Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Vicious Zodiac Signs: ఈ రాశుల వారితో జాగ్రత్త! అదను చూసి కాటేస్తారు
మోసపూరిత వ్యక్తుల గురించి ముందస్తుగా జాగ్రత్తగా ఉండటం తప్పా మనం చేయాల్సిందేమీ ఉండదు. కొన్ని రాశుల వారు దుర్మార్గంగా వ్యవహరిస్తారు. ఆ రాశుల వారు ఎవరో, వారు ఎంతటి ప్రమాదమో ఇప్పుడు చూద్దాం.
Vicious Zodiac Signs: కొందరు చాలా సౌమ్యంగా కనిపిస్తారు. సున్నితంగా వ్యవహరిస్తారు. కానీ వాళ్లు తేనె పూసిన కత్తుల్లా ఉంటారు. అదను చూసి దాడి చేస్తారు. నమ్మకద్రోహం చేయడం వారికి మొదటి నుండి ఉన్న అలవాటే. విశ్వాసం అనే పదం వారి డిక్షనరీలో ఉండదు.

మోసపూరిత వ్యక్తుల గురించి ముందస్తుగా జాగ్రత్తగా ఉండటం తప్పా మనం చేయాల్సిందేమీ ఉండదు. కొన్ని రాశుల వారు దుర్మార్గంగా వ్యవహరిస్తారు. ఆ రాశుల వారు ఎవరో, వారు ఎంతటి ప్రమాదమో ఇప్పుడు చూద్దాం.

1. మిథునరాశి
మిథునరాశి వారికి దుష్టపక్షం ఉంటుందని చెబుతారు. వారు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులు. మోసం చేయడంలో వారిని మించిన వారు మరొకరు ఉండరు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, వెనక మరోలా ప్రవర్తిస్తుంటారు. ముఖంపై తీపిగా మాట్లాడతారు. వెనక ఉండి గోతులు తవ్వుతారు.
మిథునరాశి వారి తప్పుడు వాగ్దానాలు చేస్తుంటారు. వారి పని పూర్తికావడానికి ఎలాంటి పనైనా చేసేందుకు ముందుంటారు.

2. కర్కాటకరాశి
కర్కాటక రాశి వారు రెండు నాల్కల ధోరణితో ఉంటారు. వారి స్వార్థం కోసం ఏదైనా చేసేందుకు ముందుంటారు. సహాయం చేస్తున్నట్లుగా కనిపించేలా చేస్తారు.. కానీ స్వార్థం పూరితంగా వ్యవహరిస్తారు.

3. కన్యరాశి
కన్య రాశి వారు పైకి చెడ్డవారిలా కనిపించరు. సౌమ్యులుగా, సున్నితంగానే ఉంటారు. కానీ వారు తేనె పూసిన కత్తుల్లా ఉంటారు. నమ్మకద్రోహం అంటే ఏమిటో వారు చేసే పనుల ద్వారా తెలిసివస్తుంది. వారి స్వార్థం కోసం తిమ్మినిబమ్మి చేస్తారు.

4. తులారాశి
తులారాశి వారు చూడటానికి అమాయకంగానే కనిపిస్తారు. కానీ దుర్మార్గంగా ఆలోచిస్తారు. తులారాశి వారిలో స్వచ్ఛత ఉండదు. వారి మనసు నిండా చెడు ఆలోచనలే ఉంటాయి. మనకు తెలియకుండానే వారి పనులను మనతో చేయించుకునే నేర్పు వారిలో ఉంటుంది.

5. వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారిని ఎవరైనా ఈజీగా నమ్మేస్తారు. నమ్మకస్థులే కదా నమ్మకద్రోహం చేసేది. మన వాళ్లే కదా అని రహస్యాలు చెబితే దాంతో వారికి వచ్చే స్వలాభం ఏమిటా అని చూస్తారు.
మేషం, వృషభం, సింహం, ధనస్సు, మకరం, కుంభం, మీనం రాశుల వారికీ దుర్మార్గపు ఆలోచనలు ఉండొచ్చు. కానీ వారు చాలా అరుదుగా మాత్రమే తమ స్వార్థం చూపిస్తుంటారు.



Click it and Unblock the Notifications