Just In
- 1 hr ago
మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ రక్తంలో చక్కెర స్థాయి ఎందుకు పెరుగుతుందో మీకు తెలుసా? ఇది ప్రమాదకరమా?
- 5 hrs ago
Today Rasi Phalalu :ఓ రాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపార నిర్ణయాల్లో తొందరపడొద్దు..
- 15 hrs ago
మీ కొలెస్ట్రాల్ స్థాయిని మరియు PPని తగ్గించడానికి ఈ 3 పదార్థాల మిశ్రమాన్ని తాగడం సరిపోతుంది!
- 17 hrs ago
రాత్రి పడుకునే ముందు పాలలో చెంచా నెయ్యి కలుపుకుని తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Don't Miss
- Sports
IPL 2022: ఆ గవాస్కర్ గాడిని తన్ని తరిమేయండి.. వాడు వాని వెకిలి కామెంట్రీ! ఫ్యాన్స్ ఫైర్!
- News
వైఎస్ వివేకా హత్యకేసు దాదాపుగా మూసేసినట్లే??
- Finance
ఇన్ని రోజులుగా.. పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పుల్లేకుండా: ఇంధన రేట్లివీ
- Automobiles
ఎస్‌యూవీలన్నింటికీ 'బిగ్ డాడీ' మహీంద్రా స్కార్పియో-ఎన్ Scorpio-N.. జూన్ 27న విడుదల..!
- Movies
మరోసారి హాట్ వీడియో వదిలిన విష్ణుప్రియ: టాప్‌ను పైకి లేపేసి అందాల జాతర
- Technology
స్పామ్ కాల్లతో విసిగిపోయారా? అయితే ఇలా బ్లాక్ చేయండి...
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జనవరిలో ఈ 4 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట... ఇక్కడ మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
ప్రజలందరూ తమలో ఉన్న అనంతమైన శక్తిని సంపూర్ణంగా వినియోగించుకోవడం ద్వారా తమ పనులను ముందుకు తీసుకెళ్తున్నారనేందుకు నూతన సంవత్సరం సాక్ష్యంగా నిలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే మనమంతా 2022లోకి అడుగుపెట్టేశాం. ఈ ఏడాదిలోని తొలి నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల గమనం వల్ల మనుషుల జీవితాలు ప్రభావితం అవుతాయని చాలా మంది నమ్ముతారు.
ఈ సందర్భంగా 2022 జనవరి మాసంలో సూర్య భగవానుడి విశేష అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ద్వాదశ రాశులలోని నాలుగు రాశుల వారికి అత్యంత సంతోషకరంగా మరియు అదృష్ట మాసంగా మారనుందట. ఇంతకీ ఆ రాశుల్లో మీ రాశి ఉందా లేదా ఇప్పుడే చూసెయ్యండి...
2022లో
తొలి
వారంలో
శుక్రుడు
ధనస్సులోకి
అస్తమించనున్నాడు...
ఈ
ప్రభావం
12
రాశులపై
ఎలా
ఉంటుందంటే...!

జనవరిలో గ్రహ మార్పులు
జనవరి 14, 2022న, సూర్యభగవానుడు ధనుస్సు నుండి మకరరాశికి మధ్యాహ్నం 2.43 గంటలకు సంచరిస్తాడు. ఇదే రాశిలో ఫిబ్రవరి 13, 2022 ఉదయం 3.41 వరకు ఉంటాడు. జనవరి 14వ తేదీ సాయంత్రం 5.10 గంటలకు బుధుడు మకరరాశిలో తిరోగమనంలో ప్రయాణిస్తాడు. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం నాడు కుంభరాశిలోకి వెళ్తాడు. కుజుడు జనవరి 16, 2022 సాయంత్రం 04.50 గంటలకు ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఫిబ్రవరి 26, 2022 సాయంత్రం 04.08 గంటల వరకు ఇదే రాశిలో ఉంటాడు. ఐశ్వర్యం, ఐశ్వర్యం, సకల సౌఖ్యాలు కలిగించే శుక్రుడు నేరుగా జనవరి 29, 2022 మధ్యాహ్నం 2.14 గంటలకు ధనుస్సు రాశిలో సంచరిస్తాడు.

మేషరాశి
ఈ రాశి వారు 2022 ఏడాదిలోని తొలి నెలలో అనంతమైన శక్తిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మాసంలో మీకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారులు ఈ కాలంలో తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. మీరు వ్యాపారంలో ఎంత లాభం వస్తే.. అంత ఎక్కువ ఆదాయాన్ని మిగులుస్తారు. అంతేకాదు ఈ నెలలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే, మీరు మంచి లాభాలను పొందుతారు. ఈ నెలలో మీరు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. మరోవైపు మీకు పనిభారం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి 2022 ఏడాదిలోని జనవరి నెలలో ఆర్థిక పరంగా మీ పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ విశ్వాసాన్ని పెంచుకోండి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ మాసం అత్యంత అనుకూలమైన కాలం. మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు స్నేహితులతో చాలా ఎక్కువ సమయం గడుపుతారు. విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరు ఉన్నత విద్య గురించి అనేక అవకాశాలను పొందుతారు. ఈ సమయంలో మీరు అనేక విధాలుగా లాభాలను పొందుతారు.

వృశ్చికరాశి
2022 సంవత్సరంలోని తొలి నెల అయిన జనవరి నెలలో ఈ రాశి వారు చాలా ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలో పురోగతికి బాటలు వేస్తారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ కారణంగా మీకు ఆర్థిక సమస్యలు అనేవే ఉండవు. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడిపే అవకాశాలు ఉంటాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మతపరమైన విషయాలకు సంబంధించి మంచి ప్రయోజనాలను పొందుతారు.

మీన రాశి
2022 సంవత్సరంలో జనవరి నెలలో ఈ రాశి వారి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఈ నెలలో ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. దీంతో మీకు మనశ్శాంతి దక్కుతుంది. మీకు మిత్రుల సహకారంతో ఆదాయం పెరుగుతుంది. ఈ మాసంలో మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల గమనం వల్ల మనుషుల జీవితాలు ప్రభావితం అవుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా 2022 జనవరి మాసంలో సూర్య భగవానుడి విశేష అనుగ్రహంతో మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశుల వారికి అనుకూలంగా ఉంటాయి.