Latest Updates
-
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా!
ఈ రాశుల వారు గాసిప్స్ లేకుండా ఒక్కరోజూ గడపలేరట...!
మనం ప్రతిరోజూ కొన్ని విషయాల్లో గాసిప్స్ వింటూ ఉంటాం. ముఖ్యంగా సినీ, స్పోర్ట్స్, పాలిటిక్స్ రంగాల్లో ప్రతి క్షణం ఏదో గాసిప్ బయటకు వస్తూనే ఉంటుంది.

అయితే గాసిప్స్ లో నిజం ఉండనప్పటికీ.. వినడానికి అవి ఎప్పుడూ బాగానే ఉంటాయి. అందుకే గాసిప్స్ ను చాలా మంది ఇష్టపడతారు. ఉదాహరణకు నిజం నిద్ర లేచేలోపే.. గాసిప్స్ ఊరంతా స్ప్రెడ్ అయిపోతాయట.

కొందరికి ఉదయం లేచిందగ్గర్నుంచి గాసిప్స్ స్ప్రెడ్ చేయడం అలవాటుగా ఉంటుంది. ఇలా కబుర్లు చెప్పేవాళ్లలో మహిళలు మాత్రమే కాదు.. మగాళ్లు సైతం చాలా మందే ఉంటారట. ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారు గాసిప్స్ ను బాగా ఇష్టపడతారట. ఇంతకీ ఆ రాశి చక్రాలేవో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
ఈ రాశి వారు అత్యంత సీక్రెట్ విషయాలను సైతం ఎలాంటి సంకోచం లేకుండా అందరితోనూ షేర్ చేసుకుంటారట. అంతేకాదు కొన్ని విషయాలకు మసాలా వంటివి జోడించి తెగ గాసిప్స్ చెబుతుంటారట. మరీ ముఖ్యంగా ఇతరులను కించపరిచేలా గాసిప్స్ క్రియేట్ చేస్తారట. అంతేకాదు ఎక్కడో వినిపించిన వదంతులకు ముడిపెట్టి కొన్ని విషయాలను చెప్పడం వల్ల అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తారట. ఆసక్తకిరమైన విషయమేమిటంటే.. వీరికి గిట్టని వారిపై లేనిపోని గాసిప్స్ ను ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుంటారు. వాస్తవాలను కాదని.. ఎక్కువగా పుకార్లను స్ప్రెడ్ చేస్తుంటారు.

మిధున రాశి..
ఈ రాశి వారు గాసిప్స్ ను తెగ ఇష్టపడతారు. వీరు ఎల్లప్పుడూ పుకార్లను వినేందుకు సిద్ధంగా ఉంటారు. తాము ఏ పనిలో ఉన్నా.. ఎంత బిజీగా ఉన్నా.. గాసిప్స్ అంటే చాలు అన్నీ పక్కనబెట్టేస్తారు. తమకు తెలిసిన వారి గురించి ఏవైనా పుకార్లు ఉన్నాయంటే.. చాలు వారు ఏది చెప్పినా శ్రద్ధ వింటూ ఉంటారు. మరోవైపు ఈ రాశి వారికి ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు. ప్రతిరోజూ వాళ్ల లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. వీరికి వీరి గురించి కంటే.. ఇతరుల గురించి ఎక్కువ ఫోకస్ ఉంటుంది.

వృశ్చికరాశి..
ఈ రాశి వారు తమ సబ్జెక్ట్ విషయానికొస్తే, తమ రహస్యాలను ఎవరితోనూ షేర్ చేసుకోరు. అయితే అవతలి వ్యక్తుల యొక్క సీక్రెట్లను తెలుసుకోవడంలో మాత్రం ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. అయితే ఈ రాశి వారిని నమ్మడం అంత సులభం కాదు. ఎందుకంటే వీరు పుకార్ల విషయంలో ఎప్పుడు, ఎక్కడ, ఎలా వ్యవహరిస్తారో వీరికే తెలియదు. కాబట్టి మీరు ఏదైనా గాసిప్స్ స్ప్రెడ్ చేయాలనుకుంటే వీరికి చెబితే చాలు.. ఆటోమేటిక్ గా అవి దావనంలా వ్యాపిస్తాయి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు పుకార్లను ఎక్కువగా నమ్ముతారు. అంతేకాదు వీరు కూడా గాసిప్స్ స్ప్రెడ్ చేస్తారు. దాని గురించి ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. గాసిప్స్ వినడాన్ని వీరు ఎంతో సంతోషంగా ఫీలవుతారు. వీరికి ప్రతిరోజూ ఇదే పనిగా ఉంటుంది. వీరు ఏ విషయాన్ని కొంచెం స్పష్టంగా చెప్పరు. కొంచెం సస్పెన్స్ లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. అయితే సమయం వచ్చినప్పుడు వాటిని రివిల్ చేస్తారు.

మీన రాశి..
ఈ రాశి వారు చాలా విషయాల్లో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. అయితే వీరు పుకార్లను ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా తమ ఫ్రెండ్స్ గురించి తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అందులోనూ వారి డేటింగ్, లవ్ మ్యాటర్ల గురించి వినేందుకు ఇష్టపడతారు. వారి జీవితంలో జరిగిన ప్రతికూల విషయాలను కూడా తెలుసుకోవాలనుకుంటారు. కానీ మంచి విషయం ఏంటంటే.. వీరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ను ఎవ్వరితోనూ షేర్ చేసుకోరు. అలాగే తమ ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు కూడా ప్రయత్నించరు. పుకార్లను కేవలం వ్యక్తిగత ఆనందం కోసమే వాడుకుంటారు.



Click it and Unblock the Notifications











