Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
ఈ రాశుల వారు ప్రేమ పెళ్లికే మొగ్గు చూపుతారట...! మీ రాశి ఉందేమో చూడండి...
మన దేశంలో చాలా మంది రాశి చక్రాలను బలంగా నమ్ముతూ ఉంటారు. అలా నమ్మే వారికి, వారి రాశి చక్రాల ఫలితాల మీద ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలో, ప్రతి ఒక్క రాశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ మరియు వివాహం వంటి విషయాలలో చాలా అనుకూలతలు మరియు ప్రతికూలతలు కనిపిస్తూ ఉంటాయి.

దీని వల్ల ఈ రాశి చక్రాల వారి జీవితాలు ఒక్కోసారి తారజువ్వలాగా వెలిగిపోతుంటాయి లేదా వారి జీవితాలు అల్లకల్లోలంగా మారుతూ ఉంటాయి. అలా ప్రతి రాశి చక్రం వారికి వారి గ్రహం, అనుగ్రహం, నక్షత్రాలను బట్టి వారి ఆలోచనలు, ప్రవర్తన, సంబంధం వంటి విషయాలపై ప్రభావం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.

ఏయే రాశి చక్రాల వారికి వారి వ్యక్తిగత జీవితంలో మరియు వైవాహిక జీవితం వంటి అంశాలు వారి జన్మ రాశులతో ముడిపడి ఉంటాయి. ఈ సందర్భంగా ఏయే రాశుల్లో జన్మించిన వారు ఎక్కువగా ప్రేమ వివాహంపై ఆసక్తి చూపుతారో ఇప్పుడు తెలుసుకుందాం...

వృషభరాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారు ఎక్కువగా ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా నడుపుతూ ఉంటారు. అలాగే ప్రేమ వివాహాలపై ఎక్కువగా ఆసక్తిని చూపుతారు. అంతేకాదు వీరు ఎవరిని అయితే ప్రేమిస్తారో వారినే తమ జీవిత భాగస్వామిని చేసుకుంటారు. వీరి ప్రేమ వివాహానికి ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటిని అధిగమించి వివాహం చేసుకుంటారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు చాలా సులభంగా ప్రేమలో పడే అవకాశం ఉంది. అయితే ప్రేమలో పడిన తర్వాత ప్రేమ వివాహంపై బాగానే ఆసక్తి చూపుతారు. అయితే వీరి వివాహం విజయం సాధించాలంటే వీరు చాలా గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే, వారిని జీవితాంతం గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు. అంతేకాదు తమ ప్రేమలో వీరు గనుక విజయం సాధిస్తే మాత్రం వారి జీవిత భాగస్వామిని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు పై మూడు రాశి చక్రాల మాదిరిగానే ప్రేమ వ్యవహారాలను చాలా చాకచక్యంగా నడుపుతారు. అలాగే ప్రేమ వివాహాలపై చాలా ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే వీరికి శుక్రదశ ప్రతికూలంగా ఉంటే మాత్రం వీరికి ప్రేమలో ఓటమి తప్పదు. ఒకవేళ వీరు ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ, వారి జీవితంలో వారు అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో విడాకులకు కూడా దారి తీస్తుంది.

మీన రాశి..
ఈ రాశి వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. వీరు ఎవ్వరినైనా ప్రేమిస్తే.. ఎంత దూరమైనా వెళ్తారు. అంతేకాదు. తాము ప్రేమించిన భాగస్వామిని ప్రేమ వివాహం చేసుకునేందుకు చాలా పట్టుదలతో ఉంటారు. వీరి ప్రేమలో నిజాయితీ ఉంటే వీరికి ఓటమి అనేదే ఎదురవ్వదు.

వైవాహిక జీవితంలో..
పై రాశుల వారందరికీ కళత్ర స్థానం 7, 8 స్థానాలను వైవాహిక జీవితం నిర్ణయించబడుతుంది. ఓ వ్యక్తికి రాశి చక్రంలో 7, 8 స్థానాలు అనుకూలంగా ఉండి, దుష్ట గ్రహాల ప్రభావం ఏమి లేకపోతే మాత్రం వారందరికీ పెద్దలు కుదిర్చిన పెళ్లి మాత్రమే జరుగుతుందట.

ఈ రెండూ బలంగా ఉంటే..
అదే విధంగా కళత్ర స్థానం, పూర్వ పుణ్య స్థానం రెండూ చాలా బలంగా ఉంటే మాత్రం సన్నిహితులు, బంధువులతో పెళ్లి నిశ్చయమవుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.



Click it and Unblock the Notifications