Latest Updates
-
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!
ఎప్పటికీ విడిపోని రాశిచక్రాలివే... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!
ఈ రాశి చక్రాల వారు ఎప్పటికీ విడిపోరట. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి.
ఈ లోకంలో మనలో ప్రతి ఒక్కరికీ ఎవరో ఒకరికి మనకు తెలియకుండానే ఏదో ఒక పరిచయం అనేది ఏర్పడుతుంది. అయితే అందులో మనం కొందరితోనే కలుస్తాం.. మరికొందరితో పరిచయం పెంచుకుంటారు.

అయితే ఒక్క వ్యక్తితో మాత్రం జీవితాంతం కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తాం. అందుకే ప్రేమ, పెళ్లిళ్ల వంటి బంధాలను అన్వేషిస్తుంటాం. ఇలా ఒక్కటైన సంబంధంలో, స్త్రీ మరియు పురుషులు ఇద్దరూ జీవితాంతం కలిసి సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. సాధారణంగా ప్రేమ పెళ్లి అయినా.. పెద్దలు కుదిర్చిన పెళ్లయినా ఎవరైనా సరే తాము బంధం బలంగా ఉండాలని.. శాశ్వతంగా సాఫీగా సాగిపోవాలని ఆశిస్తుంటారు.

అయితే అన్ని బంధాలు శాశ్వతంగా ఉండవు. అందుకే జీవితాంతం కలిసి ఉండలేరు. ఎందుకంటే మనలో చాలా మంది అభిప్రాయాలు, ఆలోచనలు, ఆశయాలు, అలవాట్లు అన్నీ ఒకే రకంగా ఉండవు. దీంతో రిలేషన్ షిప్ లో కొన్ని సమస్యల వస్తుంటాయి.

ఇలాంటి కారణాల వల్లే చాలా మంది జంటలు తమ బంధానికి మధ్యలోనే వీడ్కోలు చెబుతుంటారు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారు ఎప్పటికీ విడిపోరట. వీరు జీవితాంతం హాయిగా కలిసి జర్నీ చేస్తారట. ఇంతకీ ఆ రాశులేవి.. ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

కన్య రాశి - వృషభ రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రెండు రాశుల వారు ఎప్పటికీ ఉత్తమ జంటగా ఉండిపోతారట. ఎందుకంటే ఈ రాశుల జంటలు ఎల్లప్పుడూ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ముందుగా తమ అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటారు. ఇద్దరిలో ఏ ఒక్కరికీ ఇష్టం లేకుండా ఆ డెసిషన్ తీసుకోకుండా వాయిదా వేస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైనా కూడా ఇద్దరు కలిసికట్టుగా వాటిని ఎదుర్కొంటారు. అందుకే వీరి రిలేషన్ షిప్ చాలా కాలం బలంగా ఉంటుంది. వీరి దాంపత్య జీవితం కలకాలం సాఫీగా సాగిపోతుంది.

కర్కాటక రాశి-మీన రాశి..
ఈ రెండు రాశుల వారు కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వీరిద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడతారు. వీరు ప్రతి సందర్భంలోనూ జంటగానే ఉండాలని కోరుకుంటారు. వీరు ఒకరిని మించి మరొకరు ప్రేమించుకుంటారు. అంతేకాదు వీరు తమకిష్టమైన వారి కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అందుకే వీరి రిలేషన్ చాలా కాలంగా హాయిగా, ఆనందంగా ఉంటుంది. ఈ రాశుల ఆలుమగలు అనునిత్యం సంతోషంగా గడిపేందుకు ప్రయత్నిస్తారు.

మేష రాశి - మీన రాశి..
ఈ రాశుల వారి లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి. వీరిలో మేష రాశి కొంచెం స్టిట్ గా ఉంటారు. అయితే అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. కానీ మీన రాశి వారు మాత్రం మేష రాశి వారికి పూర్తి భిన్నంగా ఉంటారు. మీన రాశి వారు చాలా సింపుల్ గా ఉంటారు. అయితే సైన్స్ లో చెప్పినట్టు భిన్నధ్రువాలు ఎలా అయితే బాగా ఆకర్షించుకుంటాయో.. అలాగే మేషరాశి-మీనరాశి జంటలు బాగా కలిసిపోతారు. వీరు ఏ సమయంలో అయినా ఒకరికొకరు మద్దతుగా ఉంటారు. అందుకే వీరు అద్భుతమైన జంటగా మిగిలిపోతుంటారు.

మిధున రాశి - ధనస్సు రాశి..
ఈ రాశుల వారు ఇతరులు చెప్పిన మాటను అస్సలు వినరు. వీరు ఎక్కువగా తమకు ఇష్టమొచ్చినట్టు ఉంటారు. వీరికి రిస్క్ తీసుకోవడం చాలా ఇష్టం. ఈ రాశుల జంటలు డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటారు. వీరు ప్రతిరోజూ కొంచెం కొత్తగా ఉండాలని కోరుకుంటారు. అందుకే వీరి జీవితంలో బోర్ అనే ఫీలింగ్ ఎప్పటికీ రాదు. వీరిద్దరూ చాలా మంది స్ఫూర్తిగా నిలుస్తారు.

సింహ రాశి - తుల రాశి..
ఈ రాశి వారిలో సింహ రాశి వారు నలుగురిలో కలిసిపోయేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే. ఈ రాశి వారు అందరి కంటే ఒక అడుగు ముందుండాలని కోరుకుంటారు. అదే సమయంలో తుల రాశి వారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందుకే ఈ రాశుల జంట చాలా ఉత్తమంగా ఉంటుంది. వీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు.



Click it and Unblock the Notifications
