Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఈ రాశుల వారు వివాహేతర సంబంధం పెట్టుకునే అవకాశాలు ఎక్కువ, వాళ్లెవరంటే..
కొందరు వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని మోసం చేయడాన్ని చాలా లైట్ తీసుకుంటారు. అదేదో కామన్‌గా జరిగేదన్నట్లు బిహేవ్ చేస్తుంటారు. ఏ రాశులవారు వివాహేతర సంబంధం పెట్టుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకరు వివాహేతర సంబంధం పెట్టుకున్నారంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఇంట్లో భార్యతో గొడవ, సాన్నిహిత్యం తగ్గిపోవడం, ప్రశాంతత లేకపోవడం, కొత్త కోరికలు ఇలాంటివి చాలా ఉంటాయి. ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ వివాహ బంధంలో ఉన్న వ్యక్తులు మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం అంటే జీవిత భాగస్వామిని మోసం చేయడమే.

కొందరు వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని మోసం చేయడాన్ని చాలా లైట్ తీసుకుంటారు. అదేదో కామన్‌గా జరిగేదన్నట్లు బిహేవ్ చేస్తుంటారు. ఏ రాశులవారు వివాహేతర సంబంధం పెట్టుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

మీనరాశి:
మీనరాశి వారు మంచి ప్రేమికులుగా ఉంటారు. వారు మితిమీరిన భావోద్వేగాలతో మూడీగా ఉంటారు. వారు వారి భావోద్వేగాలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. మీనరాశి వారు మోసం చేసే అవకాశాలు ఎక్కువ. సంబంధంలో ఉన్న భాగస్వాములు మోసం చేయడాన్ని గిల్టీగా భావించరు.

మిథునరాశి:
మిథునరాశి వారు మోసం చేయడంలో రెండో ప్లేసులో ఉంటారు. ఒక సంబంధంలో ఎక్కువ కాలం కొనసాగడం వీరి వల్ల కాదు. వివాహం బంధంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామిని మోసం చేస్తుంటారు. మిథునరాశి వారితో సంబంధంలో ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే.

తులారాశి:
తులారాశి వారు రొమాంటిక్ ఫెల్లోస్. ఒక సంబంధంలో ఎక్కువ రోజులు ఉండలేరు. కొత్త బంధాల కోసం వెతుకుతూ ఉంటారు. సరసాలాడటంలో తులారాశి వారు నేర్పరులు. అందుకే వివాహం బంధంలో ఉన్నా ఇతర వ్యక్తులతో సాధారణంగానే సంబంధాన్ని కొనసాగిస్తుంటారు.

మేషరాశి:
మేషరాశి వారు ఏదైనా కోరుకుంటే దానిని చేసే వరకు వదిలి పెట్టరు. అనుకున్నది కావడానికి ఎలాంటి పనినైనా చేయడానికి తెగిస్తారు. మేషరాశి వారు ఇన్‌బిల్ట్ రొమాంటిక్‌గా ఉండటం అలవాటుగా ఉంటుంది.

సింహరాశి:
నలుగురిలో ప్రత్యేకంగా కనబడటానికి, ప్రత్యేకంగా ఉండటానికి సింహ రాశి వారు ఇష్టపడతారు. ఈ ప్రత్యేకతే వారిని ఇతర సంబంధాల వైపు నడిపిస్తుంది. సింహరాశి వారిలో ఆత్మవిశ్వాసం, మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారు ఇతరుల దృష్టిని తమవైపు తిప్పుకోగలరు.



Click it and Unblock the Notifications
