Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ 5 రాశుల వారు క్రియేటివ్ గా ఆలోచిస్తారంట.. మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
ఈ రాశుల వారు క్రియేటివ్ థింకింగ్ ఎక్కువగా చేస్తారంట.
మన దేశంలో సాధారణంగా ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఎన్నో వ్యవహారాలు పురాతన కాలం నుండి ఉన్నాయి. అలాంటి వాటిని ఇప్పటికీ అనుసరిస్తూ ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు చాలా మంది.

ఇదిలా ఉండగా.. ఇలాంటి పాత పద్ధతులను పక్కనబెట్టి కొందరు విభిన్నంగా మరియు కొంచెం కొత్తగా.. సింపుల్ గా చెప్పాలంటే క్రియేటివ్ గా ఆలోచించి లైఫ్ లో వారికి నచ్చినట్టు జీవిస్తున్నారు.

అంతేకాదు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదంతా ఆ వ్యక్తుల యొక్క లక్షణాలు మరియు ఆలోచనా విధానాలు మరియు వారి రాశిచక్ర గుర్తులపై ఆధారపడి ఉంటాయని

జ్యోతిష్యశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఇలా క్రియేటివ్ గా ఆలోచించే రాశిచక్రాల వ్యక్తులెవరో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి...

వృషభరాశి..
ఈ రాశి వారు ఈరోజు ఏదైనా విషయం గురించి చాలా లోతుగా ఆలోచిస్తారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటుగా ఆలోచించరు. దేని గురించి అయినా వీరు ఆలోచన మొదలుపెట్టారంటే దాని గురించి పూర్తిగా అధ్యయనం చేసేందుకు ఇష్టపడతారు. అలాగే వీరికి భావోద్వేగాలను మరియు ఆలోచనలను సాధారణ సమయాల్లో ఎలా వ్యక్తీకరించాలో బాగా తెలుసు. అందుకే వీరికి క్రియేటివ్ థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి.

సింహ రాశి..
ఈ రాశి వారు చాలా తెలివైనవారు. ఆలోచనలలో వీరి శైలి ప్రత్యేకంగా ఉంటుంది. వీరు ఏదైనా విషయం గురించి ఆలోచించేటప్పుడు చాలా సానుకూలంగా ఉంటారు. అసలు ప్రతికూలత, నిరాశ అనేది వీరి డిక్షనరీలోనే ఉండదు. అందుకే వీరు ఏ విషయం గురించి చాలా కచ్చితత్వంగా ఆలోచిస్తారు. అదే సమయంలో చాలా ధైర్యంగా మరియు నిర్భయంగా ఉంటారు.

తుల రాశి..
ఈ రాశి వారు కూడా సింహ రాశి మాదిరిగానే చాలా తెలివి గలవారు. అయితే వీరు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు అందరి మాదిరిగా సానుకూలంగా, సాధారణంగా ఆలోచించరు. వీరు ఆలోచనల్లో మేధావుల మాదిరిగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. అలాంటి వాటి గురించి విభిన్నమైన ఆలోచనలు చేస్తారు. ఎవ్వరూ ఊహించని మార్గాల్లో వీరి సమస్యలను పరిష్కరించుకుంటారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు ఏదైనా విషయం గురించి ఆలోచన మొదలుపెట్టేటప్పుడు చాలా స్వేచ్ఛగా, సాహసోపేతంగా ఉండాలని నమ్ముతారు. అందుకే వీరు సాంప్రదాయక ఆలోచనా విధానాలకు అస్సలు లొంగరు. వీరి అలవాట్లు, అభిరుచులు, అభిప్రాయాలు ఎల్లప్పుడూ కొంత విచిత్రంగా ఉంటాయి. అందుకే వీరు ఆలోచన వంటి విషయాల్లో అసాధారణంగా ఉంటారు.

మీన రాశి..
ఈ రాశి వారు సామాజిక అంశాల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు. అందువల్ల వీరు ఎల్లప్పుడూ చాలా భిన్నంగా ఆలోచిస్తారు. అయితే వీరికి ఫాంటసీలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు అందులోనే ఎక్కువగా జీవిస్తుంటారు. కానీ వీరు ఎట్టి పరిస్థితులలో నెగిటివ్ థింకింగ్ అనే దానికి అస్సలు అవకాశం ఇవ్వరు. ఎల్లప్పుడూ పాజిటివ్ గా నే ఆలోచిస్తారు. అలాగే క్రియేటివ్ గా ఆలోచించడంలో కూడా అందరి కంటే ఒక అడుగు ముందుకే వేస్తారు.



Click it and Unblock the Notifications