Latest Updates
-
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే..
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
జ్యోతిష్యం ప్రకారం ఏయే రాశుల వారు ప్రేమలో విఫలం అవుతుంటారు, వారికి ప్రేమకు ఎందుకు కుదరదు, ప్రేమలో సంబంధంలో ఎవరు సవాళ్లను ఎదుర్కొంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరూ ప్రేమను కోరుకుంటారు. జీవితంలో ప్రేమించే వ్యక్తులు ఉండాలని ఎవరికైనా ఉంటుంది. అయితే కొంతమందిని దురదృష్టం వెంటాడుతుంది. ఎప్పుడూ భగ్న ప్రేమికులుగానే మిగిలిపోతుంటారు. కొన్ని రాశుల వారు ఇలా ప్రేమ పడగానే, అలా విడిపోతుంటారు. కొన్ని రాశుల వారిని ప్రేమ దురదృష్టం వెంటాడుతుందని, దీర్ఘకాలక సంబంధాలను కనుక్కోవడంలో ఎంతో కష్టపడతారని శాస్త్రం చెబుతోంది.

జ్యోతిష్యం ప్రకారం ఏయే రాశుల వారు ప్రేమలో విఫలం అవుతుంటారు, వారికి ప్రేమకు ఎందుకు కుదరదు, ప్రేమలో సంబంధంలో ఎవరు సవాళ్లను ఎదుర్కొంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభం:
కుంభ రాశి వ్యక్తులు వారి స్వాతంత్రం మరియు వ్యక్తిత్వానికి ప్రసిద్ధి చెందారు. ఇది కొన్నిసార్లు ఇతరులతో మానసికంగా కనెక్ట్ కావడం కష్టతరం చేస్తుంది. వారు సంబంధాల్లో రాజీ పడటానికి మరియు భాగస్వామిని స్వీకరించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇది ప్రేమను కనుక్కోవడంలో, అలాగే మెయింటైన్ చేయడంలో ఇబ్బందులకు దారితీస్తుంది.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారు తీవ్రమైన మరియు ఉద్వేగభరితమైన స్వభావానికి ప్రసిద్ధి. ఇది సంబంధాలలో ఆశీరవాదం, శాపం రెండూ కావొచ్చు. వారు ఇతరులను విశ్వసించడానికి కష్టపడతారు. మితిమీరిన స్వాధీనపరులుగా మారతారు. ఇది అర్ధవంతమైన కనెక్షన్లను ఏర్పరుస్తుంది. ప్రేమను నిర్వహించడంలో ఇబ్బందులకు దారి తీస్తుంది.

మిథునం:
మిథున రాశి వారు బహుముఖ ప్రజ్ఞతో మరియు అనుకూలతతో ఉంటారు. అయితే ఇది కొన్నిసార్లు అనిశ్చితికి, సంబంధాల్లో నిబద్ధత లేకపోవడానికి దారితీస్తుంది. నిరంతరం మారుతున్న వారి ఆసక్తులు, అవసరాలకు అనుగుణంగా ఉండే భాగస్వామిని కనుక్కోవడం మిథున రాశి వారికి కష్టంగా ఉంటుంది.

సింహం:
సింహరాశి వారు నమ్మకంగా ఉంటారు. అందరినీ ఆకర్షించే వ్యక్తిత్వం వారి సొంతం. కానీ వారు కొన్నిసార్లు అహంభావం ప్రదర్శిస్తారు. సంబంధంలో ఉన్నప్పుడు వారిదే పైచేయిగా ఉండాలని కోరుకుంటారు. ప్రేమలో ఇబ్బందులకు దారితీసే పనులు చేస్తుంటారు. ఈ కారణాల వల్ల వారు ఎక్కువ కాలం సంబంధంలో ఉండలేరు.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. క్షణాల్లో నిర్ణయాలు తీసేసుకుంటారు. కొన్ని సార్లు భాగస్వామికి విలువ ఇవ్వాలన్న సంగతి కూడా వారికి గుర్తుండదు. దీని వల్ల భాగస్వాములు అసంతృప్తిగా, నిరాశగా ఫీలవుతారు. ఇలాంటి కారణాల వల్ల సంబంధంలో కొనసాగడం కష్టంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
