Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Chanakya Niti: త్వరలో మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని ఈ సంకేతాలు చెప్పేస్తాయి
లక్ష్మీ దేవికి కోపం వచ్చేలా ప్రవర్తిస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయని, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవదని చాణక్యుడు చెప్పాడు. మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కోబోతున్నారని కొన్ని సంకేతాలు చెప్పేస్తాయని చాణక్యుడు సూచించాడు.
ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థిక వేత్త, రాజకీయవేత్త. ఆయన తన నీతి శాస్త్ర చాణక్య నీతిలో ఎన్నో విషయాల గురించి సవివరంగా చెప్పాడు. లక్ష్మీ దేవి ప్రసన్నం చేసుకునే మార్గాలకు కూడా వెల్లడించాడు. దీంతో పాటు లక్ష్మీ దేవికి ఏ పనుల వల్ల కోపం వస్తుందో, కోపం రావడానికి ఎలాంటి చర్యలు దారి తీస్తాయో వెల్లడించాడు.

లక్ష్మీ దేవికి కోపం వచ్చేలా ప్రవర్తిస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయని, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవదని చాణక్యుడు చెప్పాడు. మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కోబోతున్నారని కొన్ని సంకేతాలు చెప్పేస్తాయని చాణక్యుడు సూచించాడు. ఆ సంకేతాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుటుంబ కలహాలు:
ఆచార్య చాణక్యుడి ప్రకారం ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండటం చెడు సంకేతం. ఇంట్లో ప్రశాంతత లేకపోవడం, తరచూ కలహాలు అవుతుండటం గమనించదగిన అంశమని చాణక్యుడు చెప్పాడు. దిగజారుతున్న ఆర్థిక పరిస్థితికి అది సంకేతమని ఆచార్యుడు సూచించాడు. రోజూ గొడవలు జరిగే ఇంట్లో ఉండటానికి లక్ష్మీదేవి ఇష్టపడదని, దీని వల్ల త్వరలోనే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చాణక్యుడు వెల్లడించాడు.
తులసి మొక్క ఎండిపోవడం:
తులసి మొక్కను లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా చూస్తారు. సనాతన ధర్మంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలనేది పెద్దలు, పండితులు చెప్పే మాట. తులసి మొక్క ఇంట్లో మంచి జరుగుతుందని, దేవతలపై కరుణ ఇంటిపై ఉంటుందని అంటారు. అయితే తులసి మొక్క ఉన్నట్టుండి ఎండిపోతుంటే అది లక్ష్మీ దేవి అసంతృప్తిని తెలియజేస్తుందని అర్థం. ఇలా తులసి మొక్క ఎండిపోవడం ఆర్థిక సమస్యలకు రావడానికి సంకేతమని శాస్త్రాలు చెబుతున్నాయి.
గాజులు పగిలిపోవడం:
ఆడవారు వేసుకునే గాజులు ఎప్పుడో ఒకప్పుడు పగిలిపోవడం సాధారణమే. అయితే గాజులు ఇలా తరచూ పగిలిపోతుండటం చెడు సంకేతమని చాణక్యుడు చెప్పాడు. ఏదైనా సమస్య రావడానికి ఇదో సూచన అని అప్రమత్తంగా ఉండాలని ఆచార్యుడు హెచ్చరించాడు. ఏ పని చేయాలనుకున్నా ఒకటి రెండు సార్లు ఆలోచించాలని చెప్పాడు.
నిద్రలేకపోవడం:
ఇంట్లోని కుటుంబసభ్యుల్లో చాలా మందికి ఉన్నట్టుండి నిద్రలేకపోవడం జరుగుతుంది. నిద్రపోతే చెడు కలలు, పీడ కలలు వస్తాయి. ఇలా జరుగుతుంటే అది చెడు సంకేతంగా చూడాలని చాణక్యుడు చెప్పాడు. ఇలా జరుగుతుంటే మొదట వాస్తు దోషాలను నివారించాలని, ఆ తర్వాత లక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజించాలని ఆచార్యుడు సూచించాడు.
పాలు పదే పదే విరిగిపోవడం:
వంటింటిని, ముఖ్యంగా స్టవ్ ను దేవతగా భావిస్తారు హిందువులు. మీరు పాలు వేడి చేస్తున్నప్పుడు పదే పదే విరిగిపోతుంటే అది చెడు సంకేతమని చాణక్యుడు చెప్పాడు. అలాగే తరచూ పాలు పొంగిపోతున్నా అది ఇంటికి మంచిది కాదని హెచ్చరించాడు. ఇలా తరచూ జరుగుతుంటే పెద్ద స్థాయిలో డబ్బు నష్టాన్ని ఎదుర్కోవల్సి రావొచ్చని చెప్పాడు.



Click it and Unblock the Notifications