Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
Chanakya Niti: ఇలాంటి వ్యక్తులు ఇంట్లో కంటే అడవిలో నివసించడమే ఉత్తమం
కుటుంబం గురించి చెప్పిన చాణక్యుడు అవెంత క్లిష్టమైనవో తెలిపాడు. కొందరు వ్యక్తులు ఇంట్లో ఉండటం కంటే కూడా అడవిలో జీవించడం ఉత్తమమని చాణక్యుడు పేర్కొన్నాడు. ఆచార్యుడు అలా ఎందుకు చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్యుడి బోధనలు నేటికీ ఆచరణీయమే. ఆయన చెప్పిన సూచనలు పాటించడం ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చు. చాణక్యుడు తన నీతి గ్రంథంలో సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాడు.

కుటుంబం గురించి చెప్పిన చాణక్యుడు అవెంత క్లిష్టమైనవో తెలిపాడు. కొందరు వ్యక్తులు ఇంట్లో ఉండటం కంటే కూడా అడవిలో జీవించడం ఉత్తమమని చాణక్యుడు పేర్కొన్నాడు. ఆచార్యుడు అలా ఎందుకు చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.
సంబంధాల ప్రాముఖ్యత:
సంబంధాలు చాలా సున్నితమైనవి, సంక్లిష్టంగా కూడా ఉంటాయి. వాటిలో ఒకటే తల్లితో, భార్యతో సంబంధం. సాధారణంగా అబ్బాయిలు తల్లితో ఎక్కువ అటాచ్ మెంట్ కలిగి ఉంటారు. పెళ్లి అయ్యేంత వరకు చాలా మంది అబ్బాయిలకు తల్లి తప్ప మరో మహిళతో పెద్దగా పరిచయం ఉండదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా తల్లితో పంచుకుంటారు. పెళ్లి అయిన తర్వాత జీవితం చాలా మారిపోతుంది.
తల్లి, భార్య గౌరవాన్ని కాపాడుకునే వాడు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడని చాణక్యుడు చెప్పాడు. అదే సమయంలో పురుషులు ఇల్లు వదిలి అడవికి వెళ్లాలని చాణక్యుడు ఒక శ్లోకంలో చెప్పాడు. చాణక్యుడు స్త్రీల కోణంలో పురుషులకు ఎందుకు అలా చెప్పాడంటే..
మాతా యస్య గృహే నాస్తి భార్యా చాప్రియవాదినీ|
అరణ్యం తేన్ గత్నవ్యం యథారణ్యం తథా గృహమ్||
ఈ శ్లోకంలో చాణక్యుడు ఇంట్లో స్త్రీలు ఉండటం యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పాడు. ఇంట్లో స్త్రీ ఉండాలని చెప్పాడు చాణక్యుడు. చిన్న నాటి నుండి యవ్వనం వరకు తల్లి వ్యక్తికి మార్గదర్శత్వం వహిస్తుంది. అతనికి సరైన మార్గంలో నడవడం నేర్పిస్తుంది. తల్లి ప్రేమానురాగాలు ఆ ఇంటిని నందనవనం చేస్తాయి. తల్లి లేని ఇల్లు నిర్మానుష్యంగా మారుతుంది. అలాంటి ఇంట్లో నివసించే బదులు ప్రకృతి మాత ఒడిలో హాయిగా ఉండే అడవికి వెళ్లడమే మంచిదని చాణక్యుడు చెప్పాడు.
ఇంట్లో ఉండటం కంటే అడవికి వెళ్లడం మేలు:
ప్రతి వ్యక్తి జీవితంలో భార్య పాత్ర గురించి చాణక్యుడు ప్రత్యేకంగా చెప్పాడు. తల్లి లేకుండా మంచి ప్రవర్తన గల భార్య ఇంట్లో సుఖశాంతులను నెలకొల్పగలదని చాణక్యుడు చెప్పాడు. కానీ భార్య ప్రతి విషయంలోనూ గొడవ చేస్తుంటే, కలహాలు సృష్టిస్తుంటే ఇంట్లో ప్రశాంతత ఉండదని చాణక్యుడు పేర్కొన్నాడు.
ఒక వ్యక్తి మానసిక ప్రశాంతత, ఆనందాన్ని పొందే చోట జీవించాలని ఆచార్యుడు సూచించాడు. ఇంట్లో శాంతి, సామరస్యం ఉన్నంత వరకు మాత్రమే నివాసయోగ్యంగా ఉంటుందని చెప్పాడు. ఇంట్లో కలిసి జీవిస్తుంటే, మృగాళ్లలా పోట్లాడుకుంటూ ఉంటే అడవిలో బతకడంలో తప్పేముందని ఆచార్య చాణక్యుడు సూచించాడు.



Click it and Unblock the Notifications
