For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మే నెలలో వృషభంలో 3 గ్రహాల సంయోగం.. ఈ రాశులపై అత్యంత ప్రభావం...!

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం కారణంగా ప్రతి ఒక్కరి జీవితాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. వాటి ఆధారంగానే మన జీవనశైలి అనేది కొనసాగుతుంది.

ప్రతి నెల గ్రహాలు తమ దిశలను మార్చుకుంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనూ మే నెలలో కూడా అనేక గ్రహాలు పరివర్తనం చెందనున్నాయి. అయితే ఈ నెలలో ఒకే రాశిలో మూడు గ్రహాలు ప్రవేశించనున్నాయి.

ముందుగా నెల ప్రారంభంలో వృషభంలోకి బుధుడు ప్రవేశించనుండగా.. ఆ వెంటనే శుక్రుడు, సూర్యుడు సంచారం చేయనున్నారు. ఈ సమయంలో వృషభరాశిలో త్రిగ్రహ సంయోగం జరగనుంది.

ఈ యోగం వల్ల ఈ రాశి వారిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ రాశి వారితో మరికొన్ని రాశుల వారిపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా మూడు గ్రహాల సంయోగం ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Monthly Horoscope: మే మాసంలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశిలో మూడు గ్రహాల సంయోగం వల్ల, వృషభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చాలా శక్తిమంతంగా ఉంటారు. మీరు చేపట్టే పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రాశిలోకి ఒకేసారి మూడు గ్రహాలు ప్రవేశించడం వల్ల సానుకూల ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో ప్రమోషన్ రావొచ్చు. మీకు రొమాన్స్ పరంగా, శారీరకంగా, మానసికంగా మంచి అనుభూతి కలుగుతుంది. మీరు జీవితంలో ఓపికగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఉత్సాహం వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. దీని వల్ల మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మిధున రాశి..

మిధున రాశి..

వృషభ రాశిలో మూడు గ్రహాల సంయోగం వల్ల ఈ రాశి వారు చాలా పనుల్లో విజయం సాధించొచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రమోషన్ ఉండొచ్చు. ఈ కాలంలోనే సూర్యుడు 14వ తేదీ నుండి 12 పాదంలో రవాణా చేయనున్నాడు. అయితే ఈ సమయంలో మాత్రం మిధున రాశి వారికి కోర్టు పరమైన విషయాల్లో విజయం దక్కకపోవచ్చు. అయితే పెండింగ్ పనులను మాత్రం పూర్తి చేస్తారు. మీ కళ్లకు సంబంధించిన సమస్యలు, రుగ్మతలు, ఇబ్బందులు పెరగొచ్చు. దీంతో పాటు నిద్రలేమి వంటి సమస్యలు ఏర్పడతాయి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

వృషభరాశిలోకి మూడు గ్రహాల సంయోగం సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ప్రత్యర్థులు, శత్రువుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశి వారికి 11వ పాదంలో గ్రహ దోషం కారణంగా ఆర్థిక పరమైన సమస్యలు ఎదురుకావొచ్చు. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లి స్థిరపడాలనుకునే వారి కల నెరవేరొచ్చు.

బుధుడు వృషభంలోకి ఎంట్రీ.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు...!

సింహ రాశి..

సింహ రాశి..

వృషభ రాశిలోకి మూడు గ్రహాలు స్థానం మార్పు చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. అయితే మీరు శత్రువులపై పైచేయి సాధిస్తారు. మీ ప్రేమ బంధంలో విజయవంతం అవుతారు. మీరు ఆర్థిక పరమైన లావాదేవీల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఆరోగ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆహార, పానీయాలపై అప్రమత్తంగా ఉండాలి. మీరు వీలైనంత వరకు ఎవ్వరి మధ్య వివాదాల్లో జోక్యం చేసుకోకండి. ఎందుకంటే అవి తిరిగి మీ మీద వచ్చే అవకాశం ఉంది.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి సూర్యుడు, రాహువు వల్ల కొంత దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ పనులన్నీ మధ్యలోనే ఆగిపోవచ్చు. అయితే మీరు మీ మేధస్సును ఉపయోగించి, మీ సామర్థ్యాన్ని ఉపయోగించడం వల్ల మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ప్రేమికులకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ పనులన్నీ పూర్తి కావాలంటే.. సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి. గోధుమ, బెల్లం వంటి సూర్యుడికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి.

మకర రాశి..

మకర రాశి..

వృషభరాశిలోకి మూడు గ్రహాల సంయోగం సమయంలో ఈ రాశి వారు పిల్లల విషయంలో కొంత ఆందోళనకు గురవుతారు. మీకు ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు వస్తాయి. మహిళలు, ముఖ్యంగా గర్భిణులు తమ ఆరోగ్యాన్ని తామే చూసుకోవాలి. విదేశాలలో చదువుకోవాలనే వారి కోరిక నెరవేరాలంటే చాలా కష్టపడాలి. విదేశీ సంబంధింత వ్యాపారంలో ప్రయోజనం ఉంటుంది. మీకు అన్ని పనుల్లో విజయం లభించాలంటే.. సూర్యభగవానుడి మంత్రాన్ని జపించాలి. మీరు శని స్తోత్రాన్ని జపించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహువు, సూర్యుడు ఐదో పాదంలో ఉన్నారు. దీని వల్ల మీకు ప్రమాదం కలుగొచ్చు. మరోవైపు ఈ రాశి వారు తమ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందొచ్చు. ఈ సమయంలో మీరు చట్టపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ రంగంలో పని చేసే ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, చివరికి అన్ని పనులు పూర్తి చేసుకుంటారు.

English summary

These 3 Big Planets Transit on May 2021 Taurus Zodiac Sign Will Be Affected the Most

Check out the details, these 3 big planets transit on may 2021 Taurus zodiac sign will be affected the most. Read on
Story first published: Monday, May 3, 2021, 11:26 [IST]