Latest Updates
-
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా? -
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.! -
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.?
జులై మాసంలో 4 గ్రహాల పరివర్తనం.. ఈ రాశులకు శుభ ఫలితాలు...! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి.
జులై మాసంలో నాలుగు గ్రహాలు పరివర్తనం చెందనున్నాయి. ఈ క్రమంలో ఈ రాశుల అనేక ప్రయోజనాలు దక్కనున్నాయట. అందులో మీ రాశి ఉందేమో చూడండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. గ్రహాల కదలికలను బట్టి, రాశిచక్రాల ఆధారంగా మన జీవితాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవచ్చని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. ప్రతి నెలా గ్రహాలు తమ స్థానాల నుండి స్థాన దిశను మార్చుకుంటూ ఉంటాయి.

అయితే జులై మాసంలో ఏకంగా నాలుగు గ్రహాలు తమ స్థానం నుండి మరో స్థానానికి పరివర్తనం చెందనున్నాయి. గ్రహాలలో యువరాజుగా పరిగణించే బుధుడు ఈ నెల ప్రారంభంలోనే రవాణా చెందనున్నాడు. బుధుడు జులై 7వ తేదీన తన సొంత రాశి అయిన మిధున రాశిలోకి ప్రవేశించనున్నాడు. జులై 25వ తేదీ వరకు ఇక్కడే ఉండి అనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు.

మరోవైపు గ్రహాల కుటుంబానికి అధిపతి అయిన సూర్యుడు జులై 16న కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ తర్వాతి రోజే జులై 17న శుక్రుడు.. సూర్యుడు.. సింహ రాశిలోకి ప్రవేశించనున్నాయి. ఈ మూడు గ్రహాలతో పాటు చివరగా అంగారకుడు కూడా కర్కాటక రాశిలోకి పరివర్తనం వల్ల ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది.

ఈ నేపథ్యంలో కొన్నిరాశుల వారికి శుభ ఫలితాలొస్తే.. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఏ రాశి వారికి నాలుగు గ్రహాల రవాణా ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. జులై 20వ తేదీన ఈ రాశి నుండి అంగారకుడు ఐదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మేషరాశి వారి కుటుంబంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం కనుగొంటారు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. క్రీడా పోటీల్లో పాల్గొనే వారికి జులై 20వ తేదీ తర్వాత సమయం అద్భుతంగా ఉంటుంది. మరోవైపు బుధుడి రవాణా వల్ల ఈ రాశి వారికి మరికొన్ని ప్రయోజనాలు దక్కుతాయి. అంతేకాదు సమాజంలో మీ గౌరవం, మర్యాదలు పెరుగుతాయి.

మిధున రాశి..
జులై మాసంలో తొలి వారంలో బుధుడు ఈ రాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడి ప్రయాణం వల్ల మిధున రాశికి మంచి ప్రయోజనాలు వస్తాయి. ఈ సందర్భంగా కర్కాటక రాశి వారికి శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. విద్యార్థులు విద్యారంగంలో విజయం సాధిస్తారు. అదే విధంగా జులై 16వ తేదీన సూర్యుడు కూడా ఇదే రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సందర్భంగా మీకు చాలా శుభ ఫలితాలొస్తాయి. ఈ సమయంలో సూర్యుడి తీవ్రత, కోపం వల్ల కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మిధున రాశి వారు వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు.

సింహ రాశి..
ఈ రాశిలోకి శుక్రుడి రవాణా వల్ల వీరి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ మాసంలో 16వ తేదీ వరకు మీరు ఎక్కువ ఆదాయం పొందొచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మిధునరాశి స్నేహపూర్వకమైన సంకేతం వల్ల బుధుడి రవాణాతో సింహ రాశి వారికి మంచి ప్రయోజనాలు దక్కుతాయి. బుధుడి రవాణా వల్ల వ్యాపారవేత్తలకు సానుకూల ఫలితాలు వస్తాయి. అయితే జులై 20వ తేదీ నుండి మీరు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో శుక్రుడు, అంగారకుడు ఈ రాశిలో సంయోగం చేయనున్నారు. ఆ సమయంలో మీ ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది.

తుల రాశి..
ఈ రాశి వారికి నాలుగు గ్రహాల పరివర్తనం వల్ల సానుకూల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు. సూర్యుడు ఈ రాశి నుండి పదో స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. జులై 25వ తేదీన కర్కాటకంలో బుధుడు, సూర్యుడు కలయిక వల్ల మంచి యోగం ఏర్పడనుంది. దీని వల్ల మీకు సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీరు ఊహించిన ఫలితాలు వస్తాయి. విద్యార్థులు విద్యారంగంలో మంచి విజయం సాధిస్తారు.

వృశ్చికరాశి..
ఈ రాశి నుండి పదో స్థానం గుండా అంగారకుడు సింహ రాశిలోకి ఆగమనం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలొస్తాయి. ఉద్యోగులు తమ కెరీర్లో పురోగతి సాధించొచ్చు. శుక్రుడి రవాణా కారణంగా మీరు ఈ సమయంలో ఒకరితో ప్రేమ వ్యవహారంలో విజయం సాధించొచ్చు. అయితే బుధుడి రవాణా వల్ల మీ ఆరోగ్యంపై కొంత ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఈ సమయంలో శుభఫలితాలను ఎదుర్కొంటారు.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications