For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ రాశి వారు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.. ఎవరు ఎక్కువ ఆదా చేస్తారో తెలుసా...

|

మన చేతిలో డబ్బులుంటే.. దాన్ని ఆదా చేయాలనుకుంటాం.. కానీ.. ఏదో ఒక అవసరం వచ్చి దాన్ని ఏదో ఒక రూపంలో ఖర్చు చేసేస్తుంటాం.

ఇక డబ్బులు చేతిలో ఉంటే ఎప్పుడెప్పుడు షాపింగ్ చేసేద్దామా.. ఎలాంటి గ్యాడ్జెట్లు కొందామా.. కొత్త వాటిని ఎప్పుడెప్పుడు ఇంటికి తెచ్చుకుందామా అని ఆలోచిస్తూ ఉంటాం. కొందరేమో డబ్బులు అకౌంట్లో పడటమే ఆలస్యం.. ఎప్పుడెప్పుడు ఖర్చు పెడదామా అని అనుకుంటూ ఉంటారు. మరికొందరు డబ్బులను నీళ్లలా ఖర్చుపెడుతూ ఉంటారు.

అయితే కొందరు వ్యక్తులు మాత్రం ఎంత ఎక్కువ డబ్బు సంపాదించినా.. తమ వద్ద ఏమీ లేనట్టు.. చాలా అమాయకంగా ఉంటారు. వీరు చాలా పొదుపుగా ఉంటారు. తమ ఖాతాలోని సొమ్మును ఖర్చు పెట్టడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఇలాంటి వ్యక్తులను కనిపెట్టడం కాస్త కష్టమే. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల ఆధారంగా ఏ రాశి వారు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు.. ఏ రాశి వారు ఎక్కువగా సొమ్మును పొదుపు చేస్తారనే విషయాలను తెలుసుకోవచ్చు. ఇంతకీ మీ రాశి ఏ జాబితాలో ఇప్పుడు చూసెయ్యండి...

ఈ రాశి స్త్రీలు పుట్టుకతో అదృష్టవంతులట.. వీరితో వివాహం వల్ల చాలా ప్రయోజనాలట...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసేస్తుంటారట. వీరు షాపింగుకు వెళ్లినప్పుడంతా.. అక్కడ ఉండే ఆఫర్లకు ఆకర్షితులవుతారట. ఆ వెంటనే అన్నింటినీ కొనేయాలని భావిస్తారట. అయితే అలా చేయడం వల్ల వీరు అప్పుల పాలయ్యే అవకాశం ఉందట. కానీ వీరు షాపింగుకు వెళ్లిన ప్రతిసారీ ఇలా చేయకుండా కంట్రోల్ లో ఉండాలట. అప్పుడే వీరు డబ్బును ఆదా చేసే అవకాశం ఉంటుందట.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు ఎల్లప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారట. అందుకే వీరు డబ్బును ఎక్కువగా ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరట. అంతేకాదు.. వీరు విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేయడం వంటివి చేయకుండా.. క్వాలిటీ ఉండే వస్తువులపై పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారట.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారట. అందరిలాగా డబ్బు చేతిలో ఉంటే ఖర్చు పెట్టాలని మాత్రం ఆలోచించరట. ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే ఆందోళనతో ఆదాయాన్ని ఆదా చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారట. అనవసరమైన వాటికి డబ్బును ఖర్చు చేయకుండా ఉంటారట. కాబట్టి వీరు డబ్బును ఎక్కువగా పొదుపు చేస్తారని చెప్పొచ్చు.

సొంతరాశిలోకి శని నేరుగా ప్రవేశిస్తే... ఈ రాశులకు బంపరాఫర్...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారి చేతిలో డబ్బు ఉంటే.. దాన్ని ఖర్చు పెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారట. అయితే వీరు ఎక్కడ తక్కువ డబ్బుకు వస్తువులు దొరుకుతాయో.. ఎక్కడైతే భారీ ఆఫర్లు ఉంటాయో వాటినే ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపుతారట. వీరు ఒక్క పైసా ఖర్చు పెట్టాలన్నా పదిసార్లు ఆలోచిస్తారట.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారట. వీరు తమ సంపాదనను బట్టి.. ఎంత ఖర్చు చేయాలి.. ఎంత ఆదా చేయాలనే విషయాలపై చాలా క్లారిటీతో ఉంటారు. వీరికి తమ ఆదాయం, ఖర్చులపై పూర్తి స్పష్టత ఉంటుంది. అందుకే వీరు ఎక్కువ డబ్బు ఆదా చేస్తుంటారు. అంతేకాదు వీరు ప్రతి పైసాను చాలా తెలివిగా ఖర్చు చేస్తారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు తమ వద్ద ఉన్న సొమ్మును ఖర్చు చేసేటప్పుడు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. తాము ఖర్చు పెట్టే ప్రతి పైసాకు ఫలితం ఉందంటేనే డబ్బు బయటకు తీస్తారు. లేదంటే తమ ఖాతా నుండి ఒక్క రూపాయి బయటకు తీయరు. అలాగే నాణ్యతను బట్టి వస్తువులను కొనుగోలు చేస్తారు.

ఈ వారం మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి...

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు డబ్బులను చాలా తెలివిగా ఖర్చు చేస్తారు. వీరు ఆదాయం, ఖర్చుల విషయంలో సమతూకాన్ని పాటిస్తారు. వీరు ఒక వస్తువు కోసం ఎక్కువగా ఖర్చు చేస్తే.. మరో దగ్గర కంట్రోల్ చేసుకుంటారు. వీరికి తమ వద్ద ఉన్న డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి.. ఎలా ఆదా చేయాలి.. అనే విషయంలో పూర్తి అవగాహనతో ఉంటారు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు తమ వద్ద ఉన్న ఆదాయాన్ని ఆదా చేయడంలో అందరి కంటే ముందు వరుసలో ఉంటారు. అయితే వీరు ఎంత ఆదా చేసినా.. వాటిని ఏదో ఒక రూపంలో ఖర్చు పెట్టేస్తుంటారు. అయితే వీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు తాము సంపాదించిన సొమ్మును ఎక్కువగా ఖర్చు చేయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా డ్రస్సులు, ఫుడ్ వంటి వాటిపైనా పెట్టుబడి పెట్టరు. అయితే వీరు జర్నీ చేసేందుకు, ఏదైనా రిస్క్ ఉండే విషయాలకు మాత్రం తెగ ఖర్చు పెట్టేస్తారు. తమకు నచ్చిన పుస్తకం కనబడితే.. అది ఎంత ఖరీదైనది అయినా.. దాన్ని కొనేందుకు ఏ మాత్రం వెనుకాడరు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు ఆదాయాన్ని ఆదా చేయడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వీరు ఒక రూపాయి ఖర్చు పెడుతున్నారంటే.. దానికి తగ్గట్టు ఫలితం వస్తుందా లేదా అనేదే కచ్చితంగా పరిశీలిస్తారు. తాము ఖర్చు పెట్టే డబ్బు నుండి ఫలితం తక్కువగా ఉందని తెలిస్తే.. డబ్బు అస్సలు బయటకు తీయరు. మరో విశేషం ఏంటంటే.. వీరు డబ్బును ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలని ఆశిస్తారు. వీరు ఆదాయం వచ్చే దారులనే ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా చాలా లోతుగా ఆలోచిస్తారు. అయితే వీరు డబ్బులను ఎలా పడితే అలా ఖర్చు చేయరు. వీరికి ఆదాయ పరమైన టార్గెట్లు ఉంటాయి. వీరు ప్రతి పైసాను సేవ్ చేయాలని భావిస్తూ ఉంటారు. ప్రతి పైసా చాలా జాగ్రత్తగా ఆదా చేయాలని కోరుకుంటారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు ఆదాయం విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారు. వీరు స్నేహితులు, ఫ్యామిలీ ద్వారా చాలా సొమ్మును ఆదా చేసుకుంటారు. ఆర్థిక సలహాదారుల సహాయంతో డబ్బును ఎలా ఆదా చేయాలో తెలుసుకుంటూ ఉంటారు.

English summary

The Zodiac Signs Ranked Most To Least Frugal With Their Money

Here are the zodiac signs ranked most to least fruugal with their money. Have a look
Story first published: Tuesday, October 26, 2021, 12:49 [IST]