన అందానికి సంబంధించిన వస్తువులను బహుతమతులుగా ఇవ్వవచ్చు.



Click it and Unblock the Notifications