Latest Updates
-
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో ఈ వస్తువులు ఉంచొద్దు, ఉంచితే చెడు జరుగుతుంది
వాస్తు ప్రకారం ఎలాంటి వస్తువులు బెడ్రూములో ఉంచొద్దు, ఎలాంటి వస్తువులు ఉంచితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బెడ్రూము శారీరక, మానసిక విశ్రాంతి ఇచ్చే ప్రదేశం. బయట, ఇంట్లో ప్రతికూల పరిస్థితులతో ఇబ్బంది పడ్డా బెడ్రూములో మాత్రం ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతత లేకపోతే అది పడకగది అనిపించుకోదు. వాస్తు దోషాల వల్ల బెడ్రూములో కొన్ని రకాల వస్తువులు ఉంచడం వల్ల ప్రశాంతత దూరమవుతుంది. నిద్రలేమి సమస్య బాధిస్తుంది.

వాస్తు ప్రకారం ఎలాంటి వస్తువులు బెడ్రూములో ఉంచొద్దు, ఎలాంటి వస్తువులు ఉంచితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంచొద్దు:
బెడ్రూములో టెలివిజన్లు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉంచకూడదు. ఎలక్ట్రానిక్ రేడియేషన్‌కు నిరంతరం బహిర్గతం కావడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. దీని వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పడకగదిలో తప్పనిసరిగా ఈ పరికారలను ఉపయోగించినట్లయితే, నిద్రవేళకు కనీసం ఒక గంట ముందు వాటిని ఆఫ్ చేయాలి. వాస్తు ప్రకారం కూడా ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. ఆలుమగల మధ్య సాన్నిహిత్యం దెబ్బతింటుంది.

పదునైన వస్తువులు ఉంచొద్దు:
పడకగదిలో పదునైన లేదా కోణాల వస్తువులను ఉంచకూడదు. కత్తులు, కత్తెరలు, ఇతర పదునైన వస్తువుల బెడ్రూములో ఉంచితే అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. బెడ్రూములో ఉంచడం వల్ల దంపతుల మధ్య గొడవలు జరుగుతాయి.

అద్దాలు ఉంచకూడదు:
పడకగదిలో అద్దాలు ఉంచకూడదు. అద్దాలు శక్తిని ప్రతిబింబిస్తాయి. బెడ్రూములో శాంతియుత శక్తిని భంగపరుస్తాయి. తప్పనిసరిగా గదిలో అద్దం ఉంటే పడుకునే ముందు దానిని కవర్ చేయాలి. బెడ్‌కు అభిముఖంగా అద్దం ఉంచకూడదు. దీని వల్ల దంపతుల మధ్య గొడవలు జరుగుతాయి.

బిల్లులు ఉంచకూడదు:
బెడ్రూములో ఒత్తిడి కలిగించే జ్ఞాపకాలను ఉంచకూడదు. నిద్రించే ముందు అవి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. బిల్లులు కూడా ఉంచకూడదు.
బెడ్రూము విశ్రాంతి, ప్రశాంత కోసమే అన్నట్లుగా ఉండాలి. వీలైనంత వరకు పడకగది శుభ్రంగా ఉంచుకోవాలి. నిద్రకు భంగం కలిగించే ఏ వస్తువులను బెడ్రూములో ఉంచకూడదు.



Click it and Unblock the Notifications
