For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశుల వారు తమ పార్ట్ నర్ ను మోసం చేస్తారట... ఎందుకో తెలుసా...

|

భార్యభర్తలైనా.. ప్రేమికులైనా.. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం బలపడాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ముందుగా ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవాలి. లేదంటే వారి సంబంధంలో సమస్యలు రావడం అనేది చాలా కామన్.

కేవలం నమ్మకం అనే ఒకే ఒక్క కారణంతో ఏర్పడే బంధాలు కొన్ని బలపడటం కంటే బలహీనంగా మారిపోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని పరిస్థితులు.. కోరికలు అనేవి మనల్ని తప్పు దారిలోకి నెట్టి వేస్తాయి.

మనం అలా చేయకూడదని తెలిసినా.. మన మనసు మాత్రం ఆ తప్పు చేయమనే చెబుతూ ఉంటుంది. అయితే ఆ క్షణికావేశంలో తొందరపడితే ఇబ్బందులు తప్పవు. అదే మీ బంధం గురించి అర్థం చేసుకుని ముందుకు సాగితే.. మీ బంధం మరింత బలంగా మారుతుంది.

అంతేకాదు మీకు పక్కచూపులు చూసే అవకాశం అనేది అస్సలు రాదు. దీని కోసం భాగస్వామిని బాగా అర్థం చేసుకుని.. వారితో కాస్త ప్రేమగా ఉంటే చాలు.. వారి మదిలో అలాంటి ఆలోచనలే రావు. అయితే ఇదంతా వారి రాశుల మీద ఆధారపడి ఉంటుందట. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏయే రాశుల వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఎందుకని వీరు పార్ట్ నర్ ను మోసం చేయాలనుకుంటారు.. వీరితో ఎలా నడుచుకోవాలో అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

నవంబరులో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీ లైఫ్ కి సరికొత్త బాటలు వేసుకోండి...!నవంబరులో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీ లైఫ్ కి సరికొత్త బాటలు వేసుకోండి...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు అంగారకుడి పాలనలో ఉండటం వలన వీరు కలయిక విషయాల పట్ల దూకుడుగా ఉంటారు. వీరు సాహసాలను బాగా ఇష్టపడతారు. వీరు చేసే ప్రతి పనిలోనూ థ్రిల్లింగ్ గా ఉండాలనుకుంటారు. కొన్నిసార్లు వీరు తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటారు. ఈ రాశి వారిలో కొందరు తమ పార్ట్ నర్ పై అనాసక్తి చూపుతారు. వీరు లాంగ్ రిలేషన్ షిప్ వంటి వాటిని అస్సలు ఇష్టపడరుట.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశుల వారు తమ పార్ట్ నర్ కు తెలియకుండా రహస్య జీవితాన్ని గడుపుతుంటారు. వీరు తమ లైఫ్ లో ఎక్కువగా ఫ్రీడమ్ ను కోరుకుంటారు. తమకు తగ్గ జోడీ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. వీరికి సరైన వారు అనిపిస్తే వారితో ఎక్కువగా రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తారు. అదే సమయంలోవీరు చాలా తెలివిగా, సీక్రెట్ గా వ్యవహరిస్తారు. వీరి రహస్యాలు అంత ఈజీగా బయటపడవు.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారితో మాట్లాడటం అంత ఈజీ కాదు. ఎందుకంటే వీరు చాలా తెలివిగా మాట్లాడతారు. వీరు రిలేషన్ షిప్ లో చాలా బ్యాలెన్స్ గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంది. వీరు చాలా తొందరపాటు నిర్ణయాల వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు ఎవరితో అయినా రిలేషన్ కొనసాగిస్తే.. దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే వీరు ఏ విషయంలో అయినా ఆచితూచి అడుగులేస్తారు. అందుకే వీరిని అంచనా వేయడం అంత సులభం కాదు. వీరు తమ పార్ట్ నర్స్ ను మోసం చేయడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతుంది.

నవంబరులో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా...!నవంబరులో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా...!

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు తమ అభిరుచులకు, అభిప్రాయాలకు పూర్తి వ్యతిరేకంగా ఉండే వ్యక్తులతో బంధాన్ని ఏర్పరచుకోడానికి చూస్తారు. అయితే అది అంత సులభం కాదు. వీరు ఎంత ఆలస్యమైనా మంచి సంబంధాల కోసం ప్రయత్నిస్తారు. వీరితో రిలేషన్ కావాలంటే చాలా సౌమ్యంగా ఉండాలి లేదా వారి సింపతిని పొందాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు వేరేవారిని అట్రాక్ట్ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. వీరికి తమ పార్ట్ నర్ తో తగిన ఐడెంటిటీ లేదా ప్రేమ లేదని తెలిస్తే వీరు చాలా నిరాశ చెందుతారు. ఎవరైతే వీరికి అలాంటివి ఇస్తారో వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కాబట్టి.. ఈ రాశి వారితో ప్రేమగా వ్యవహరించడం ఎంతో ముఖ్యమని గ్రహించాలి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరిని ఎవరైనా ఇబ్బంది పెడితే.. వెంటనే వారితో రిలేషన్ షిప్ కు గుడ్ బై చెప్పేస్తారు. వీరు చాలాసార్లు తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటారు. అంతేకాదు వీరు తమ పార్ట్ నర్ పై ఉండే కోపంతో కూడా మోసం చేస్తుంటారు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు గాలి ఎటు అనుకూలంగా ఉంటే.. అటు వైపు మళ్లుతూ ఉంటారు. వీరికి ఎక్కడైతే మంచిగా ఉంటుందనిపిస్తుందో.. అప్పుడు ప్రస్తుత రిలేషన్ ను కట్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. ఇలా జరగకుండా ఉండాలంటే, తమ పార్ట్ నర్ ఎప్పటికప్పుడు వీరికి తగిన ఐడెంటిటీ, ప్రేమను చూపించాలి. వారికి సరైన విలువ ఇస్తూ.. విశ్వాసంగా ఉండాలి. లేకపోతే వీరు పక్కచూపులు చూడటం ఖాయం.

English summary

These Zodiac Signs Are Most Likely To Cheat On Their Partners & Why

Here are these zodiac signs are most likely to cheat on their partners & why. Take a look