Latest Updates
-
తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం హరిది..అమృతంలా ఉంటుంది..ఇలా సింపుల్ గా చేసేయండి -
క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై..ఈ స్పెషల్ మసాలాతో చేస్తే ప్లేట్ మొత్తం క్షణాల్లో ఖాళీ! -
సర్వ పాపాలను తొలిగించే తొలి ఏకాదశి.. మీ కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్ లతో విషెస్ చెప్పండి -
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.!
మీ పర్సులో ఇవి కచ్చితంగా ఉండేలా చూసుకోండి... ఎందుకంటే ఆర్థిక సమస్యలను అధిగమించొచ్చు...!
మీకు డబ్బు సమస్యలు రాకూడదంటే మీ పర్సులో ఈ వస్తువులను ఉంచుకోవాలి.
ఈ లోకంలో ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం డబ్బులతోనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే 'ధనం మూలం ఇదం జగత్' అన్నారు.

మనం ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా జీవించాలంటే అందుకు డబ్బు అనేది చాలా ముఖ్యం. అందుకే ఈ లోకంలోని ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం డబ్బును చాలా సులభంగా సంపాదిస్తారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. మనలో చాలా మంది డబ్బులను వాలెట్, పర్సు వంటి వాటిలో ఉంచుకుంటాం. వీటిని ఖాళీగా ఉంచుకునేందుకు ఎవ్వరూ అంతగా ఇష్టపడరు. మనలో చాలా మంది వారి వారి అవసరాలకు తగ్గట్టు వాలెట్ లేదా పర్సును వాడుతూ ఉంటారు.

ఇక పర్సులో చాలా మంది డబ్బుతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇతర వస్తువులతో వాటితో కలిపి ఉంచుకుంటారు. ఇంకా కొందరైతే తమకిష్టమైన వారి ఫొటోలను లేదా దేవుడి ఫొటోలను కూడా దాచుకుంటూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం మీ పర్సులో కొన్ని వస్తువులను అస్సలు ఉంచకూడదట. మరికొన్ని వస్తువులను కచ్చితంగా ఉంచుకోవాలట. అవి ఉంటేనే మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము ఆదా అవుతుందట. లేదంటే అనవసరమైన ఖర్చులు పెరుగుతాయట. ఈ సందర్భంగా వాస్తు శాస్త్రం ప్రకారం, పర్సులో ఏయే వస్తువులను తప్పనిసరిగా పెట్టుకోవాలి.. ఏ వస్తువులను పర్సులో పెట్టుకుంటే లక్ కలిసి వస్తుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ పేపర్లను..
వాస్తు శాస్త్రం ప్రకారం, డబ్బు సమస్యలు రాకుండా ఉండేందుకు మీ పర్సులో తల్లిదండ్రులు లేదా ఇతరులు రాసిచ్చే కాగితాలను కచ్చితంగా ఉంచుకోవాలి. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ మీ క్షేమాన్నే కోరుకుంటారు. వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి. పసుపు, కుంకుమ (కొద్దిగా) కలిపిన చిన్న చీటిలను ఉంచుకోవాలి. వీటిని మీ పర్సులో ఉంచుకోవడం వల్ల మీరు ప్రమాదాల నుండి రక్షించబడతారు. అలాగే డబ్బు సమస్యలు కూడా తగ్గుతాయి.

ప్రతికూల శక్తి..
మీ పర్సులో పైసలు ఎక్కువగా ఉంటే, మీ చుట్టూ జనం ఎక్కువగా ఉంటే, అలాంటి సమయంలో మీ పాకెట్ నుండి పర్సును బయటకు తీయొద్దు. ఎందుకంటే మీ పర్సులో ఎక్కువగా డబ్బును అందరూ చూడటం వల్ల ప్రతికూల శక్తి మీ పర్సులోని ప్రవేశించే ప్రమాదం ఉంది.

కోరికలు నెరవేరేందుకు..
మీకు ఇష్టమైన వస్తువులను కొనాలన్నా.. ఏదైనా తీరని కోరిక ఉంటే.. దాన్ని ఓ తెల్లని కాగితంపై రాసి మీ పర్సులో రెడ్ కలర్ ఎన్ వలప్ లో ఉంచండి. అప్పుడే మీ కోరిక త్వరలో నెరవేరే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు పర్సు బయటకు తీసినప్పుడల్లా ఆ రెడ్ కవర్ మీకు కనిపిస్తుంది. దాన్ని చూసినప్పుడల్లా మీ కోరిక మీకు గుర్తొస్తుంది. తద్వారా దాన్ని తీర్చుకునే దిశగా మీ ప్రయత్నాలు సాగుతాయి.

శ్రీ యంత్రం..
వాస్తు శాస్త్రం ప్రకారం, మీ వద్ద డబ్బు పెరగాలంటే.. మీ పర్సులో శ్రీ యంత్రాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి. దీన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇది డబ్బును కచ్చితంగా ఆకర్షిస్తుంది. దీంతో మీకు శ్రేయస్సు మరియు అదృష్టం పెరుగుతుంది. అయితే చిరిగిన నోట్లను లేదా మురికి పేపర్లను ఎల్లప్పుడూ పర్సులో ఉంచుకోవద్దు. ముఖ్యంగా మీ పర్సును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అది లక్ష్మీదేవి నివాసంగా పరిగణించబడుతుంది.



Click it and Unblock the Notifications