Latest Updates
-
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు!
ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాలు ఇవే..
‘ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్‘ యూనిట్ తాజాగా విడుదల చేసిన అత్యంత నివాసయోగ్య సూచి (2019)లో ఆస్ట్రియా రాజధాని వియన్నా వరుసగా రెండోసారి ప్రథమ స్థానాన్ని కైవశం చేసుకుంది.
సాధారణంగా ప్రపంచంలోనే అత్యుత్తమ నివాసయోగ్య నగరాలు ఏవని అడిగితే చాలా మంది టక్కున చెప్పే సమాధానం న్యూయార్క్, లండన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి నగరాల పేర్లు చెబుతుంటారు. కానీ వారి అంచనాలు తప్పని తేల్చింది 'ది ఎకనామిస్ట్ ఇంటిలిజెన్స్' యూనిట్. గత ఏడాదే మోస్ట్ పాపులర్ నగరాలన్నింటినీ అధిగమించి అగ్రస్థానంలో నిలిచిన వియన్నా నగరమే మరోసారి ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఫస్ట్ ప్లేసును నిలబెట్టుకుంది.
'ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్' యూనిట్ తాజాగా విడుదల చేసిన అత్యంత నివాసయోగ్య సూచి (2019)లో ఆస్ట్రియా రాజధాని వియన్నా వరుసగా రెండోసారి ప్రథమ స్థానాన్ని కైవశం చేసుకుంది. దాదాపు ఏడు సంవత్సరాల పాటు తొలిస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్బోర్నో నగరాన్ని వెనక్కి నెట్టి 2018లో అగ్రస్థానానికి చేరినా వియన్నా ఆ స్థానాన్ని మళ్లీ పదిలంగా నిలుపుకుంది. సిడ్నీ, ఒసాకా తరువాతి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ సర్వేను మొత్తం 140 నగరాల్లో నిర్వహించారు. జీవన ప్రమాణ స్థాయి, నేరాల నమోదు, ప్రయాణ, మౌలిక వసతులు, విద్య, వైద్యంతో పాటు రాజకీయ, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాల ఆధారంగా ఈ సర్వేను చేపట్టారు. తొలిసారిగా పర్యావరణ పరిస్థితుల్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

ఇక ప్రాంతాల వారీగా పశ్చిమ ఐరోపా, దక్షిణ అమెరికాలు నివాసానికి అనువుగా ఉన్నాయని తేల్చారు. తొలి 20 నగరాల్లో ఎనిమిది నగరాలు ఐరోపా దేశాల్లోనే ఉండటం విశేషం. అయితే ప్రముఖ నగరం పారిస్ మాత్రం మరో ఎనిమిది స్థానాలు దిగజారి 25వ స్థానంలో నిలిచింది. ఇక లండన్ 48వ స్థానానికి పరిమితం కాగా, న్యూయార్క్ నగరం 58వ స్థానానికి పడిపోయింది. నిత్యం బాంబుల మోతతో దద్దరిల్లే సిరియా రాజధాని డమస్కన్ చివరి స్థానంలో నిలిచింది. ట్రిపోలి, ఢాకా, కరాచీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఇంకా దిగజారిన ఢిల్లీ, ముంబై ర్యాంకు..
అంతర్జాతీయంగా అత్యంత నివాస యోగ్య సూచీలో తొలి 100 నగరాల్లో మన దేశానికి చెందిన ఒక్క నగరం కూడా లేకపోవడం విచారకరం. గతేడాది 112వ స్థానంలో నిలిచిన ఢిల్లీ నగరం ఈ ఏడాది 118వ స్థానానికి పడిపోయింది. నేరాల నమోదు రేటు కూడా గతేడాదితో పోల్చి చూస్తే పెరిగిపోవడం, తీవ్ర వాయు కాలుష్యం ఇందుకు ప్రధాన కారణాలు తెలుస్తోంది. మరో ముఖ్యమైన నగరం ఆర్థిక రాజధాని పిలువబడే ముంబై కూడా 117 నుండి 119వ స్థానానికి దిగజారింది.



Click it and Unblock the Notifications
