For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వంటి కష్టకాలంలో మహిళల పవర్ ఏంటో చూపించాల్సిందే...!

|

మార్చి మాసం వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మహిళా సాధికారత గురించే మాట్లాడుతుంటారు. కేవలం మహిళా దినోత్సవం రోజున అమ్మాయిలను ఆకాశానికి ఎత్తేసి ఆ మరుసటి రోజు నుండే వారిని ఎదగనీయకుండా చేసేస్తుంటారు.


ఇలా చేయడం వల్ల మనకు ఎలాంటి ఫలితం ఉండదు. అసలు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారో అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అయితే అమ్మాయిల కోసం ఎవ్వరూ ప్రత్యేకంగా ఏమి చేయాల్సిన అవసరం లేదంటున్నారు కొందరు ప్రముఖులు.
వారిని కేవలం మనషులుగా ముఖ్యంగా పురుషులతో సమానంగా చూస్తే సరిపోతుందంటున్నారు. మన సమాజంలో మహిళలను అన్ని రంగాల్లో భాగమయ్యేందుకు, నవసమాజ స్థాపనలో మహిళలకు భాగస్వామ్యం కల్పించేందుకు ముఖ్యంగా వారి హక్కులను వారు అనుభవించి స్వతంత్రంగా జీవించేలా, వారిని ప్రోత్సహించేందుకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
ప్రతి ఏటా మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. అయితే మహిళలు పూర్తి సాధికారత సాధించాలంటే ఏమి చేయాలి.. వారికి ఎలాంటి సలహాలు, సూచనలు, శిక్షణలు ఇవ్వాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

International women's day 2021:ప్రతి ఒక్క అమ్మాయికీ ప్రేరణనిచ్చే మహిళలు వీరే...

అవగాహన పెరగాలి..

అవగాహన పెరగాలి..

ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క మహిళ సాధికారత సాధించాలంటే ముందుగా వారిలో సాధికారత రావాలి. అందుకే ఐక్య రాజ్య సమితి(UNO) మహిళా విభాగం ప్రతి ఏటా ఒక థీమ్ ని ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది కూడా కరోనాను ఎదుర్కొనేందుకు మహిళలు నాయకత్వం తీసుకోవాలనే థీమ్ ను సిద్ధం చేసింది. దీని ఆధారంగానే ఈ ఏడాది మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు.

ఇంతకుముందు..

ఇంతకుముందు..

ఇంతకుముందు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో మహిళల సంఖ్య పెరిగేలా థీమ్ ను ఎంపిక చేశారు. ఇప్పుడు కరోనా నివారణకు చర్యలు తీసుకునేందుకు మహిళలు నాయకత్వం తీసుకోవాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కలవరపెడుతున్న కరోనాను నివారించడంలో మహిళలందరూ కీలక పాత్ర పోషించి లక్ష్య సాధన దిశగా నడవాలన్నదే ఈ థీమ్ ఉద్దేశ్యం.

#HimaDas: హిమదాస్ ఎవరు? ఇంత చిన్న వయసులో డిఎస్పీ ఎలా అయ్యిందో తెలుసా...

అవకాశాలు పెరిగాయి..

అవకాశాలు పెరిగాయి..

మారుతున్న కాలానికి అనుగుణంగా.. ప్రతి రోజూ ఎంతగానో అభివ్రుద్ధి చెందుతోన్న సైన్స్, టెక్నాలజీ రంగంలో మహిళలు అవకాశాలు అందిపుచ్చుకుని, అద్యయనాల ప్రకారం అన్ని రంగాల్లో సాధికారత సాధించాలి. ఇలా జరిగినప్పుడే లింగ భేదం లేకుండా పురుషులతో సమానంగా ఆవిష్కరణలకు మార్గం సులభమవుతుంది.

మహిళల ఆలోచనలు..

మహిళల ఆలోచనలు..

అయితే మహిళల ఆలోచనలు దీనికి భిన్నంగా ఉంటున్నాయి. వీరి ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. వారి అవసరాలను చాలా తక్కువ మందే గుర్తిస్తున్నారు. వీరి అనుభవాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదు. ఈ పరిస్థితిని మార్చి అన్ని రంగాల్లో స్రీ ప్రాభవాన్ని, ప్రాధాన్యాన్ని పెంచేలా ఈ ఏడాది క్రుషి చేయనున్నారు.

మరింత వేగంగా..

మరింత వేగంగా..

ఇలా లింగ భేదంలో సమానత్వం సాధించిన తర్వాత మహిళలు, బాలికల ఎదుగుదలకు అవసరమైన, అనువైన వాతావరణాన్ని కల్పించే దిశగా చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నం విజయవంతంగా జరిగి మహిళల పరిస్థితిలో మార్పు రావాలని మనమంతా కోరుకుందాం.

English summary

Think Equal build smart innovate for change this year women's day

Here we are talking about the think equal build smart innovate for change this year women's day. Read on
Story first published: Friday, March 5, 2021, 9:00 [IST]