Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
అక్టోబర్ నెలలో 4 గ్రహాల తిరోగమనం.. ఈ రాశులకు ఆర్థిక రంగంపై ప్రభావం...!
అక్టోబర్ 2021లో ఈ నాలుగు గ్రహాలు తమ స్థానాన్ని మారనున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి సానుకూలం. ఆ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలలోని కొన్ని గ్రహాలు ప్రతి నెలా ఒక స్థానం నుండి మరో స్థానానికి మారుతూ ఉంటాయి. సెప్టెంబర్ మాసంలో దాదాపు ఐదు గ్రహాలు ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి ప్రవేశించాయి.

అదే విధంగా అక్టోబర్ మాసంలో కూడా నాలుగు గ్రహాలు తమ స్థానాన్ని మారనున్నాయి. అయితే ఈ నెలలో నాలుగు గ్రహాలు తిరోగమనం చెందనున్నాయి. ఇలా గ్రహాలు ఒక రాశి నుండి మరో రాశిలోకి సంచారం చేసే సమయంలో ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది.

అయితే అక్టోబర్ నెలలో గ్రహాల తిరోగమనం వల్ల కొన్ని రాశుల వారికి నష్టం ఉంటుందట. ముఖ్యంగా సామాన్యులతో పాటు ఆర్థిక రంగంపై ప్రభావం చూపుతుందట. ఎందుకంటే గ్రహాలలో రాజుగా పరిగణించే సూర్యుడు బలహీనమైన తులరాశిలో సంచరించనున్నాడు. శుక్రుడు కన్యరాశిలో సంచారం చేయనున్నాడు. అంగారకుడు మీన రాశిలోకి తిరోగమనంలో ప్రవేశించనున్నాడు.

బుధుడు సైతం కన్య రాశిలోకి తిరోగమనం చేయడం వల్ల 12 రాశులలోని కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి.. ముఖ్యంగా తులరాశిలోకి సూర్యుడి సంచారంతో అనేక మార్పులు సంభవిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రహాల స్థానచలనం వల్ల ఏ రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడనుంది.. ఏ రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు? ఆ జాబితాలో మీ రాశి ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
ఈ రాశి వారికి నాలుగు గ్రహాల తిరోగమనం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ పార్ట్నర్ తో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే మీ మధ్య మనస్పర్దలు పెరిగిపోతాయి. ఈ మాసంలో శుక్రుడు మీ రాశి నుండి ఆరో స్థానంలో ఉంటాడు. ఈ నేపథ్యంలో మీ ఖర్చులు విపరీతంగా పెరగొచ్చు. దీంతో మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పొచ్చు.

సింహ రాశి..
బుధుడు తిరోగమనం చేయడం వల్ల ఈ రాశి వారికి బలహీనంగా ఉంటుంది. దీంతో వీరికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఈ కారణంగా మీరు సామాజికంగా పోరాటం చేయాల్సి రావొచ్చు. ఈ అక్టోబర్ నెలలో మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా మీ పదాలను కంట్రోల్ చేసుకోవాలి. కోపంలో ఏదైనా మాట్లాడితే మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీంతో మీ రిలేషన్ దెబ్బతింటుంది. మీ సోదరులతో మంచి సంబంధాలను కొనసాగించాలంటే మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది.

తుల రాశి..
ఈ రాశిలోనే సూర్యుడు సంచారం చేయడం వల్ల మీ విశ్వాసం తగ్గిపోతుంది. కాబట్టి ఈ నెలలో మీరు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అత్యంత ఉత్సాహంతో మీరు పనులు చేయడం చాలా ప్రమాదకరం. తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు అనుభవం ఉన్న వారి సలహాలు, సూచనలు తప్పక పాటించాలి. మీ విశ్వసనీయ వ్యక్తులతో మాట్లాడాలి. మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రానివ్వొద్దు. ప్రతిరోజూ సూర్యుడికి జలాన్ని సమర్పిస్తే కొంత ప్రయోజనం ఉంటుంద.

వృశ్చిక రాశి..
ఈ నెలలో నాలుగు గ్రహాల తిరోగమనం వల్ల వృశ్చికరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా శుక్రుడు తిరోగమనం చెందడం వల్ల వ్యాపారులకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. బుధుడి తిరోగమనం కారణంగా మీ సామర్థ్యం బలహీనపడే అవకాశం ఉంది. అంతేకాదు ఇది మీ వ్యాపారంపైనా చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఈ కాలంలో వ్యాపారం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి..
అక్టోబరు నెలలో నాలుగు గ్రహాల తిరోగమనం వల్ల ఈ రాశి వారికి మనసులో ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా అంగారకుడు తిరోగమనం చెందడం వల్ల మీపై ఎక్కువ ప్రభావం పడనుంది. ఈ కారణంగా మీలో చురుకుతనం తగ్గిపోతుంది. సూర్యుడు కూడా ఎనిమిదో స్థానంలో ఉండటం వల్ల మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఎంత కష్టపడినా, జీవితంలో మీరు విజయం సాధించలేదని మీకు అనిపించే అవకాశం ఉంది. ఈ కారణంగా మీరు మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో మీరు యోగా, ధ్యానం చేస్తే ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications











