For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాక్ డౌన్ తర్వాత సరదా కోసం ఎలాంటి పనులు చేస్తారో చూసేయ్యండి...

కరోనా వైరస్ నుండి లాక్ డౌన్ తొలగించిన తర్వాత యువత ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తారు.

|

కరోనా మహమ్మారి మార్చి నెల నుండి మే మాసం ముగిసేవరకు ప్రతి ఒక్కరినీ ముప్పుతిప్పలు పెడుతూనే ఉంది. ప్రస్తుతం మన దేశంలో లక్షన్నరకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో ఒక్క మహారాష్ట్ర నుండే దాదాపు 50 వేలకు పైగా కేసులు నమోదవ్వడం గమనార్హం. దీని తర్వాతి స్థానంలో తమిళనాడు నిలిచింది. ఆ రాష్ట్రంలో కూడా దాదాపు 20 వేల కేసులు నమోదయ్యాయి. వాటితో పోల్చుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గానే ఉందనిపిస్తోంది.

These common things which majority of people will do after lockdown relaxed

ఇదిలా ఉంటే లాక్ డౌన్ 4.0 మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. మే 31వ తేదీ లాక్ డౌన్ ముగుస్తున్న సందర్భంగా లాక్ డౌన్ 5.0ను కొనసాగిస్తారా? లేదా ఎత్తేస్తారా అనే విషయంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లాక్ డౌన్ 5.0లో కేవలం 11 రాష్ట్రాలే ఉంటాయని మన తెలుగు రాష్ట్రాల్లో ఉండకపోవచ్చలనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

These common things which majority of people will do after lockdown relaxed

అయితే లాక్ డౌన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎత్తివేస్తే సాధారణ ప్రజలు, మన యువత ఒక్కసారిగా పంజరంలో నుండి బయటపడ్డ చిలకలగా... డ్యామ్ గేట్లు తెరిచిన నీళ్లలా పారేందుకు.. రెక్కలొచ్చినా గుర్రంలాగా ఎగురుదామని తహతహలాడుతున్నారు. ఇప్పటికే మద్యం మత్తులో మాంచి కిక్కును కూడా అనుభవించారు మందుబాబులు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత రిలాక్స్ ఎలాంటి పనులు చేస్తారో చూసేద్దాం పదండి...

తల భారాన్ని తగ్గించుకుందామని కటింగ్ చేయించుకున్నారు... కరోనాను కూడా కొనితెచ్చుకున్నారు...తల భారాన్ని తగ్గించుకుందామని కటింగ్ చేయించుకున్నారు... కరోనాను కూడా కొనితెచ్చుకున్నారు...

స్నేహితులతో సిట్టింగ్..

స్నేహితులతో సిట్టింగ్..

కరోనా లాక్ డౌన్ తర్వాత చాలా మంది స్నేహితులు రిలాక్స్ కోసం అందరూ కలిసి సిట్టింగ్ కు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అందుకోసం ఇప్పటికే ఒక మంచి స్పాట్ ను సైతం రెడీ చేసుకుని ఉంటారు. మందులోకి మంచింగ్ కోసం ఆవకాయ లేదా చికెన్ వంటి వాటిని తీసుకుంటారు.

బ్యూటీపార్లర్లకు వెళ్లడం..

బ్యూటీపార్లర్లకు వెళ్లడం..

ఇక అమ్మాయిల విషయానికొస్తే.. వారు అందానికి ఎంతలా ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. వారి అందం గురంచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత చాలా మంది అమ్మాయిలు బ్యూటీపార్లర్లకు వెళ్లి తమ అందాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తారు.

లవర్స్ ను కలిసేందుకు..

లవర్స్ ను కలిసేందుకు..

లాక్ డౌన్ కారణంగా లవర్లను కలుసుకోలేదని బాధపడిన వారందరికీ జూన్ 1 తర్వాత దాదాపు పూర్తి స్వేచ్ఛ లభించే అవకాశముంది. లాక్ డౌన్ తర్వాత ప్రేమ పావురాలంతా కలిసి ఎక్కడైనా స్వేచ్ఛగా విహరించాలని కోరుకుంటారు.

దయచేసి వినండి... రైలు ఎక్కేటప్పుడు కొత్త గైడ్ లైన్స్ పై ఓ లుక్కేయండి...దయచేసి వినండి... రైలు ఎక్కేటప్పుడు కొత్త గైడ్ లైన్స్ పై ఓ లుక్కేయండి...

రిలీజ్ సినిమాకు వెళ్లేందుకు..

రిలీజ్ సినిమాకు వెళ్లేందుకు..

ఇక సినీ అభిమానులు అయితే థియేటర్లలో ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా? ఎప్పుడెప్పుడు సినిమాలకు వెళ్దామా అని ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ అభిమాన హీరోలు నటించిన సినిమాలకు అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అయిపోయిన బర్త్ డే పార్టీలు..

అయిపోయిన బర్త్ డే పార్టీలు..

కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ కాలంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేని వారు లేటుగా అయినా కొంత లేటేస్టుగా బర్త్ డే పార్టీలు చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. చేస్తున్నారు కూడా.

బిర్యానీ తినేందుకు...

బిర్యానీ తినేందుకు...

ఇక భోజన ప్రియులైతే ఎప్పుడెప్పుడు రెస్టారెంట్లకు వెళ్తామా? ఎప్పుడెప్పుడు తమకిష్టమైన బిర్యానీ లేదా ఇతర ఆహారాన్ని తిందామా అని ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. లాక్ డౌన్ తర్వాత తమకు నచ్చిన ఫుడ్ ని తినేయ్యాలని ప్లాన్ వేస్తారు.

వాత్సాయనుడి కామసూత్రాల ప్రకారం స్త్రీ భుజాలను తాకితే.. ఏం జరుగుతుందో తెలుసా...వాత్సాయనుడి కామసూత్రాల ప్రకారం స్త్రీ భుజాలను తాకితే.. ఏం జరుగుతుందో తెలుసా...

షాపింగుకు వెళ్లడం..

షాపింగుకు వెళ్లడం..

లాక్ డౌన్ తర్వాత షాపింగ్ మాల్స్ ఓపెన్ అయితే షాపింగ్ చేసేందుకు రెడీగా ఉంటారు మరికొందరు. ముఖ్యంగా వీకెండ్స్ లో మాల్స్ కు వెళ్లే అలవాటు ఉండేవారు జూన్ 1వ తేదీ సాయంత్రమే అక్కడికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఓపెన్ అవుతున్న మాల్స్ లో కచ్చితంగా కస్టమర్లను ఆకర్షించే ఆపర్లుంటాయి. వాటిని మిస్ చేసుకోకూడదని వెంటనే అక్కడికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

టిక్ టాక్ గ్యాంగ్..

టిక్ టాక్ గ్యాంగ్..

మన దేశంలో టిక్ టాక్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. దీని కారణంగా ఎంతో మంది తమ ట్యాలెంట్ ను చూపేందుకు ప్రయత్నిస్తారు. ఇక లాక్ డౌన్ తర్వాత కూడా తమ గ్యాంగ్ తో కలిసి టిక్ టాక్ చేసేందుకు రెడీ అయిపోతారు.

లాంగ్ డ్రైవ్ కు..

లాంగ్ డ్రైవ్ కు..

కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైనందున ఏదో ఒక రోజు వీలు చూసుకుని తమ సొంత వాహనాలలో లాంగ్ డ్రైవ్ కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. అది కూడా ఒంటరిగా వెళ్లేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే పక్కన తోడుగా ఎవరన్నా ఉన్నా కూడా ఇంకా బాగానే ఉంటుంది.

స్నేహితులను కలవడానికి..

స్నేహితులను కలవడానికి..

ఇక వయసులో కొంత పెద్దవారైతే లాక్ డౌన్ తర్వాత రెగ్యులర్ గా వారు కలిసే స్నేహితులను కలిసేందుకు వెళతారు. వారితో సాయంత్రం సంధ్య వేళలో సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ఇవే కాదు ఇంకా ఎన్నో రకాల ప్లాన్లు.. లక్ష్యాలు.. తాము కరోనా కాలంలో కోల్పోయిన సంతోషాన్నంత ఒక్కసారిగా పొందేందుకు ప్రయత్నిస్తారు.

English summary

These common things which majority of people will do after lockdown relaxed

Here are these common things which majority of people will do after lockdown relaxed. Take a look.
Story first published:Friday, May 29, 2020, 18:36 [IST]
Desktop Bottom Promotion