Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ఈ రాశుల వారు వృత్తిని,వ్యక్తిగత జీవితాన్ని పర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయగలరు..
కొంత మంది వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో చక్కని పనితీరు కనబరుస్తారు. ఈ రాశుల వారిలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
కొంతమంది వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని ఏమాత్రం బ్యాలెన్స్ చేసుకోలేరు. కరోనా సమయంలో అందరికీ వర్క్ ఫ్రం హోం ద్వారా చాలా మంది వ్యక్తిగత జీవితంలో వృత్తినిలో భాగం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీని వల్ల కుటుంబసభ్యులకు సమయం కేటాయించలేక, వృత్తిపరంగా అభివృద్ధి చెందలేక ఇబ్బందులు ఎదురయ్యాయి. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని కలపకుండా వేర్వేరుగా చూడటం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశం. మీరు చేస్తున్న పని వల్ల మీ వ్యక్తిగత జీవితానికి నష్టం కలగకూడదు అనుకున్నా.. కుటుంబసభ్యులపై ప్రభావం పడకుండా చూడాలనుకున్నా కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.

కొంత మంది వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో చక్కని పనితీరు కనబరుస్తారు. ఈ రాశుల వారిలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

వృషభం
వృషభ రాశి వారు వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో మంచి నైపుణ్యం కనబరుస్తారు. వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, వారు ఎప్పుడూ తమ ప్రియమైన వారి కోసం సమయాన్ని వెచ్చిస్తారు. వారికి ప్రత్యేకమైన, ప్రియమైన అనుభూతిని కలిగించడం వారు ఎప్పటికీ మర్చిపోరు.
వృషభరాశి వారు తమ భాగస్వామిని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టరు. వారికి తమ అవసరం ఉన్న ప్రతిసారీ వారు పక్కనే ఉంటారు.

కర్కాటకం
కర్కాటక రాశి వారికి కెరీర్‌పై ఎక్కువ దృష్టి పెడుతుంటారు. వృత్తిలో పైకి ఎదగాలని బలంగా కోరుకుంటారు. కానీ వ్యక్తిగత జీవితాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు. పర్సనల్ లైఫ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి పరంగా ఎంతగా ఎదగాలని కోరుకున్నప్పటికీ, ప్రేమను మాత్రం విడిచిపెట్టరు.

తులారాశి
తులారాశి వారు వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో మంచి నైపుణ్యాన్ని చూపిస్తారు. కెరీర్‌ను, కావాల్సిన వారిని చక్కగా కాపాడుకుంటారు. ఒకవైపు కెరీర్‌ను నిర్మించుకుంటూనే మరోవైపు కుటుంబసభ్యులకు సమయాన్ని వెచ్చిస్తారు.
కుటుంబం మధ్య మంచి బంధాన్ని ఏర్పరచుకోవడంలో తులారాశి వారు సిద్ధహస్తులు.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు స్వేచ్ఛగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే వారి ఇష్టాలు తమ వ్యక్తిగత జీవితాన్ని దాంతో పాటు వృత్తి ప్రభావితం కాకుండా జాగ్రత్త పడతారు.
ధనుస్సు రాశి వారు తమ కెరీర్‌కు కట్టుబడి ఉంటారు. కుటుంబానికి, కుటుంబసభ్యులకు, కుటుంబంలోని బంధానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. రెండు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.

మీనరాశి
వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఏం కావాలనుకున్నా వారు సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వృత్తిపరంగా కొత్త బాధ్యతలు నిర్వర్తించడానికి, ఎక్కువ పని చేయడానికి ఎప్పుడూ వెనకాడరు.
అలాగే కుటుంబసభ్యులకూ ప్రాధాన్యత ఇస్తూ వారికి కావాల్సినవి సమకూరుస్తారు. తాము ఉంటే బాగుండు అని కుటుంబసభ్యులు అనుకునే ప్రతి సందర్భంలోనూ మీనరాశి వారు సమయాన్నికేటాయిస్తారు. ఏ సమయంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో మీనరాశి వారికి చాలా బాగా తెలిసి ఉంటుంది.
మేషం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయడంలో కొంత కష్టపడతారు. కుటుంబానికి సరైన సమయం కేటాయించలేక నిత్యం సతమతం అవుతుంటారు. వీరికి కేరీర్‌పై, కుటుంబ బంధాలపై ఇష్టం ఉన్నా.. వాటిని సరిగ్గా నిర్వహించలేరు.
టైం మేనేజ్‌మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, బర్నవుట్ ప్రివెన్షన్ అనేవి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు. వీటి ద్వారా పనిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎప్పుడు దేనికి సమయం కేటాయించాలో తెలుసుకునే నైపుణ్యాలు క్రమంగా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అటు వృత్తి, ఇటు ఫ్యామిలీ రెండూ ఎంతో ముఖ్యమైనవి. వాటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడమే జీవితం.



Click it and Unblock the Notifications
