Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
ఈ రాశుల వారు పైకి ఒకలా, లోపల మరోలా ఉంటారు.. వారిది సీక్రెట్ లైఫ్
ఏ కారణాల వల్ల అయినా కొన్ని రాశుల వారు చాలా రహస్యాలను దాస్తుంటారు. సీక్రెట్ లైఫ్ జీవించడానికి ఇష్టపడే రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికీ రహస్యాలు ఉంటాయి. వాటిని ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. సీక్రెట్స్ ఏవైనా ఉండొచ్చు. కానీ వాటిని వారితో మాత్రమే ఉంచుకుంటారు. ప్రేమ వ్యవహారం, దొంగతనం, చెడు పని, మోసం చేయడం, అబద్ధం చెప్పడం ఏవైనా కావొచ్చు వాటిని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు.

ఏ కారణాల వల్ల అయినా కొన్ని రాశుల వారు చాలా రహస్యాలను దాస్తుంటారు. సీక్రెట్ లైఫ్ జీవించడానికి ఇష్టపడే రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యరాశి:
కన్యరాశి వారు రహస్యాలను ఎక్కువగా దాచిపెడుతుంటారు. పైకి కనిపించేలా లోపల ఉండరు. కన్యరాశి వారు అంతర్ముఖులు. లోపల ఒకలా అనుకుంటారు, బయటకు మరోలా స్పందిస్తుంటారు. కన్యరాశి వారి మనస్తత్వం వేరుగా ఉంటుంది. కన్యరాశిని మెర్యురీ పాలిస్తుంది.

కుంభరాశి:
కుంభరాశి వారు అంత సులభంగా నిజాలు చెప్పరు. కుంభరాశి వారు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. కానీ నిజాలు చెప్పడంలో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. అనవసరం విషయాలు ఏమాత్రం మాట్లాడరు. కుంభరాశి వారికి రహస్యాలు చెబితే అవి ఎప్పుటికీ వారిలోనే ఉంటాయి. ఏ సందర్భం వచ్చినా వారు వాటి గురించి బయటకు చెప్పరు.
సీక్రెట్స్ దాచడంలో కుంభరాశి వారు వారికి వారే సాటి. పైకి కనిపించేది ఒకటి లోపలి ఇంకొకటి ఉంటుంది.

సింహరాశి:
సింహ రాశి వారు బోలా మనుషులు. మనసులో ఏమనుకుంటారో అది ముఖం మీద చెప్పేస్తారు. కానీ రహస్యాల విషయానికి వస్తే మాత్రం వారు ఎట్టిపరిస్థితుల్లోనూ బయట పడరు. వారు చెప్పకూడదని ఒకసారి అనుకుంటే ఏది ఏమైన దాని గురించి బయటకు చెప్పరు.
సింహ రాశి వారు మనసులో ఉండే రహస్యాలతో మరో రహస్య జీవితం గడుపుతున్నట్లుగానే ఉంటుంది. సింహ రాశి వారు తమ అభిరుచిని కలిగించే ఏ పాత్రనైనా పోషించడంలో అద్భుతంగా ఉంటారు.

మిథునరాశి:
రహస్యాలు దాచడంలో మిథున రాశి వారు సిద్ధహస్తులు. పరిస్థితులను బట్టి తమ తీరును మార్చుకుంటారు. మాటలను పొదుపుగా వాడతారు. అందుకే మిథున రాశి వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.
మిథునరాశి వారిలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడం చాలా కష్టం. అబద్ధాలు చెప్పడం, నిజాన్ని దాచడం రెండు జీవితాలను గడపడంలో మిథున రాశి వారు మాస్టర్ మైండ్‌లు.

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారు రహస్యంగా ఉంటారు. కాబట్టి వారితో ఇంకా ఏమి జరుగుతుందో ఎప్పటికీ తెలియదు. వృశ్చిక రాశి వారు ప్రైవేట్ జీవితాన్ని గడుపుతారు. వృశ్చిక రాశి వారు చాలా వ్యూహాత్మకంగా బతుకుతారు. రహస్య జీవితాలను ప్లాన్ చేయడంలో వారికి ఎంతో నేర్పు ఉంటుంది.
అత్యంత సన్నిహితులతో కూడా వృశ్చిక రాశి వారు రహస్యాలు పంచుకోరు. వారి మదిలో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు ఎక్కువగా సైలెంట్‌గా ఉంటారు. పీతలు రాత్రిపూట మాత్రమే బయట తిరిగినట్లుగా కర్కాటక రాశి వారు కూడా వారి వ్యక్తిగత సమయంలోనే మాత్రమే స్వేచ్ఛగా ఉంటారు.
కర్కాటక రాశి వారు సంక్లిష్టమైన వ్యక్తులు. రహస్యంగా ఉంటారు. కర్కాటక రాశి వారిని మోసం చేయడం అంత సులభం కాదు.

మకరరాశి:
మకరరాశి వారు నిశబ్ధంగా ఉంటారు. తక్కువగా మాట్లాడతారు. అంత త్వరగా కోపం రాదు. అందుకే వీరి మనసులో ఏముందో అంత సులభంగా తెలుసుకోలేము. రహస్యాలను దాచే విషయంలో వీరు సిద్ధహస్తులు.
మకరరాశి వారికి నిబద్ధత, విధేయత ఎక్కువ. వారిని నమ్మి ఏదైనా సీక్రెట్ చెబితే ఎట్టిపరిస్థితుల్లో దాని గురించి బయటపెట్టరు. కుటుంబసభ్యులకు, జీవిత భాగస్వామితో కూడా సీక్రెట్స్ షేర్ చేసుకోరు. వీరి మనస్సులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం.



Click it and Unblock the Notifications