For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మకరరాశితో ఈ రాశుల వారు ఆనందంగా గడిపేస్తారట... మీ రాశి ఉందేమో చూసెయ్యండి...

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మకర రాశి వారు స్థిరంగా ఉండే మనస్తత్వం కలవారు. వీరు ఇతరుల నుండి ప్రశంసలు, పొగడ్తలు పొందేందుకు తమదైన శైలిలో ఆలోచిస్తారు. వీరు నిరంతరం ఈ విశ్వాన్ని.. అందులోని ప్రజలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

ఇదిలా ఉండగా.. ఈ రాశి వారు బంధానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. వీరు రిలేషన్ షిప్ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. సంతోషకరమైన బంధానికి వీరు ఎంతో విలువ ఇస్తారు. వీరు ఎదుటి వ్యక్తులను చాలా సులభంగా అర్థం చేసుకుంటారు.

అయితే వీరు ఎవరితో అయినా విడిపోవాలనుకుంటే.. అలాంటి పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు వెళ్తారు. అందుకే ఈ రాశి వారు ప్రేమ విషయంలో అంత ఈజీగా నిర్ణయం తీసుకోరు. ఒక వ్యక్తితో తాము లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటామన్న నమ్మకం వచ్చాకే రిలేషన్ షిప్ లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే వీరు ప్రేమను చాలా సీరియస్ గా తీసుకుంటారు.

వీరు ఎప్పటికీ ప్రేమను లైట్ తీసుకోరు. ఒకసారి విడిపోయాక వీరు మళ్లీ రిలేషన్ షిప్ లోకి రావడం అనేది దాదాపు జరగదు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఈ రాశుల వ్యక్తులతో మకర రాశి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో విడిపోవద్దని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీరితో విడిపోతే.. నిజంగానే మీరు జీవితాంతం బాధపడాల్సి వస్తుందట. ఇంతకీ ఆ రాశి చక్రాలేవి? ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి.

సొంత రాశిలోకి శని సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...

వృషభరాశి..

వృషభరాశి..

ఈ రాశి వ్యక్తులు మకర రాశి వారితో కలిసి జీవితాన్ని ప్రారంభిస్తే.. వారు జీవితాంతం ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ రాశి వారు లగ్జరీ లైఫ్ కావాలని కోరుకుంటారు. అయితే వీరు ఖర్చుల విషయంలో కొంత కఠినంగా ఉంటారు. వీరికి పొదుపు చేసే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అందుకే మకర రాశి వ్యక్తులతో ఈ రాశి వారికి బ్యాలెన్స్ కుదురుతుంది. వీరిద్దరూ కలిసి ఆనందంగా గడిపేందుకు ఎంత డబ్బు వాడాలో ఈ రాశి వారికి బాగా తెలుసు. అయితే వీరి మొండి పట్టుదల కారణంగా కొన్నిసార్లు మీ బంధంలో చీలికలు రావొచ్చు. అయితే మకరరాశి వారు వృషభరాశి వ్యక్తులను పెళ్లి చేసుకుని.. వారికి దూరంగా వెళ్తే మాత్రం లైఫ్ లో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామితో చాలా సరదాగా గడుపుతారు. వీరు తమ వ్యక్తిగత విషయాలన్నింటినీ పార్ట్నర్ తో షేర్ చేసుకుంటారు. వీరి మనసుకు నచ్చిన వ్యక్తులు దొరికితే చాలు వీరి జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి వెనుకాడరు. హ్యాపీ లైఫ్ రిలేషన్ సెట్ చేసుకోవడంలో ఈ రాశి వారు మంచి ప్రావీణ్యం కలవారు. ఇలాంటి లక్షణాలే వీరిని ఎదుటి వ్యక్తులు ఇష్టపడేలా చేస్తుంది. అందుకే వీరు మకరరరాశి వ్యక్తులతో సులభంగా కలిసిపోతారు. అంతేకాదు వీరి బంధం చాలా బలంగా ఉంటుంది. అయితే ఈ రాశి వ్యక్తులు చాలా సున్నితంగా ఉంటారు. చిన్న విషయాలకే బాధపడతారు. ఇలాంటి కారణాల వల్ల వీరు తమ బంధానికి బ్రేకులు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తులను ఎప్పటికీ వదులుకోకండి. వారితో మీ జీవిత ప్రయాణం చాలా బాగుంటుంది.

ఈ వారం మీ జాతకం ఎలా ఉందో చూడండి...

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు దాదాపు మకర రాశి వారికి ఉండే లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ఏదైనా సమస్య వస్తే.. దాని మూలాలకు వెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు అన్ని పనులు చాలా సులభంగా సాగిపోతాయి. వీరి జీవితం చాలా అన్యోన్యంగా సాగుతుంది. ఈ రాశి వ్యక్తులు తమ ఫీలింగ్స్ ను బయటకు చెప్పుకోరు. సమాజంలోని వ్యక్తులను బాగా గమనిస్తారు. కాబట్టి ఈ రాశి వ్యక్తులతో బంధానికి బ్రేకప్ చెప్పాల్సి వస్తే మకర రాశి వారు చాలా బాధపడతారు.

ఎవ్వరూ ఇష్టపడరు..

ఎవ్వరూ ఇష్టపడరు..

ఈ రాశి వారు చాలా సరదాగా, సంతోషంగా ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదు వీరు చాలా విషయాల్లో బాధ్యతగా వ్యవహరిస్తారు. వీరు తమ స్నేహితుల కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు వెనుకాడరు. వీరికి తెలిసిన వ్యక్తులు ఏదైనా సమస్యలో ఉంటే, వీరి సామర్థ్యం మేరకు వారికి సహాయం చేస్తారు. వీరు ఆలోచనలు, మాటలే కాదు ఆచరణలోనూ నిజాయితీగా ఉంటారు. వీరు స్నేహితులు నెగిటివ్ గా ఆలోచిస్తుంటే.. వారిలో సానుకూలతను పెంచి.. వారికి ప్రేరణ కలిగించే మాటలతో వారిని ప్రోత్సహిస్తారు. వారు బాధ పడే విషయాల నుండి బయటకు తీసుకొచ్చేస్తారు. అందుకే ఈ రాశి వారు చాలా గొప్ప గుణం ఉన్న వ్యక్తులు. ఇంత మంచి వ్యక్తిత్వం ఉండే వారిని ఎవ్వరూ అంత త్వరగా వదులుకోవడానికి ఇష్టపడరు.

English summary

These Zodiac Signs Most Likely To Be Capricorn's Soulmates

Here are these zodiac signs most likely to be capricorn's soulmates. Take a look
Story first published: Tuesday, October 12, 2021, 13:20 [IST]