Just In
- 3 hrs ago
ఉపవాసం ఉండే వారు పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే కోరికలు నెరవేరట...!
- 5 hrs ago
ఆల్కహాల్ వల్ల బ్లడ్ షుగర్ లో వచ్చే మార్పును ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుసా? ఇక్కడ తెలుసుకోండి!
- 5 hrs ago
Carbide Free Mangoes:మామిడిలో కార్బైడ్ కలిసిందా లేదా అనేది ఇలా కనిపెట్టండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి...
- 6 hrs ago
మీ భర్తలోని 'ఈ' లక్షణాల వల్ల మీరు సమస్యల్లో చిక్కుకోవచ్చు...!
Don't Miss
- News
ఉగ్రవాదం, సీమాంతర ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్: బ్రిక్స్ సమావేశంలో జైశంకర్ స్పష్టం
- Sports
Quinton De Kock : బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నా అందుకే సెంచరీ పూర్తయ్యాక అలా సెలబ్రేట్ చేసుకున్నా
- Movies
RC15 : రామ్ చరణ్ మరో న్యూ లుక్ వైరల్.. శంకర్ ప్లాన్ మామూలుగా లేదు!
- Technology
ఈ కోడ్ల సాయంతో మీ మొబైల్‌ను ఎవరు ట్రాక్ చేస్తున్నారో కనుగొనవచ్చు
- Automobiles
హ్యుందాయ్ వెన్యూలో చాలా వేరియంట్స్ డిస్కంటిన్యూ.. కొత్త మోడల్ లాంచ్ కోసమేనా..?
- Finance
ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి, ఎల్ఐసీ స్టాక్ మరింత డౌన్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గ్రహాల మార్పుతో ఈ రాశుల వారు చాలా అదృష్టవంతులవుతారు... మీ రాశి ఉందేమో చూడండి...
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సెప్టెంబర్ నెలలో ఏడు గ్రహాలు తమ స్థానాల నుండి ఇతర స్థానాల్లోకి ప్రవేశించనున్నాయి. అంటే అవన్నీ ఈ నెలలోనే మారనున్నాయి. ఈ సమయంలో ఆ గ్రహాల ప్రభావం అన్ని రాశుల వారిపై కచ్చితంగా పడుతుంది.
అయితే ఈ గ్రహాల కదలిక వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ప్రభావం ఉండగా.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఉండనున్నాయి. ఈ సందర్భంగా ఏయే రోజుల్లో ఏయే గ్రహాలు కదలనున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రహాలు కూడా తమ స్థానాల నుండి మారిపోయాయి.
మరికొన్ని గ్రహాలు అతి త్వరలో మారేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెలలో గురుడు, సూర్యుడు, రాహువు, కేతువు, శుక్రుడు, బుధుడు, అంగారకుడు తమ స్థానాన్ని మార్చుకోబోతున్నాయి. సెప్టెంబర్ 1న చంద్రుడు కర్కాటకంలోకి, 2న బుధుడు కన్య రాశిలోకి ఇప్పటికే ప్రవేశించారు.
అదే విధంగా సెప్టెంబర్ 10వ తేదీన అంగారకుడు తన సొంత రాశి అయిన మేషరాశిలోకి, సెప్టెంబర్ 13వ తేదీన గ్రహాలకు అధిపతి అయిన గురుడు సెప్టెంబర్ 13వ తేదీ నుండి తన సొంత రాశి అయిన ధనస్సు రాశిలో ప్రవేశించనున్నాడు.
సెప్టెంబర్ 16న సూర్యుడు కన్యరాశిలోకి, సెప్టెంబర్ 23వ తేదీన శుక్రుడు వృషభంలోకి, అదే రోజు కేతువు కూడా ధనస్సు వృశ్చికరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి చాలా అదృష్టం కలిసి వస్తుందట... అందులో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసేయ్యండి...
ఈ
రాశుల
వారు
సహజీవనాన్ని
ఎక్కువగా
కోరుకుంటారట...!
మీ
రాశి
ఉందేమో
చూడండి...

మేష రాశి..
ద్వాదశ రాశిచక్రాలలో మొదటి రాశిచక్రం అయిన మేష రాశి వారికి సెప్టెంబర్ నెలలో గ్రహాల మార్పు వల్ల సానుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మంచి పురోగతిని సాధిస్తారు. అలాగే మీరు కొన్ని కొత్త అవకాశాలను కూడా పొందుతారు. కొత్తవ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వీరి ద్వారా మీకు మంచి ప్రయోజనాలు వస్తాయి. మీ పనులలో వేగం పెరుగుతుంది. మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావడంతో పాటు మీ ఆదాయం కూడా బాగా పెరుగుతుంది.

మిధున రాశి..
ఈ నెలలో గ్రహాల కదలిక వల్ల మిధున రాశి వారికి ఆందోళన, ఒత్తిడి వంటివి బాగా తగ్గుతాయి. మీకు గ్రహాల కదలిక సమయంలో అంతా మంచిగానే ఉంటుంది. ఈ ప్రభావంతో మీరు జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకుంటారు. పెండింగులో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేస్తారు. మీరు ఇప్పటివరకు ఏదైనా ఆందోళన బాధపడుతుంటే, ఈ సమయంలో అది పూర్తిగా తగ్గుతుంది. గ్రహాల కదలికల వల్ల మీ కుటుంబ జీవితంలో మెరుగుదల కనిపిస్తుంది. మొత్తానికి అంతా సానుకూలంగా ఉంటుంది.

సింహ రాశి..
ఈ రాశి వారికి గ్రహాల కదలిక వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం బాగా పెరుగుతుంది. అంతేకాదు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. అయితే మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. లేకపోతే మీ పనులపై ఆ ప్రభావం చాలా తీవ్రంగా పడుతుంది. మరోవైపు మీ స్నేహితుల నుండి మీరు ఎంతగానో ప్రయోజనం పొందుతారు. మీ పురోగతికి మార్గం సులభమవుతుంది. మీ కుటుంబం మీకు అన్ని విషయాల్లో మద్దతు ఇస్తుంది.
ఈ
5
రాశులవారు
ఆహారాన్ని
చాలా
ఇష్టపడతారు
-
కడుపు
నిండా
తింటారు!

కన్య రాశి..
గ్రహాల కదలిక వల్ల ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో అదృష్టం కచ్చితంగా కలిసి వస్తుంది. అంతేకాదు మీరు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. మీరు గ్రహాల శుభ ప్రభావం వల్ల ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు. అంతేకాదు ఉద్యోగాల్లో పదోన్నతులు కూడా ఉంటాయి. మీకు సమాజంలో పేరు ప్రతిష్టతలతో పాటు మీకు గౌరవం కూడా పెరుగుతుంది. మీరు కుటుంబ జీవితం ఎంతో ఆహ్లాదకరంగా గడుపుతారు. మీకు శుభకరమైన పనులకు డబ్బు ఖర్చు చేసేందుకు ప్రయోజనాలు లభిస్తాయి.

మీన రాశి..
ఈ రాశి వారు సెప్టెంబర్ నెలలో గ్రహాల కదలిక వల్ల కొత్త ఆదాయ మార్గాలను ఏర్పరచుకుంటారు. అంతేకాదు మీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. మీరు కోరుకున్న కోరికలన్నీ కచ్చితంగా నెరవేరుతాయి. అయితే మీరు ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మిమ్మల్ని ఎవరైనా మోసం చేయొచ్చు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు రావచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో మీకు మనశ్శాంతి ఉండదు.