Latest Updates
-
వృశ్చికం, మేషం, సింహ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 09 జూన్ 2026 -
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.?
July 2021 Planets Transit:జులైలో నాలుగు గ్రహాల పరివర్తనం.. రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...
జులై మాసంలో ఈ నాలుగు గ్రహాలు తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి. ఈ సమయంలో మీపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. గ్రహాల కదలికలను బట్టి, రాశిచక్రాల ఆధారంగా మన జీవితాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవచ్చని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. ప్రతి నెలా గ్రహాలు తమ స్థానాల నుండి స్థాన దిశను మార్చుకుంటూ ఉంటాయి.

అయితే జులై మాసంలో ఏకంగా నాలుగు గ్రహాలు తమ స్థానం నుండి మరో స్థానానికి పరివర్తనం చెందనున్నాయి. గ్రహాలలో యువరాజుగా పరిగణించే బుధుడు ఈ నెల ప్రారంభంలోనే రవాణా చెందనున్నాడు. బుధుడు జులై 7వ తేదీన తన సొంత రాశి అయిన మిధున రాశిలోకి ప్రవేశించనున్నాడు.

జులై 25వ తేదీ వరకు ఇక్కడే ఉండి అనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. మరోవైపు గ్రహాల కుటుంబానికి అధిపతి అయిన సూర్యుడు జులై 16న కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఆ తర్వాతి రోజే జులై 17న శుక్రుడు.. సూర్యుడు.. సింహ రాశిలోకి ప్రవేశించనున్నాయి. ఈ మూడు గ్రహాలతో పాటు చివరగా రాశి పరివర్తనం వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం...

మిధునంలోకి బుధుడు..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలలో రారాజుగా పరిగణించబడే బుధుడు జులై 7వ తేదీన మిధున రాశిలోకి ఆగమనం చేయనున్నాడు. ఇక్కడే జులై 25వ తేదీ వరకు నివాసం ఉండి.. అనంతరం కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. బుధుడు తన సొంత రాశి అయిన మిధున రాశిలోకి ప్రవేశించే సమయంలో ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు మీ కెరీర్లో మంచి పురోగతి లభిస్తుంది. అయితే కర్కాటక రాశిలోకి బుధుడు ప్రవేశించే సమయంలో ద్వాదశ రాశులపై కొంత ప్రతికూల ప్రభావం పడుతుంది.

కర్కాటకంలో సూర్యుడి ఎంట్రీ..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడిని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. అలాంటి సూర్యుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరూ కావాలని ఆశిస్తారు. ముఖ్యంగా సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించే సమయంలో కొన్ని రంగాల ఉద్యోగులకు వారి కెరీర్ లో పురోగతి లభిస్తుంది. మీరు ఊహించిన ఫలితాలు రావొచ్చు. అయితే కొన్ని రాశుల వారికి ఇది చాలా కష్టమవుతుంది. మరి కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి.

సింహంలోకి శుక్రుడి ప్రవేశం..
జ్యోతిష్యశాస్త్రం శుక్రుడు వైవాహిక జీవితంలో మంచి ప్రభావాన్ని చూపుతాడు. శుక్రుని ప్రభావంతో జంటల మధ్య ప్రేమ మాధుర్యం పెరుగుతుందని చాలా మంది నమ్మకం. జులై 17వ తేదీన సూర్యుడి సొంత రాశి అయిన సింహ రాశిలోకి శుక్రుడు ఆగమనం చేయడం వల్ల ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారి జీవితంలో ఆనందం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు చాలా నిరాశ చెందాల్సి ఉంటుంది.

సింహ రాశిలోకి అంగారకుడు..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అంగారకుడిని ధైర్యం, శక్తి కారకంగా భావిస్తారు. సూర్యుని రాశి అయిన సింహ రాశిలోకి అంగారకుడు ప్రవేశం వల్ల ద్వాదశ రాశుల వారి స్వభావంలో మార్పు జరగొచ్చు. జులై 20వ తేదీన అంగారకుడు సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. అంగారకుడిని ఉగ్ర గ్రహంగా భావిస్తారు. అంగారకుడు మార్పు వల్ల సైనిక సిబ్బందికి, న్యాయవాదులు, పోలీసులకు చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications